Meet Satyaveni, India’s First Woman 3D Bike Artist Who Turns Vehicles Into Surreal Beasts

 

మన స్క్రీన్ ప్లే ఒక విధంగా ఉంటే ఈ కాలం రాసే స్క్రీన్ ప్లే మరో విధంగా ఉంటుంది. ఊహ తెలిసిననాటి నుండి సత్యవేణి(7989692862) చేతిలో టెన్నిస్ రాకెట్ చేతిలో ఉండేది. ఒకానొక సమయంలో జాతీయ స్థాయిలో 50 వ ర్యాంకు కు కూడా చేరుకుంది. ఆ తర్వాతనే కొన్ని చీకటి రోజులు తన జీవితంలోకి ప్రవేశించాయి.. “ఒక రోజు గడవడానికి చీకటిని, వెలుగుని చూడాలి. అదే ఒక జీవితం పూర్తవడానికి ఎన్ని చీకట్లు వెలుగులను చూడాల్సి ఉంటుంది.?”


 

బైక్ అంటే భయం:

నాన్న సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి హైదరాబాద్ లోనే చిన్నతనం నుండి టెన్నిస్ లో కోచింగ్ తీసుకుని మంచి పొజిషన్ లోకి వెళ్ళింది. సరిగ్గా పది సంవత్సరాల క్రితం ఓ టోర్నమెంట్ కోసం అన్నయ్యతో కలిసి బైక్ మీద వెళుతున్నప్పుడు ఓ వ్యక్తి ఎదురుగా వచ్చాడు. అన్నయ్య సడన్ బ్రేక్ వేయడంతో సత్యవేణి క్రింద పడిపోయింది. అటుగా వస్తున్న ఓ బైకర్ అదుపుతప్పి సత్యవేణి కాలు మీద నుండి బైక్ పోనిచ్చాడు. కాలిమడమ విరిగిపోయింది. తనకెంతో ఇష్టమైన టెన్నిస్ ఆడలేకపోవడానికి గల ప్రధాన కారణమైన బైక్ లను చూసి మొదట భయపడేది.



 

జీవితంలో టెన్నిస్ ఆడకూడదు:

యాక్సిడెంట్ తర్వాత మూడు నెలలలో కోలుకోవడానికి ఆకు పసరుతో నాటు వైద్యాన్ని చేయించుకోవడం మొదలుపెట్టింది. మూడు నెలలు అని అనుకున్నది కాస్త ఆరు నెలలు పట్టింది. ఆరు నెలలు ఆడకపోవడం వల్ల ర్యాంకు సున్నాకు పడిపోయింది. ప్రాక్టీస్ ప్రారంభించింది మూడు సంవత్సరాల కఠోర శ్రమతో తిరిగి 50కి చేరుకుంది. ఐతే కొన్నాళ్లకే నొప్పి తిరగబెట్టింది. డాక్టర్ దగ్గరికి వెళ్లి స్కానింగ్ తీస్తే అప్పుడు తెలిసింది, విరిగిన ఎముకను తప్పుగా అమర్చాడని. ఆ తర్వాత వ్యాక్స్ థెరపీ(వేడి మైనాన్ని కాలి మీద పోస్తూ జరిపే ట్రీట్మెంట్) మూడు నెలలు చేయించుకుంది. ఐన పెద్దగా మార్పులేదు. తప్పుగా అమర్చిన ఎముకను విరగొట్టి ఆపరేషన్ తో సరిచేసేదుంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ఈ ఆపరేషన్ కు మూడు సంవత్సరాలు ఆలస్యం అవ్వడంతో కాలి ఎముక పూర్తిగా క్షిణించిపోయింది. వెన్నెముక భాగంలోని ఎముక తీసి అమర్చారు. దీంతో ఇక టెన్నిస్ ఆడడం, పరిగెత్తడం, లాంగ్ జంపింగ్, జిమ్ లాంటివి శాశ్వితంగా చేయలేకపోయింది.



 

అలా బైక్ వచ్చింది:

టెన్నిస్ ఆడలేకపోతున్నందుకు తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్నప్పుడు అమ్మ “నువ్వు ఇలా బాధపడుతూ ఇంట్లో కూర్చోవడం మాకు ఏమాత్రం నచ్చడం లేదు. ఈ బైక్ తాళం తీసుకో, నడపడం నేర్చుకో నీ జీవితంలో కాస్తయినా మార్పు వస్తుంది” అని చెప్పారు. కజిన్ అప్పుడే వచ్చి రాయల్ ఎన్ ఫీల్డ్ మీద తీసుకుని వెళితే సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు సత్వవేణి నడుపుతూ తీసుకువచ్చింది.



 

ఎప్పుడైతే టెన్నిస్ రాకెట్ వెళ్లి చేతిలోకి బైక్ వచ్చిందో అప్పుడే “కళ” కూడా వచ్చేసింది. మొదట తన జీవన ప్రయాణాన్ని బొమ్మల రూపంలో వేసింది. ఆ తర్వాత సోదరి బైక్ మీద పెయింటింగ్ వెయ్యొచ్చు కదా అని సలహా ఇవ్వడంతో బైక్ పెట్రోల్ ట్యాంక్ ల మీద, హెల్మెట్ల మీద వెయ్యడం మొదలుపెట్టింది. ఇందులోనే మరింత రీసెర్చ్ చేసి త్రీడీ డిజైన్లను మొదలుపెట్టింది. ఇది చెప్పినంత సులభం కాదు ఒక్కో త్రీడీ పెయింట్ కు నెల రోజుల సమయం పడుతుంది. పెయింట్ కు తగ్గట్టు క్లే ని అమర్చాలి చిన్న తేడా వచ్చినా ఆకృతి మారిపోతుంది. ఇంత శ్రమతో కూడిన ఆర్ట్ ను భారతదేశంలో మొదటిసారి మన సత్యవేణినే వేస్తున్నది. ప్రస్తుతం సత్యవేణికి తెలుగు రాష్టాలలోనే కాదు ముంబాయ్, ఢిల్లీ, కర్ణాటక, చెన్నయ్ లాంటి ప్రాంతాలలోనూ అభిమానులున్నారు. అంతే కాదు సత్యవేణి ఆర్ట్ నచ్చి రాజ్ తరుణ్ “లవర్” సినిమాలోనూ వాడింది సత్వవేణి బైక్.



 

You Can Follow Her Here

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , , , , , , , ,