Aatt Sampoo Mass, Here’s The Story And Complete Decoded Script Of Kobbarimatta’s World Record Dialogue Trailer

 

నిన్నటి నుండి ఒక డైలాగ్ ట్రైలర్, సకల తెలుగు సినీ ప్రేమికులను మంత్రముగ్ధులను గావించుచున్నది. 3 నిమిషాల 27 సెకన్లు నిడివి ఉన్న“ప్రపంచ సినీ చరిత్ర లో మొట్ట మొదటి సింగల్ షాట్ డైలాగ్” ఇది. సంపూర్ణేష్ బాబు నటించిన “కొబ్బరి మట్ట” సినిమా లో ని ఈ డైలాగ్ వెనుక ఒక పెద్ద కథే దాగియున్నది.. ఆ కథ ని, ఆ సినిమా కి మూలపురుషుడైనటువంటి సాయి రాజేష్ మాటల్లో నే తెలుసుకుందాం.

 

How this Dialogue trailer happened ??

ధనుష్ VIP లో చెప్పిన డైలాగ్ చూసినప్పుడు కొబ్బరిమట్ట స్క్రిప్ట్ లో సంపూ చేత అలాంటి డైలాగ్ చెప్పించాలి అనుకున్నాను… ఒక నిమిషం 30 సెకన్ల ఆడవారి మీద డైలాగ్ షూట్ చేసాక…..నాలోని రాక్షసుడు నిద్ర లేచాడు….. మగవాళ్ల గురించి మూడున్నర నిముషం చెప్తే…Pyar ka punchnama రికార్డ్ బద్దలు కొట్టొచ్చు….ఎక్కువ సేపు డైలాగ్ చెప్పిన పేరు కూడా వస్తుంది అనుకున్నాను…

 

ఒక 5 Versions మగాడి గొప్పతనం గురించి రాసాను…ఫుల్ హ్యాపీ…. ఎందుకో రీరికార్డింగ్ జరుగుతుంటే…. ఒక నిముషం కాకపోతే 4 నిముషాలు చెప్పటం ఏముంది….పెద్ద విషయమా అనిపించింది…. వెంకటకవులు రాసిన దాన వీర సూర కర్ణ కి పేరడీ గా డైలాగ్స్ గ్రాంథికంలో రాస్తే…. ఆ డైలాగు యమదొంగ లో చిన్న NTR ల intensity తో చెప్తే….డైలాగ్ నిజంగా అర్థమయినట్టు అతను అభినయిస్తే sky is the limit అనిపించింది.

 

ముందు నేను ఐడియా రాసేసాను…ఇక దీన్ని గ్రాంథికంలో తర్జుమా చేయటమే తరువాయి… ఇందుకు నిష్టాగరిష్ఠ పంతులు గారైన Raghuram Sreepada సహాయం కోరగా…ఆయన నల్ల కుక్క సురాపానీయము, రొయ్యల వేపుడు, కోడి పులుసు ఇస్తే డైలాగ్ ఏంటి…పుస్తకం రాస్తాను అన్నాడు….నాలుగు గంటల్లో , శబ్ద రత్నాకరం సాయంతో డైలాగ్ రెడి…

 

ఆనందంగా సంపూ కి డైలాగ్ వాట్సాప్ చేస్తే…. నేను చెప్పలేను అన్నాడు….మగాడి డైలాగ్ ఏ బాగుంది అన్నాడు…నాకు ఒళ్ళు మండింది…ఎంటి డైలాగ్ చెప్పలేను అనే range కి ఎడిగిపోయాడా…వొళ్ళు బలిసిందా అనుకున్నాను….నా ఆవేశం చూసిన మా టీమ్ నన్ను సర్దిచెప్పటానికి ప్రయత్నిస్తూ…కష్టంలెండి…వదిలెయ్యండి….మగాడి డైలాగ్ బాగుంది…అన్నారు….నాకిప్పుడు prestige అండ్ ego రెండు రేగాయు….ఎల్లుండి షూటింగ్ పెడుతున్న… చెప్తే నీకు career ఉంటది…లేకపోతే నాకు మూడు లక్షల పోతాయి…. నీ కర్మ అన్నాను…

 

అప్పటికే షూటింగ్ మొత్తం అయిపోయింది… కేవలం ఇదొక్క షాట్ తీస్తే…సినిమా కి హైప్ వస్తుంది అనుకున్న… నా పరిస్థితి తెలిసిన ప్రతి స్నేహితుడు వారించాడు…..జేబులో, బాంకులో డబ్బులు కాళీ…అవసరమా నీకు షూటింగ్ మళ్ళీ అని.
లేదు చెయ్యాల్సిందే అనుకున్నాను….

 

తెచ్చాను….ఊడ్చి ఊడ్చి తెచ్చాను….నానా కష్టాలు పడి తెచ్చాను….షూటింగ్ పెట్టాను…. అన్నా..కష్టంగా ఉంది చెప్పలేను అన్నాడు……నేను వినలేదు…

ఫైనల్లీ…. షూటింగ్ రోజు వెళ్ళాను….కేవలం ఒక షాట్….మూడు లక్షల ఖరీదు….మొత్తము set చేసాక భయంకరమైన వర్షం పడింది….మూడు లక్షలు మటాష్…. అందరూ ఆనందంగా వున్నారు…నేను తప్ప…సంపూ మహదానందంలో వున్నాడు…

 

ఇప్పుడు నా బాధ ఎవడికి చెప్పుకోలేను…నీ మొండితనం వల్లే డబ్బులు దొబ్బాయి అని అంటారు….కానీ తగ్గేదే లేదు….చెప్పించాల్సిందే అనుకున్నా…..వారం రోజుల్లో డబ్బులు సెట్ చేస్తా…రెడి అవ్వు అన్నా….I spoke to him for 15 mins….How crucial this is for his career and First half of the film….చెప్తా అన్నా అన్నాడు…. నాకు తెలిసిపోయింది గారంటీ గా చెప్తాడని…

రాత్రి పగలు, ఆఫీసులో బాత్రూమ్లో, కార్లో బాల్కనీలో … ఒక స్కూల్ పిల్లాడిలా నేర్చుకుంటున్నాడు….Hats off చెప్పు కున్నా మనసులో

 

మళ్ళీ డబ్బు తెచ్చాను…ఎలా తెచ్చానో కామెడీ సినిమాకి సెంటిమెంట్ టచ్ అక్కర్లేదు కాబట్టి చెప్పట్లే…

ఈ crucial షాట్ లో act చెయ్యటానికి artists కొందరు busy అన్నారు..కొందరు నిజంగానే బిజిగా వున్నారు..కొందరు రాలేము అన్నారు…కొందరు ఎందుకు రావాలి… ఇది రిలీజ్ అయ్యేది లేదు సచేది లేదు అనుకోని రాలేదు…షూటింగ్ చేసే అవకాశం లేదు అన్నాడు డైరెక్టర్ Rupak Ronaldson …When Sampoo saying the dialogue…No one will watch others Artists….Iam 100% confident…Shoot it…Static shot వద్దు…..Camera movement ఉండాలి అనేది నా కండిషన్.. డైరెక్టర్ & కెమెరామెన్ Mujeer Malik షాట్ plan చేసుకున్నారు…సెట్ లో ఎవరికీ చెప్పలేదు…. డైరెక్టర్ కట్ చెప్పేవరకు నోరు మూసుకొని act చెయ్యండి అని strict instructions… జూనియర్స్ కి మరింత గట్టిగా…

 

డైరెక్టర్ action చెప్పాడు… టైమ్ 9:4౦am. సాయంత్రం వరకు టైం ఉంది…10 takes తీసుకున్నా పర్లేదు అనుకున్నాను…

Action అన్నాడు డైరెక్టర్…. Pin Drop Silence … చెప్తున్నాడు చెప్తున్నాడు చెప్తున్నాడు…..4 నిముషాలు…. steady cam ఆపరేటర్ ఏ మాత్రం తప్పు చేసినా ఇంకో టేక్….లైట్ మెన్లకి అర్థం కావటం లేదు…ఆర్టిస్ట్స్ షాక్ లో వున్నారు….మూడున్నర నిముషం అయింది….కట్ …. అందరూ షాక్ లో వున్నారు….అయిపోయింది…. ఒక్క take లో చెప్పేసాడు… Whistles వేశారు… ఇద్దరు తన కాళ్ళ మీద పడ్డారు…. Hug చేసుకుంటున్నారు….ఎమోషనల్ అవుతున్నారు…నేను వెళ్ళలేదు….ఏదో తెలీని ఫీలింగ్…. డబ్బులు పోతే పోయాయి…. దీనమ్మ satisfction…..

 

ఇక్కడ మొదలైంది అసలు ఆట….మూడున్నర నిమిషం Lag… cut chesey…. ఎవడు వింటాడు ఆ గ్రాంథికం….కామెడీ కూడా లేదు అన్నారు ఎడిటింగ్ రూంలో…. నీకు ముందే చెప్పా…డబ్బులు దొబ్బట్టోద్దు అని….ఆ డైలాగు దగ్గర పిచ్చ లాగ్ అన్నారు…. చెప్తూనే వున్నారు ఎవరు చూసిన….జనం కి చిరాకు వస్తది లేపేయ్ అన్నారు….

జనం కి చూపించేస్తా…నచ్చి అలవాటు అయితే థియేటర్ లో చూస్తారు…. నచ్చకపోతే కనీసం మాట్లాడుకుంటారు …రెండు రోజుల పబ్లిసిటీ అనుకున్నా….తప్పు చేస్తున్నావ్ శివగామి….minus అయ్యే chance లు పుష్కలంగా ఉన్నాయి అన్నారు….dekh lenge అనుకున్నా….Kodati Pavan Kalyan సాయంతో ట్రైలర్ కట్ చేశా…ఇప్పుడు చూపించా…..నాకు తెలిసిన వ్యక్తులకు……అదిరింది అన్నారు…

Yes….this is బిగ్గెస్ట్ పబ్లిసిటీ for the రిలీజ్…

Iam damn fucking హ్యాపీ…సంపూ ని ఇక ఎవరూ నటుడు కాదని అనలేరు

 

ఇంత కష్టం దాగియున్న ఆ డైలాగ్ ఇది..


 

Pariksha lo rasthe 36 pagelu nindipoyentha lengthy ga unna ee dialogue ni “Santosh” decode chesaaru.. and here is the script of that dialogue. Meeru cheppagalaremo try cheyandi.

 

ఏరా పెదరాయుడు… త్రికాలాత్రక…
ఓరి ఓరోరి ఆపరా నీ ఉన్మత్త గార్దభరవాలు…
ఎంత మరువ యత్నించినను మరపునకు రాక హృదయ శల్యాభిమానములైన నీ మదోన్మాదాపరాధము నా మనోవితలమును వ్రయ్యలు చేయుచున్నవే…

 

అహో క్షీరావారాసిజనతరాకాసుధాకర కొణెదెల నందమూరి అక్కినేని ఘట్టమనేని మంచు దగ్గుబాటి వంశసముత్పన్నమహొత్తమ మహా నట పరిపాలిత చిత్ర సామ్రాజ్యమున నూతన వారసుడనై,
నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశభువన శూరవరేణ్యులగు భ్రాతసమానులైన చతుష్టిపితృలకు అనుజుడనై,
సింహపురి తీరమున జన్మించి, భారత ఖండమున సకల జనులచే పరమపావనిగా కీర్తింపబడుతున్న మహోత్తమ మహిళ
ఈ పతివ్రత ‘పండు’నకు పుత్రుడనై,
మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూసి ఈ విశ్వమంతయు ప్రశుడట ప్రచుహత అని పగలబడి నవ్వుటయా…
అనాధా అని అవహేళన చేయుటయా…

 

అహో తన సతులతో తుల్యుడగు నన్ను పుత్రుడుగా సంభవింపక సన్మానింపక పితృధర్మ పరిత్యక్తుడై లజ్జావిముక్తుడై ఈ కపట పెదరాయుడు నన్నేల వివాసుని సేయవలె.
అవునులే అశుద్ధ స్వరూపుడగు రాయునకు యెగ్గేమి? సిగ్గేమి?
వంతువంతున ఆలికి ముందు ఆలిని పరిభోగించిన పర్యంతమూ రెచ్చిన కడుపిచ్చితో పచ్చి పచ్చి వైభవమున కేళించు వీడు
తన ఇంట ముగ్ధదాసి సాంగత్యమున నన్ను కని త్యజించినంత మాత్రమున
హా హ హా హ నేనేల కటకటపడవలె,
ఊరకుక్క ఉచితానుచిత జ్ఞ్యానముతో సంభోగించిన సరిపెట్టుకుందునా?
ఈ లోకమున మొయ్య మూకుడుండునా?
అయిననూ…. దుర్వ్యాజమున సాగించు అవివేక న్యాయవిచారణ అని తెలిసి తెలిసి…
హహ్హా… మేమేల రావాలె? వచ్చితిమిపో విచక్షణాపేతమై సవత్రా కామకలాపాలు సాగించు ఈ శునకము ఇచట ధర్మ విధేయతగా ఏల ఉండవలె…
ఉండినాడు పో, వృక్షమునకు వస్త్రము కట్టినా విధూత్యాపేక్ష కలిగి
తన పర భేదములని మర్చి విచక్షణారాహిత్యముతో అద్రసంభోగమునకు పాల్పడు ఈ త్రాపి ఉన్నచోట మా మాతృమూర్తి ఏల ఉండవలె?
ఉండినది పో, సజీవ భువచర మేష గోప సారూప్య మానవ సంచారికవితానమునకు ఆలవాలమగు ఈ గ్రామమున మేమేల కాలుమోపవలె?
మోపితిమిపో , సకల రాజనుకోటీరకోటిసంక్షిప్త రత్నప్రభా నీరాజితంబగు మాపాదపద్మమేల అపభ్రమనం చెందవలె…
ప్రతీకారేఛ్చతో గ్రామమున పాదం మోపిన మమ్ములను ఈ గ్రామసింహముతో సమరూపిణి అని అవమానించి…

 

అసలితని జన్మ రహస్యమేమన్న జుగుప్సాభావంతో ఈ జనుల కళ్లేల చూడవలె? నోరేల వాగవలె? చెవులేల వినవలె?
హ విధి హతవిధి ఆజన్మ శత్రువుయే అనుమానించుచునే అరుదెంచిన మమ్ము అవమాన బడబాన జ్వాలలతో దగ్ధమొనర్చుచున్నవమ్మా…
విముఖునిసుముఖునిజేసి మమ్మితకు విజయముసేయించిన నీ విజ్ఞాన విశేష విభావాదిత్యము ఏమైనది తల్లీ…

 

రాయుడు కృతావమాన మానసుడనై, మానాభిమానవర్జితుడనై మర్యాదాపూర్వకముగా మనుటయా? లేక
ఈ నా జన్మకారకుడైన ఈ నిరక్షరకుక్షుని క్షమించి వదిలేయుటయా?
ఇస్చీ… కామాంధముదృని పై పగసాధించలేమన్న మహోపేక్ష మాపైన వేరొకటియా?
ఏదీ కర్తవ్యం? మనుటయా ? వీడంతు చూసుటయ?
హహా హ్హాహ్హహ్హ…
రాయుడూ… నీకు క్షమాభిక్ష పెట్టుటకు మా అంతఃకరణము అంగీకరించుటలేదే…
ఈనాయందు ప్రవహించు రుధిరము నీదే కదా?
నీది అని విర్రవీగుతున్న ఈ జనం ధనం భోగం యోగం నీ నుంచి అపక్రమించి నిను వివస్త్రుడను గావించి
మార్గపద మధ్యమున సంసర్గముగ్ధుడ గావించెదను…

 

పెదరాయుడు Time is over…
Android Time starts now…


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , , ,