Here’s The Journey Of Actor Sameer Who Is Now The Internet Sensation Of Bigg Boss Reality Show!

Silver Screen Actors మాత్రమే కాదండి టీవి సీరియల్స్ లో నటించేవారికి కూడా అభిమానులు ఉంటారు. అలాగే సమీర్ కు కూడా. అప్పట్లో మిగిలిన వారితో పోల్చుకుంటే సమీర్ గారికి కాస్త ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఇప్పటికి సమీర్ గారు ఇండస్ట్రీకి వచ్చి 20సంవత్సరాలు, 170కి పైగా సినిమాలు, 200పైగా సీరియల్స్ లో నటించి 10 పైగా అవార్డులు(టీవి వరకు) అందుకున్నారు.

అసలు ఎందుకు Actor అవ్వాలనుకున్నారు.?
సమీర్ గారి Proper వైజాగ్.. అమ్మ నాన్నలది Inter Religious Love Marriage. అమ్మగారు బ్రాహ్మణులు, నాన్న గారు ముస్లీం. సమీర్ అమ్మగారు థియేటర్ ఆర్టిస్ట్, ఇంకా గొప్ప డాన్సర్ కూడా. భరత నాట్యం, కూచిపూడిలలో దేశ, విదేశాలలో ప్రదర్శనలిచ్చేవారు. సమీర్ గారు కూడా చిన్నతనం నుండే స్కూల్స్ లో కాలేజీలలో చిన్న చిన్న ఫంక్షన్స్ లో ఇలా చాలా సందర్బాలలో తన నటనతో స్నేహితులను అభిమానులుగా, అభిమానులను శ్రేయోభిలాషులుగా మార్చుకున్నారు. స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎంకరేజ్ చేయడం, ఇంకా తనకు నటనంటే ఇష్టం ఉండడంతో ఈ రంగస్థలంలోకి దూకేశారు. అప్పటికే Actorగా మంచి గుర్తింపు ఉన్నా కూడా ఇంకా ఇందులో పరిపూర్ణత రావాలనే ఉద్దేశంతో ‘దేవదాస్ కనకాల’ గారి ఫిల్మ్ స్కూల్ లో శిక్షణ కుడా తీసుకున్నారు. సమీర్ గారి మొదటి సినిమా కళాతపస్వీ విశ్వనాథ్ గారి శుభసంకల్పం. సినిమాల కన్నా Career Beginningలో ఋతురాగాలు, శాంతి నివాసం, భాగవతం లాంటి సీరియల్స్ ద్వారానే బాగా Famous అయ్యారు.

నా రోల్ కూడా గుర్తుండి పోవాలి:
సినిమా అనే ఇంటి నిర్మాణంలో హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలాంటి పిల్లర్స్ అత్యంత అవసరం, ఆ ఇంటికి గోడలు, ఇటుకలు లాంటి వారు మిగిలిన రోల్స్ లో కనిపించే క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఇతర టెక్నిషియన్స్.. సమీర్ గారు చాలా సినిమాలలో పూర్తి సినిమా అంతటా లేకపోయినా గాని తను కనిపించే ఆ కాస్త సీన్ లలో తనకంటూ ఒక ప్రత్యేకతతో కనిపిస్తారు, నటిస్తారు. ఒక్కోసారి సమీర్ గారు వేసిన రోల్ చాలా చిన్నదైనా కావచ్చు గాని ఈ రోల్ ఈ సినిమాకు చాలా అవసరం అని అనేంతలా ఉంటుంది ఆయన Performance. అలా మగధీర, చందమామ లాంటి చాలా సినిమాలలో తక్కువగా కనిపించి ఎక్కువ Impact చూపించారు. చాలా సీన్లు కూడా సాధ్యమైనంత వరకు ఒకటి, రెండు టేక్స్ లోనే చేస్తుండడంతో డైరెక్టర్స్ అందరూ సమీర్ గారితో చేయడానికి కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు.

పోలీస్ అయ్యేవాడిని..
సై, అత్తారింటికి దారేది, దృశ్యం ఇలా చాలా సినిమాలలో సమీర్ గారు పోలీస్ ఆఫీసర్ గా నటించారు కాని నిజానికి జీవితంలో మొదట పోలీస్ అవ్వాలనే అనుకున్నారట. ఆ ఇష్టాన్ని Actor కావాలనే Passion డామినేట్ చేయడంతో Actor ఐపోయారు. ఐనా కాని ఇప్పటికి చాలావరకు పోలీస్ రోల్స్ వస్తుండడంతో పోలీస్ అవ్వాలనే తపన కూడా ఓ రకంగా తీరింది.

త్రివిక్రమ్ గారు.. మీకు నేను కావాలా ? సమీర్ కావాలా ? తెల్చుకోండి.!: పవన్ కళ్యాణ్
చిరంజీవి గారికి మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ గారికి కూడా సమీర్ గారు అభిమాని. కొంతకాలం క్రితం భారీ అంచనాల మధ్య రిలీజైనా పవన్ కళ్యాణ్ గారి ఓ సినిమా ఫ్లాప్ అయ్యేసారికి బాధ పడుతూ Facebookలో Status పెట్టారు. దానికి నాగబాబు గారు ఫోన్ చేసి సమీర్ గారిని మందలించి ఆ స్టేటస్ డిలీట్ చేయించారట. ఆ విషయం తెలుసుకున్న కళ్యాణ్ గారు “నీ ఒపీనియన్ ని నువ్వు చెప్పావు అంతే, దానికి నాగబాబు గారు మందలించాల్సిన అవసరం లేదు.. నువ్వు ఇప్పుడు నాగబాబు కు ఫోన్ చేసి నేను స్టేటస్ పెట్టడంలో తప్పు లేదని” చెప్పమన్నారు దానికి సమీర్ గారు “ఇది ఇంకా కష్టం” అని సున్నితంగా తిరస్కరించారు.

తర్వాత చాలా కాలం నాటికి ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఓ రోల్ కోసం సమీర్ గారిని పిలిచారు. పవన్ కళ్యాణ్ గారు సమీర్ ను చూసి కొన్ని సంవత్సరాల క్రితం Facebookలో పెట్టిన స్టేటస్ గురించి త్రివిక్రమ్ గారికి చెప్పి “ఈ సినిమాలో నేను కావాలా, సమీర్ కావాలా తెల్చుకోండి.! అని త్రివిక్రమ్ గారికి ఓ పరీక్ష పెట్టారట. త్రివిక్రమ్ గారు కాసేపు ఆలోచించి “సమీర్ యే కావాలి” అని అన్నారట దీంతో పవన్, త్రివిక్రమ్ గారు పెద్దగా నవ్వి “కావాలనే ఆట పట్టించామని” వారి నవ్వులలో సమీర్ గారిని కూడా భాగస్వామిని చేశారట.
If you wish to contribute, mail us at admin@chaibisket.com