Want To Know More About Savitri Gari Life ? These Books Tell The Deeper Story!

 

బహుశా మీరు కూడా మహానటి సినిమా థియేటర్ దగ్గర ఇప్పటికే చూసి ఉంటారు. 10 సంవత్సరాల లోపు పిల్లలు కూడా ఆ మహానటి సావిత్రి గారి గురుంచి తెలుసుకోవడం కోసం వస్తున్నారు. పెద్దవారితో పాటుగా చిన్నపిల్లలు కూడా రావడంతో ఒక విషయం స్పష్టమైంది. సావిత్రి గారు తెలుగు ప్రజలకు ఓ కుటుంబ సభ్యురాలయ్యారు అని.. ఓ దిగివ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, నాట్యం నేర్చుకుని, అలవోకగా దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమను ఏలి, ఎలా హృదయవిధారకంగా అటు కెరీర్ పరంగా, ఇటు జీవితంలోనూ ఎలా పతనమయ్యారని ప్రేక్షకులు సినిమా ద్వారా తెలుసుకోగలిగారు. ఐతే సినిమాకు ఒక నిర్దిష్టమైన టైమ్ డ్యూరేషన్ ఉంటుంది, అన్ని సంఘటనలు చూపించడం సాధ్యపడదు. అందుకే సావిత్రి గారి జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను తెలుసుకోవాలని ఆశించే వారికోసం ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ఈ ఆర్టికల్ లో పొందుపరిచె పుస్తకాలు, యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా మరింత ఎక్కువ తెలుసుకునే అవకాశం ఉంది.

1. A legendary Actress Mahanti Savitri:

హిందువులకు భగవద్గిత, ముస్లిం లకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్ ఎలానో సావిత్రి గారిని అభిమానించే వారికి వి.ఆర్. మూర్తి, సోమరాజు గారు రాసిన ఈ పుస్తకం అలాగ. వి.ఆర్. మూర్తి, సోమరాజు గారు ఈ పుస్తక రూపకల్పనలో ఎంతగానో శ్రమించారు. సావిత్రి గారు పుట్టిన ఊరు నుండి ప్రతి ప్రాంతాన్ని చేరుకొని, సావిత్రి గారితో అనుబంధం ఉన్న ప్రతి బంధువుని, మిత్రులను కలిసి ఈ పుస్తకాన్ని తయారుచేశారు. సావిత్రి గారి పుట్టినతేదీ నుండి తన జీవితంలో జరిగిన సంఘటనలపై సవాలక్ష అపోహలు ఉన్నాయి. వి.ఆర్.మూర్తి, సోమరాజు గారు ఎంతో రీసెర్చ్ చేసి సావిత్రి గారి పుట్టిన తేది దగ్గరి నుండి ప్రతి సంఘటనను ఆధారాలతో సహా ఈ పుస్తకం ప్రపంచానికి అందజేసింది. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు కూడా ఈ పుస్తకం చదివే కథను రాసుకున్నారు. సావిత్రి గారికి సంబంధించిన సంఘటనలు తెలుసుకోవాలనుకున్న వారు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. (ప్రస్తుతం ఈ పుస్తకం బుక్ స్టాల్ లో దొరకడం అతి కష్టంగా ఉంది. MRP Price 500 ఉన్నా అమెజాన్ లో మాత్రం ఎక్కువ చూపిస్తుంది. ఈ పుస్తకం కావాలి అనుకుంటే, KOTHAPET లోని MARUTI NAGAR community hall దగ్గరకు వెళ్లి 9154542323 నెంబర్ కి కాల్ చేయండి)


 

2. మహానటి సావిత్రి వెండితెర సామ్రాజ్ఞి:

పల్లవి గారు రాసిన “మహానటి సావిత్రి వెండితెర సావిత్రి” పుస్తకం మనకు అన్ని ప్రముఖ బుక్ షాప్స్ లో దొరుకుతాయి. పల్లవి గారు ఈ పుస్తకం కోసం 6 సంవత్సరాలు శ్రమించి ఈ పుస్తకాన్ని రాశారు. అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఆగస్ట్ 20, 2007 లో పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఈ పుస్తకం సావిత్రి గారి జీవితాన్ని కళ్లకు కట్టినట్టుగా వివరించిందని సావిత్రి గారితో అనుబంధం ఉన్న ఎందరో ప్రముఖులు ప్రశంసించారు. దీని MRP Price:250.


 

3. వెండితెర విషాద రాగాలు:

సినీ జర్నలిస్ట్ గా పసుపులేటి రామారావు గారు 40 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నారు. ఇంత experience ఉన్న సినీ జర్నలిస్ట్ రామారావు గారు ఒక్కరే. 40 సంవత్సరాల నుండి రామారావు గారు ఎందరినో ఇంటర్వ్యూ చేశారు. సావిత్రి గారిని రామారావు గారు కొన్ని సందర్భాలలో కలిసి తన జీవితంలో జరిగిన సంఘటనలను అడిగి తెలుసుకున్నారు. సావిత్రి గారి బాల్యం నుండి ఎదుగుదల, జెమినీ గణేషన్ తో వివాహం, మద్యానికి లొంగిపోవడానికి దారి తీసిన పరిస్థితులు మొదలైన విషయాలన్నింటిని కూడా ఈ పుస్తకం సవివరంగా వివరించింది. దీని MRP Price: 200.


 

4. వెండితెరపై వెన్నెల సంతకం:

హెచ్ రమేష్ బాబు గారు రాసిన వెండితెరపై వెన్నెల సంతకం పుస్తకం సావిత్రి గారి జీవితాన్ని వివరించడంతో పాటు సావిత్రి గారిపై ఇండస్ట్రీలోని ప్రముఖులకు ఎందుకంత ఇష్టమో తెలియజేసింది. నాటి నటులు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్. టి. రామారావు, ఎస్వీ రంగారావు దగ్గరి నుండి నేటి దర్శకులు శేఖర్ కమ్ముల, వంశీ, కృష్ణవంశీ, క్రిష్, పూరీ జగన్నాథ్ మొదలైన వ్యక్తుల అభిప్రాయాలను కూడా ఈ పుస్తకం ద్వారా మనం తెలుసుకోవచ్చు.
దీని MRP Price: 200


 

5. సావిత్రి – కరిగిపోయిన కర్పూరకళిక:

తిరుపతి కి చెందిన కంపల్లె రవిచంద్రన్ గారు మంచి సినీ రచయిత. సినీ వ్యాసాలతో పాటుగా నాటి సినీ పరిశ్రమలో జరిగిన కొన్ని సంఘటనలతో వివరించిన “జ్ఞాపకాలు పుస్తకం” కూడా తెలుగువారికి సుపరిచితమే. సావిత్రి గారి 80 వ జన్మదినం నాడు ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. సావిత్రి గారికి సంబంధించిన అరుదైన ఫొటోలతో ఈ పుస్తకాన్ని సృష్టించారు.
దీని MRP Price: 250.


 

6. అభినేత్రి సావిత్రి:

సావిత్రి గారి కథ ఆత్మాభిమానంతో కూడుకున్నది. మనసుకు సాంప్రదాయాలకి మధ్య నలిగిపోయే జీవితాన్ని పరుచూరి పద్మ గారు తన వర్ణనతో హృదయానికి చేరువచేశారు. సంఘర్షణాత్మక అంశాలతో పాటుగా, నటన పరంగానే కాదు సావిత్రి గారిలోని ఇతర టాలెంట్ అంశాలను కూడా ఇందులో మేళవించారు.
దీని MRP Price: 200.


 

Kiran Prabha Talk Show:

పైన పొందుపరిచిన sources అన్ని కూడా పుస్తకాలే. మరి పుస్తకాలు చదవడానికి ఇబ్బంది పడేవారి కోసం ఎలా.? వారికోసమే ఈ యూ ట్యూబ్ ఛానెల్. కిరణ్ ప్రభ గారు సావిత్రి గారి కుమారుడు సతీష్ గారిని కలిసి, సావిత్రి గారి పుస్తకాలు రాసిన రచయితలతో మాట్లాడి, అలాగే నాడు న్యూస్ పేపర్లు, సినీ మ్యాగజైన్ లో వచ్చిన వివిధ ఆర్టికల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించి యూ ట్యూబ్ లో సావిత్రి గారి జీవితాన్ని వాయిస్ ఓవర్ లో వివరించారు. దీనిని మనం ఉచితంగా వినవచ్చు.


 


 

 

అలాగే సావిత్రి గారికి సంభందించిన rare ఫోటోలను కూడా ఈ ఫేస్ బుక్ పేజ్ లో చూడవచ్చు. A legendary actress mahanati Savitri పుస్తకం రాసిన వి.ఆర్. మూర్తి గారు, సోమరాజు గారు కలెక్ట్ చేసిన ఫోటోలను మనం ఈ పేజ్ లో చూడవచ్చు.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , , , ,