Remember This Comic Book From Sammohanam? Well, Meet The Terrific Artist Behind It

 

సమ్మోహనం సినిమా చూసే వుంటారు కదా.. సినిమా చూస్తున్నంత సేపు పడవమీద ప్రయాణంలా హాయిగా సాగిపోతుంది.. నదిలో అక్కడక్కడా అలజడులు వచ్చినట్టుగా మన హృదయంలోను కొన్ని అలజడులనూ సృష్టిస్తుంది. చివరిగా తీరం చేర్చి ఉన్న గుబులును తొలగించి హాయిగా తీరాన్ని చేరుస్తుంది. సమ్మోహనం సినిమాలో టైటిల్ కార్డ్ నుండి ఎండింగ్ వరకు సినిమాలో చాలా చోట్ల అందమైన బొమ్మలు మనకు కనిపిస్తాయి. సినిమాలోని సన్నివేశాలతో పాటుగా, ఆ బొమ్మలు కూడా మన మదిలో నిలిచిపోతాయి. టైటిల్ కార్డ్స్ నుండి, సుధీర్ రూమ్ లో కనిపించే బొమ్మలు ఇలా దాదాపు అన్ని బొమ్మలను ఒకే ఒక్క ఆర్టిస్ట్ వేశారు ఆ ఆర్టిస్ట్ యే శ్రీనివాస చారి గారు.





 

కార్టూన్లు” వల్లనే చారి గారికి ఈ రంగంలో ఉదయించాలనే ఆసక్తి కలిగింది. చిన్నప్పుడు కార్టూన్లు చారి గారిని పలుకరించేవి, ఆ కార్టూన్ల లోని భావాలు, ముఖ కవళికలు చూసి వాటిని తనతో పాటు ఆడుకునే మిత్రులుగానే చూశాడు.. తీక్షణంగా చూశాడు.. పరిశీలించాడు.. చివరికి తానే ఒక కార్టూన్ వేసి “కళ్లతో హాయ్” అని ఆత్మీయంగా పలుకరించాడు. చిన్న శ్రీనివాస చారి సంబరపడ్డాడు, అమ్మ నాన్నలు మెచ్చుకుంటుంటే పరవశించిపోయాడు. తన ఆనందాన్ని మరింత మందికి అందజేయాలన్న ఉద్దేశ్యంతో ఓ న్యూస్ పేపర్ కు పంపాడు, వారికి కూడా నచ్చడంతో పబ్లిష్ చేశారు. అదిగో అప్పుడే వాటిపై ఇష్టం పెరిగింది.



కార్టూన్లతో మొదలైన చారి గారి ప్రయాణం స్కెచెస్, ఆయిల్ పెయింటింగ్, న్యూడ్ స్కెచెస్, ఇల్ల్యూస్ట్రేషన్స్ తో సాగుతూ ఉంది. ఈ 20 ఏళ్ళ ప్రస్థానంలో ఎన్నో పత్రికలకు, మ్యాగజైన్ లకు బొమ్మలు వేశారు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి తో పాటు దాని అనుబంధాలు వివిధ, నవ్య, సండే మ్యాగజైన్ లలో జీవం ఉట్టిపడే బొమ్మలను, కార్టూన్లను వేస్తున్నారు.



 

హీరో అక్కడక్కడా పెయింటింగ్స్ వేసే సందర్భాలు ఉన్నాయేమో కాని చాలా కాలం తర్వాత పూర్తిస్థాయిలో వృత్తిగా ఎంచుకున్న పాత్ర సమ్మోహనంలో కనిపిస్తుంది. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి గారు ఈ బొమ్మలకోసం ఆర్టిస్ట్ కోసం పెద్ద కసరత్తే చేశారు. మోహనకృష్ణ గారి కుటుంబంలో నాన్న శ్రీకాంత శర్మ, అమ్మ జానకీ బాల గార్లతో సహా చాలామంది పుస్తక రచయితలున్నారు. వీరికి ఒక ఆర్టిస్ట్ దొరకడం అంత కష్టమూ కాదు, కాని స్పష్టత కోసం వెతకడం మానలేదు. చారి గారు పిల్లల పుస్తకం “తియ్యని చదువు” కోసం వేసిన బొమ్మలు చూడగానే హీరో కోసం హీరో దొరికేశాడని మరోసారి చారి గారిని చూశారు. కట్ చేస్తే అద్భుతాలు మన ముందుకు వచ్చాయి.. పతాక సన్నివేశంలో విజయ్, సమీరల మధ్య గల దూరాన్ని “తారలు దిగి వచ్చిన వేళ” కథ దగ్గర చేస్తుంది. సన్నివేశం మరింత రక్తికట్టడానికి చారి గారి బొమ్మలు ప్రాణం ఉన్న పాత్రదారులలా వ్యవహరించాయి.. అన్నట్టు త్వరలోనే చారి గారి బొమ్మలతో, మోహనకృష్ణ గారి రచనతో “తారలు దిగివచ్చిన వేళ పుస్తకం కూడా త్వరలో మార్కెట్ లోకి రాబోతుంది, ఈ మధ్యనే చిరంజీవి గారి చేతుల మీదుగా దీనిని ఆవిష్కరించారు..


 

సినిమాలో చారి గారి కొన్ని బొమ్మలనే చూశాము కదా ఇదిగో ఇక్కడ మరిన్ని చూసేయ్యండి..

 

1.


 

2.


 

3.


 

4.


 

5.


 

6.


 

7.


 

8.


 

9.


 

For More Images You Can Visit Here

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , ,