This Love Story Of A Couple Is Something Every Long Distance Relationship Lover Will Relate To

 

COntributed by Vamshi Gajendra

కాలం .. ప్రయాణం .. జీవితం లో చాలా ప్రశ్నలకు అడగక పోయిన సమాధానం చెప్పేవి ఈ
రెండే అనే నిజం నేను తెలుసుకున్న రోజది..

స్థలం : రైల్వే స్టేషన్
సమయం : అంతగా బాగోలేదు ..

అరుణ్ నా పేరు.. నా ఇరవై రెండేళ్ల జీవితం లో పుట్టి పెరిగిన ఊరిని , ఇంట్లో వాళ్ళని వదిలి వేరే
ఊరికి వెళ్లడం ఇదే మొదటిసారి.. కారణం నా ఉద్యోగం. రేపు ఈపాటికి ఎక్కడో పూణే లో
ఉంటా అనుకుంటూ ప్లాట్ఫారం మీద ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా.. ట్రైన్ అనౌన్సమెంట్
కూడా వచ్చింది..టైం గడుస్తున్న కొద్ది తను వస్తుందనే ఆశ మెల్లగా ఆవిరవుతోంది.. అంత
మంది జనం లో నా కళ్ళు వెతుకున్నది తార కోసం.. మాములు గా లేట్ గా వచ్చే ట్రైన్ లు..
ఈరోజు పది నిమిషాల ముందే వచ్చేసింది .. నాకు నా టైమే కాకుండా ఈ రైల్వే డిపార్ట్మెంట్
కూడా సహకరించట్లేదు .. ఇక తను వస్తదనే ఆలోచన ని మానుకుని ట్రైన్ ఎక్కాను..కోచ్ లో
జనాలు కూడా పెద్దగా లేరు… ఒకడినే కూర్చుని ఉన్న. కాసేపటికి ఆలోచనలను భరించలేక
ఇక అప్పేదాం అని డిసైడ్ అయ్యి ఫోన్ తీసి..

ఒకే ఊరిలో ఉన్నపుడే మనం మాట్లాడుకునేది ఏ వారానికో ఒకసారి .. కలవటం అయితే
కలే.. ఇప్పుడు మన మధ్య దూరం ఇంకా ఎక్కువ కాబోతోంది .. I do not think our
relation gonna workout anymore ..!! అని టైప్ చేసి తార కి పంపించా.. ట్రైన్
బయలుదేరింది .. ఒక్కసారిగా ఒంట్లోకి ఒంటరితనం ఆవహించినట్టయింది..

లోటుని మరింత లోతు చేయడానికా అన్నట్లు హడావిడి గా ఒక జంట సీట్ దగ్గరకి వచ్చి
నిలబడ్డారు… చేసేది ఏమి లేక పక్కకు జరిగి వాళ్ళ సీట్ ఇచ్చా..

అమ్మ కి ఫోన్ చేసి ట్రైన్ బయల్దేరింది అని చెప్పా.. ఆమె మళ్ళి జాగ్రత్తలు చెప్పడం
మొదలుపెట్టే లోపు నేనే ఫోన్ పెట్టేసా .. పక్కనున్న జంటని చూస్తే కొత్తగా పెళ్ళైనట్లుంది..
ఎక్కినప్పటి నుండి అయన.. ఆమెని నీవల్లే లేట్ అయ్యింది.. కొంచెం ఉంటే ట్రైన్ మిస్
అయ్యుండేవాళ్ళం అని విసుకుంటున్నాడు .. ఎలాగో ఎక్కేసాం కదా.. ఇక వదిలెయ్యండి
అని అనలేదు ఆమె.. గమ్మున తల వంచుకుని కూర్చుంది ఫోన్ చూస్తూ ..

already disturb ఆయున్న నేను వీళ్లకి disturbance కావడం దేనికని బ్యాగ్ లో నుండి
head phones తీసి తగిలించుకున్నా.. కానీ వాళ్ళేం మాట్లాడుకుంటారో విందామనే ఒక
intension తో volume తక్కువుంచి కళ్ళు మూసుకున్నా…

వాళ్ళేమి పెద్దగా మాట్లాడుకోవట్లేదు .. ఇంటికి తాళం
సరిగ్గా వేసావా? నా బ్లాక్ జీన్స్ సర్ధావా? ఇలాంటి మూస మాటలు తప్ప.బట్టలు
సర్దుకునే టైం కూడా లేనంత busy ఉండి మళ్ళి నీ వల్లే late అని చాలా సింపుల్ గా భార్యని

Blame చేస్తున్నాడు అనుకున్నా.. వాళ్ళు మాత్రం ఎవరి ఫోన్ లో వాళ్ళు
మునిగిపోయున్నారు….

ఆలోచనల వల్ల వచ్చిన అలసట వల్లనేమో ఆలానే కూర్చుని నిద్రపోయా తెలీకుండానే ..
లేచేసరికి పక్కన ఒక పెద్దాయన కూర్చోనున్నాడు .. ట్రైన్ నాలుగో స్టాప్ ధాటి వెళ్తూ ఉంది .
తార నుండి ఇంకా ఎటువంటి reply లేదు.. ఆ జంట వాళ్ళ ఫోన్ లోనే నిమగ్నమైయున్నారు
..

పక్కనుండి పెద్దాయన బాబు అని పిలిచాడు.. సుమారు 50 ఏళ్ళు ఉంటాయి ఆయనకి ..
నాది upper berth .. నువ్వు పైన పడుకుంటావా ? లాంటి question లు అడుగుతాడు
అనుకున్నా.. కానీ అయన బాబు .. నా ఫోన్ పని చేయట్లేదు .. ఒక కాల్ చేసుకోవాలి కాస్త
నీ ఫోన్ ఇస్తావా.. ? అని అడిగాడు .. ఫోన్ ఇచ్చే లోపు purse లో నుండి అయన భార్య ఫోటో
తీసి న చేతిక్కిచ్చాడు call చెయ్యమని .. photo వెనక నెంబర్ రాసుంది. నెంబర్ నొక్కిచ్చా..
ఫోన్ తీసుకుని మాట్లాడటం మొదలుపెట్టాడు ఆ ..కమల నేనే
నే..బయల్దేరేసా..రేపొద్దునకల్లా వచ్చేస్తా ..ఆ ..నా ఫోన్ పాడైయింది .. అందుకే పక్కన వేరే
బాబు ని అడిగి చేస్తున్నా.. ఆ తిన్నలేవే.. టాబ్లెట్ కూడా వేసుకున్నా.. నువ్వు తిన్నావా ?
మోకాలి నొప్పి ఎలా ఉంది.. ఒక ఫ్లో లో మాట్లాడుకుంటూ పోతున్నాడు..

నేను లేసి డోర్ దగ్గరకు వెళ్లి నిలబడ్డా… తార గుర్తొచ్చింది.. బుర్ర లో ఆలోచనలు ట్రైన్ వేగం తో
పోటీ పడ్తున్నాయి… గడిచే ప్రతి నిమిషం తనకి నాకు మధ్య దూరం పెరుగుతూ ఉంది .. తార
కి నాకు ఎప్పుడు గొడవొచ్చినా ప్రేమ విషయం లో కాదు .. దాన్ని వ్యక్త పరుచుకోటం లో నే
వచ్చేది ..నేను ఎక్కువ కాలీగా ఉండటం వల్లనేమో తనతో మాట్లాడాలని , కలవాలని

ఎక్కువగా ప్రయత్నించేవాడిని .. కానీ తనకి కుదిరేది కాదు .. తన వర్క్ busy వల్ల.. తాను
నాకు అంత టైం ఇచ్చేది కాదు.. మా frequent గొడవలకి కారణం తాను నాకు attention
ఇవ్వట్లేదు అనే నా insecurity నుండే వచ్చేవి.. ఈరోజు నేను ఊరి నుండి వెళ్లిపోతున్నా అని
తెలిసి, వస్తా అని చెప్పి స్టేషన్ కి రాకపోవడాన్ని నేను తీస్కోలేకపోయాను .. అందుకే ఇక
తెంచేసుకోవాలని అనుకున్నా .. ఇలా ఆలోచిస్తూ ఉండగా వెనక నుండి ఎవరో బుజం పై
తట్టారు ..తిరిగి చూస్తే ఆ పెద్దాయన.. ఫోన్ తిరిగి ఇవ్వటానికి వచ్చాడు.

సారీ బాబు.. ఎక్కువ సేపు అయ్యింది అన్నాడు.. పర్లేదు అన్నట్లు నవ్వాను.. నా భార్య
బాబు.. ఒక్కత్తే ఉంటుంది ఇంట్లో.. నా ఫోన్ కి ట్రై చేసి ఉంటుంది ..అదేమో పాడైయింది..
కంగారు పడ్తూ ఉంటుంది .. అందుకే కాసేపు ఎక్కువ మాట్లాడా .. ఎం అనుకోకు..అని నా
చెయ్యి గట్టిగా పట్టుకొని థాంక్స్ బాబు అని చెప్పి సీట్ దగ్గరకు వెళ్ళిపోయాడు.. నేను తిరిగి
మళ్ళి ఆలోచనల్లో పడ్డాను..

నా ఆలోచనలు సృష్టించే అలజడి కి ఒక గంట గా అక్కడ జరుగుతున్న సన్నివేశం నాతో ఏదో
చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్లు అనిపించింది… ఒక జంట ఏమో కొత్తగా కలిసిన వాళ్ళు..
పక్క పక్కనే ఉన్న మాట్లాడుకోడానికి పదాలే లేవనట్లు గమ్మున ఉన్నారు.. ఇంకొక జంట
కొన్ని ఏళ్లగా కలిసి ఉంటున్నా.. ఇంకా ఒకరి పట్ల ఒకరు చాలా శ్రద్ధగా ఉన్నారు ..
మాట్లాడుకోటానికి మార్గం లేకపోయినా సృష్టించుకున్నారు. ఒక జంటకేమో ఒకరితో ఒకరు
మాట్లాడుకొట్టాన్ని తప్పించుకోడానికి సెల్ ఫోన్ ఉపయోగపడితే .. అదే సెల్ ఫోన్ ఇంకో జంట
కి ఆ దూరాన్ని దగ్గర చెయ్యడానికి ఉపయోగపడింది. Technology లో లోపం లేదు ..
దాన్ని మనం వాడే విధానం లో ఉంది అనిపించింది. ఒక జంట కలిసి ఉన్నాఇద్దరు
ఒంటరిగానే ఉన్నారు.. ఇంకో జంట దూరం గా ఉన్నా మాటల రూపం లో కలిసే ఉన్నారు..

మళ్ళీ నా ఆలోచన తార వైపు మల్లింది .. తను రోజు ఫోన్ చెయ్యదు కానీ .. చేసినపుడు
అరగంటైనా చాలా చుర్రుగ్గా చాలా విషయాల గురించి మాట్లాడేది.. ఎపుడో ఓసారి కలిసినా
ఉన్నంత సేపు చాలా happening గా ఉండేది .. నాతో ఉన్నపుడు కనీసం ఫోన్ కూడా వాడేది
కాదు.. బహుశా ప్రేమంటే ఎప్పుడు పక్కనే పక్కనే ఉండటం కాదు.. దూరం గా ఉన్న ఒకరి
ఆలోచనల్లో ఒకరు ఉండటమేమో.ఎపుడు కలిసే ఉండకపోయినా .. ఉన్నంత సేపు కలివిడి గా
ఉండటమేమో.. ప్రేమ లేనపుడు పక్క పక్కనే ఉన్నా ప్రయోజనం లేదు.. ప్రేమ ఉన్నపుడు
పక్కనే ఉండాల్సిన అవసరమూ లేదు.. చాలా సేపటి నుండి ఉన్న గందరగోళం అంతా
మెల్లగా విడిపోయి ఒక clarity వచ్చినట్లు అనిపించింది ..

వెంటనే ఫోన్ తీసి .. తార కి పెట్టిన message చూసాను .. అది ఇంకా deliver కాలేదు ..
గట్టిగా ఊపిరి పీల్చి ..ఆ message ని ఫోన్ లో నుండి .. Long distance Relationship
వర్కౌట్ కాదు అనే ఆలోచనని మైండ్ లో నుండి ఒకేసారి Delete చేశాను .నా confusion ..
clarity గా మారటానికి indirect గా కారణం అయినా భార్య మీద ఆ పెద్దాయన కి ఉన్న
ప్రేమకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నా..

మబ్బులు విడిచిన సూర్యుని చూసి..
మొగ్గలు విచ్చును తామర ..
దూరం భారం చుడనిదొకటే ..
నీకు పుట్టిన ప్రేమ రా…!

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: ,