Here’s All You Need To Know About “Arjun Reddy” Movie Director Sandeep Reddy And How He Made A Blockbuster Movie!

 

మనం సక్సెస్ లో ఉంటే మనం చేసే ప్రతి పని అందంగానే కనిపిస్తుంటుంది అదే ఫేయిల్యూర్ లో ఉంటే ఏది పనిచేసినా చెత్తగానే కనిపిస్తుంది. ఇప్పుడు అర్జున్ రెడ్డి సక్సెస్ రావడంతో సందీప్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తేసుకుంటున్నారు.. ఈ సక్సెస్ రాకముందు సందీప్ రెడ్డి గారు ఎంతో కష్టపడ్డారు. దానితోపాటు సినిమా వెనుక మనకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం.

 


ఫిజియోథెరపిస్ట్:
సందీప్ వరంగల్ పుట్టిపెరిగారు. కర్నాటకలో ఫిజియోథెరపి పూర్తిచేశారు. కథలను అందంగా, థ్రిల్లింగ్ గా చెప్పే అలవాటు సందీప్ కు చిన్నతనం నుండే ఉండేది. చిన్నతనంలో తన స్నేహితులకు రకరకాల కథలు చెప్పేవారట అది ఎంత దిక్కుమాలిన కథ అని సందీప్ కు అనిపించినా గాని ఎదుటివారికి మాత్రం అది బాగా నచ్చేది. అలా “నేను ఫిజియోథెరపిస్ట్ ను అనే గర్వం కన్నా నా స్థానం ఇది కాదని కొన్నాళ్ళకే తెలుసుకున్నారు.

 


6 సంవత్సరాల శ్రమ:
సినిమా చూసిన వారందరికి ఈపాటికే సందీప్ టాలెంట్ తెలిసే ఉండి ఉంటుంది. ఇంతటి టాలెంటెడ్ పర్సన్ సందీప్ కూడా మన ఇండస్ట్రీలో దాదాపు 6 సంవత్సరాల పాటు డైరెక్టర్ అవ్వడానికి చాలా కష్టపడ్డారు. మొదటిసారి నాగర్జున గారి కేడి సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. దాని తర్వాతే సినిమా తీయాలని ప్లానింగ్ జరిగినా గాని అది వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత “మళ్ళి మళ్ళి ఇదిరాని రోజు” సినిమాకు స్క్రిప్ట్ వర్క్ చేశారు. అవకాశాలు ఊహించినంత రావడం లేదని తన బ్రదర్ నే నిర్మాతగా పరిచయం చేస్తూ అర్జున్ రెడ్డి మొదలుపెట్టారు.

 


ముందు శర్వానంద్:
ముందుగా స్వప్నదత్(ఎవడే సుబ్రమణ్యం) ప్రొడ్యూసర్ గా శర్వానంద్ హీరోగా ఈ సినిమా మొదలయ్యేది. కథ కూడా వారికి అద్భుతంగా నచ్చింది, కాని కొన్ని కారణాల వల్ల అది వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత ఓ కాఫీ షాప్ లో విజయ్ ను Unexpected గా కలిశారు కొన్ని రోజులకు స్టోరి పూర్తిగా చెప్పడం, పది రోజుల పాటు విజయ్ తో సినిమా గురించి పనిచేస్తున్నప్పుడే అర్జున్ రెడ్డి రోల్ కు విజయ్ సరిగ్గా సూట్ అవుతాడని ఇంకే ఆలోచనలు లేకుండా సినిమా స్టార్ట్ చేశారు.

 


సినిమా డ్యూరెషన్:
సినిమా చూసిన తర్వాత చాలామంది చర్చించుకుంటున్న విషయం “సినిమా డ్యూరెషన్” గురించి.. ఈ మధ్య కాలంలో సుమారు 3గంటల 7 నిమిషాల పాటు డ్యూరెషన్ ఉన్న సినిమా ఇది. కాని మొదట ఈ సినిమా Length 3గంటల 40 నిమిషాలు వచ్చింది. డబ్బింగ్ జరుగుతున్నప్పుడే చాలామంది ఇంత పెద్ద సినిమాను మన ఆడియెన్స్ Accept చేస్తారో లేదో అని రకరకాలుగా అన్నారట. తర్వాత 37నిమిషాలు ఉన్న సీన్లను తీసివేయడానికి డైరెక్టర్ గారు చాలా ఇబ్బంది పడ్డారట. 30రోజుల పాటు అనేక రకాలుగా ఆలోచించి ఎక్కడా ఆ ఎమోషన్స్ మిస్ అవ్వకుండా సినిమాను ఎడిట్ చేశారట.

 


హీరోయిన్ డబ్బింగ్:
ముందుగా మన తెలుగు అమ్మాయి కోసం నెలల తరబడి వెతికారట కాని ఆ రోల్ కు సూట్ అయ్యేలా ఎవ్వరు దొరకలేదు. శాలిని మన తెలుగు అమ్మాయి కాకపోయినా (సినిమాలో కూడా) natural గా ఉండాలని తనతోనే డబ్బింగ్ చెప్పించారట.

 


లిప్ సీన్స్:
బహుశా తెలుగు సినిమా చరిత్రలో ఇన్ని ముద్దు సీన్లు ఏ సినిమాలోను లేవనుకుంటా. కాని అన్ని సీన్లు ఉన్నా కాని అక్కడ రొమాన్స్ కన్నా ప్రీతి అర్జున్ మధ్య ఉన్న ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. ఇందులో హీరోయిన్ షాలినికి ముందుగానే ఇన్ని ముద్దు సీన్లు ఉంటాయని అస్సలు చెప్పలేదు. తను ఓ స్టేజ్ ఆర్టిస్ట్. షాలిని సొంతూరు ఐన జబల్ పూర్ లో నటనను దైవంగా భావిస్తారు కాని అవసరమైతే ఎలాంటి సీన్ ఐన చేస్తారనే నమ్మకంతోనే ఇలా చేశారట.

 


కాంచన గారు:
సినిమాకు మరో గొప్ప ప్రాణం కాంచన గారు. కాంచన గారి వల్ల సినిమాకు ఒక గొప్ప లుక్ వచ్చేస్తుంది. నిజానికి కాంచన గారు సినిమాలలో నటించడం మానేసి 34 సంవత్సరాలు అవుతుంది. తన అడ్రెస్ కూడా అంత ఈజీగా దొరకలేదు. కాని సందీప్ రెడ్డి నెలల పాటు శ్రమించి అడ్రెస్ కనుక్కుని హీరో విజయ్ తో పాటు చెన్నైకు వెళ్ళి ఈ కథను వివరించారు. కథ నచ్చడంతో ఈ సినిమా ఒప్పుకున్నారు.

 


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , ,