Meet Sandeep, One Of The Best Interviewer Ever In Telugu & His YouTube Channel

 

మన మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధాని అయ్యేనాటికి వారి కొడుకు హరిశాస్త్రి అశోక లేలాండ్” కంపెనీలో ఒక మామూలు ఉద్యోగి. శాస్త్రి గారు దేశ ప్రధాని అయ్యాక కొడుకు హరి గారికి “అదే కంపెనీలో జనరల్ మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది”. ఆ విషయం తెలుసుకున్న శాస్త్రి గారు “నీకు ప్రమోషన్ ఎందుకు వచ్చిందో నాకు తెలుసు, నీ స్థాయి పెంచి తద్వారా నన్ను వాడుకుని వారి స్థాయి పెంచుకోవడానికి”.. ఇంకో ఆలోచన లేకుండా వెంటనే ఉద్యోగానికి రాజీనామా చెయ్యి!! అని పట్టుబట్టి మరి కొడుకు చేత రాజీనామా చేయించిన నిజమైన రాజకీయ నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ” యథా రాజా తథా ప్రజా” అలాంటి నాయకుడు ఉన్నాడు కాబట్టే ఆనాటి ప్రజలు, అధికారులు నిజాయితీగా ఉన్నారు. ఇప్పుడు అలాంటి నాయకులు ఉన్నారా.? లేరు కనుకనే కదా 1964లో ప్రధాని ఐన శాస్త్రి గారినే ఇప్పటికి ఉదాహరణగా తీసుకుంటున్నాము.. మనం చేసే ఒక చిన్ని తప్పు వల్ల శిక్ష ఈ ప్రపంచం అనుభవిస్తుంది అలాగే మనం చేసే ఒక మంచి వల్ల ఈ ప్రపంచం మారిపోతుంది. ఈరోజు మనం చర్చించుకోబోతున్న వ్యక్తి కూడా అలాంటి కదలికలే సృష్టిస్తున్నారు. అతని పేరు “సందీప్“.


సందీప్ ఎందుకు ప్రత్యేకమైన వాడు.?

గంజాయి వనంలో తులసి మొక్క ఎలా పెరగగలదో, తులసి వనం లోనూ గంజాయి మొక్క పెరుగుతుంది, వ్యక్తిత్వ స్వభావం అలాంటిది. సందీప్ కు వ్యూస్ లక్ష్యం కాదు, ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి ఉపయోగపడాలి. సందీప్ Pune Symbiosis College లో ఎమ్.బి.ఏ (మీడియా అండ్ కమ్యూనికేషన్) పూర్తిచేసి ఉత్తమ విద్యార్ధిగా అవార్డును కూడా అందుకున్నాడు. ఆ తరువాత ఒక శాటిలైట్ ఛానెల్ లో పనిచేశాడు. దూరం నుండి చూసినంత గొప్పగా అక్కడ పరిస్థితులు లేవు, మరొక ఛానెల్ లో జాయిన్ అయ్యాడు అక్కడా అదే పరిస్థితి.. సందీప్ తలుచుకుంటే అదే దారిలో గొప్ప పొజిషన్ కు చేరుకోవచ్చు. కాని తన మనస్తత్వానికి చేరువగా లేకపోవడంతో “Eagle Media Works” లోకి జాయిన్ అయ్యారు. ఇక్కడి నుండి కాలం సందీప్ జీవితాన్ని ఆ యూట్యూబ్ ఛానెల్ జీవితాన్ని మార్చివేసింది. సందీప్ ఏ రాజకీయ నాయకుడి, నటుల ఇంటర్వ్యూ చేసినా దాని వెనుక విపరీతమైన రీసెర్చ్ ఉంటుంది. ఒక ఎమ్.ఎల్.ఏ ఇంటర్వ్యూ చెయ్యాలంటే అతని నియోజికవర్గానికి వెళతారు. అక్కడి స్థానికులతో మమేకమై వారిలో ఒక్కడిగా మాట్లాడుతూ ఎమ్.ఎల్.ఏ గారి పనితనం అంతా తెలుసుకుని తర్వాత మాత్రమే ఇంటర్వ్యూ మొదలుపెడతారు. ఒక నాయకుడు ఏమైనా తప్పు మాట్లాడితే దానిని వైరల్ చేసి ఎదో వ్యూస్ పెంచుకుందాం అనే దిగజారుడు తనం ఆలోచన అతనిలో ఉండదు. చూసినవారు తక్కువ సంఖ్యలో ఉన్నా అది వారికి ఉపయోగపడాలి అనే స్వభావం అతనిది.


అందరికి బెస్ట్ ఇంటర్వ్యూ:

సీబీఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ, లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ, కొణిజేటి రోశయ్య, డైరెక్టర్ చందు మొండేటి, రాజీవ్ కనకాల, లక్ష్మి మంచు, ప్రియదర్శి, సమీర్, ప్రియాంక జవల్కర్(టాక్సివాల హీరోయిన్) మొదలైన వారందరూ సందీప్ ఇంటర్యూ పూర్తికాగానే చెప్పే మొదటి మాట “ఇప్పటివరకు నేను ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఇది బెస్ట్, ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది” అని. “బాబు గోగినేని గారు వస్తే మానవ ఎదుగుదలపై మతం ఏ విధంగా అడ్డుపడుతుంది, సైన్స్ ఇంకా ఎంతలా అభివృద్ధి చెందబోతుంది మానవ పరిణామ క్రమం ఎలా సాగబోతుందనే ప్రశ్నలు.. జయప్రకాష్ నారాయణ గారు వస్తే ఇప్పుడున్న విద్య, వైద్యం చట్టంలో లోపాలు, మార్పులు లాంటి వాటికి సంబంధించిన విలువైన ప్రశ్నలు, డైరెక్టర్ చందు మొండేటి గారు వస్తే ఎక్కడ పెరిగారు, ఏం చదువుకున్నారు అని కాకుండా 24 విభాగాల మీద ప్రశ్నలడిగేంత క్యాలిబర్ ఉంది సందీప్ లో..ఒక సినిమా ప్రొడ్యూసర్ ఐతే ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, బడ్జెట్ ఎలా తగ్గించారు ఎలా మేనేజ్ చేశారని, ఇంటర్వ్యూ ఇచ్చేది ఒక హీరో, నటుడు ఐతే కథను ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, నటన విషయంలో ఎలా పాత్రలోకి లీనమవుతారు.? ఇలా ప్రొఫెషనల్ పరమైనవి మాత్రమే అడుగుతుండడం వల్ల వారి టాలెంట్ మరింత బయటపడి అటు ఇంటర్వ్యూ ఇస్తున్న వారికి ఇటు చూస్తున్న ప్రేక్షకులకు ఉపయోగడుతుంది. ఒకసారి వీరమాచినేని రామకృష్ణ గారు సూర్యాపేటలో 10,000 మంది ముందు తన డైట్ గురించిన స్పీచ్ ఇస్తున్నారు. స్పీచ్ పూర్తైన తర్వాత కొంతమంది ప్రశ్నలు అడుగుతున్నారు అక్కడే ఉన్న సందీప్ ని పిలిచి “సందీప్ నువ్వైతే పనికొచ్చే ప్రశ్నలు అడుగుతావు అడుగు” అని బాహాటంగానే అడిగించుకున్నారు. ఇప్పటికీ వీరమాచినేని గారు ఎక్కడ స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నా సందీప్ కు కాల్ చేసి నేను ఫలానా చోటుకు వెళ్తున్నాను వచ్చి ప్రశ్నలు అడగొచ్చు కదా అని ఆహ్వానిస్తుంటారు.క్రికెట్ అనాలిసిస్:

మన తెలుగులో క్రికెట్ అనలిస్ట్ లు చాలా తక్కువ. ఉన్నాకాని సరైన విధంగా పూర్తి స్థాయిలో లేవు. సందీప్ ఏది వండినా మొఖం చూసి కాకుండా కడుపు నిండుగా వడ్డిస్తాడు. ICC tournaments, IPL ఎప్పుడు జరిగినా ఇంత రన్స్ చేశారు, ఇన్ని వికెట్స్ తీశారు అని కాక బ్యాట్స్ మెన్, బౌలర్, Entire టీం లో జరిగిన మిస్టేక్స్ వీటన్నిటి గురుంచి సరిగ్గా వివరించడం వల్ల క్రికెట్ అనాలిసిస్ కోసమే ప్రత్యేక అభిమానులైన వారున్నారు.“భర్త చనిపోయినా ఆ హీరోయిన్ బొట్టు ఎందుకు పెట్టుకుంటుంది?, అందరూ పడుకున్న తర్వాత ఆ హీరోయిన్ ఈ హీరో గదిలోకి ఎందుకు వెళ్ళింది.?(రాస్తున్నందుకు నాకే కష్టంగా ఉంది) ఇలాంటి దిగజారిన టైటిల్స్ తో ఆడియెన్స్ ను ఒకరకమైన Curiosityకి గురిచేస్తున్నారు. వాళ్లకు కావాల్సిన టార్గెట్ రీచ్ అయ్యాక వీడియో డిలీట్ చేస్తుంటారు. జనాలు ఏమై పోయినా, కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తుల జీవితాలు నాశనం ఐనా వీళ్ళకు అనవసరం. ఎక్కడ లేని దొంగలు ఆన్ లైన్ లో ఉంటారు “యూ ట్యూబ్ లాంటి చోట్ల ఐతే అఫీషియల్ గా పబ్లిక్ ని మోసం చేసి డబ్బు దోచుకుంటున్నారు”. సందీప్ వీడియోలో ఏదైతే ఉంటుందో అదే టైటిల్ ఉంటుంది. ఇంటర్వ్యూ కోసం వచ్చిన వ్యక్తులే మమ్మల్ని ఈ ప్రశ్నలు అడగండి అని అడిగినా అది పనికిరాని ప్రశ్న ఐతే నిర్ధాక్షిన్యంగా ఒప్పుకోడు.. అందుకే సందీప్ లాంటి వ్యక్తులు మీడియా గంజాయి వనంలో తులసి మొక్కలయ్యారు.

Interview with Loksatta founder Dr.Jayaprakash Narayan garu


 

Interview with Babu Gogineni garu


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , , , , , , , , , ,