This Funny Fan Letter to Samantha Akkineni will put a smile on your face

 

Contributed By Hari Atthaluri

 

నీ కళ్ళ తో..మమ్మల్ని..
“ఏం మాయ చేశావో” కానీ..
నిజంగా పక్కింటి అమ్మాయిలా
ఇట్టే కలిసి పోయావు…
అలా నిన్ను చూసిన ప్రతి సారి అదే మ్యాజిక్..అదే మ్యూజిక్..
కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మా అని !!

 

ఒకసారి..
“బృందావనం” లో ముద్దు ముద్దు గా మాట్లాడే గోపిక లా ఉంటావు..
ఇంకోసారి..
“దూకుడు” పెంచి మాట్లాడే టైప్ 2 అమ్మాయిలా ఉంటావు..

 

నువ్వు ఎలా ఉన్నా,

ఇటు రాయే ఇటు రాయే…
నీ మీదే మనసాయే అని అప్పట్లో తెగ సంబర పడే వాళ్ళం !!

“ఈ గ”ల గల గొంతు నుంచి వచ్చే మాటల వింటూ చాలా సార్లు గతం లోకి జారిపోయే వాళ్ళం..
మా గుండె గూటిలో నీ గుండె హాయిగా తల దాచుకుందని తెలీదా అనుకుంటూ అలా చూస్తూ ఉండి పోయే వాళ్ళం…

 

అలా అలా… మా అందరిది ఒకటే మాట..
నిన్ను చూస్తూ చూస్తూ..”ఏటో వెళ్లిపోయింది మనసు”.అని..
ఒకటే పాట…
ఎంతెంత దూరం నన్ను పో పో అన్నా..
అంతంత చేరువై నీతో ఉన్నా !! అని

 

“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” కి కాచిన మల్లె పువ్వు
అంత మృదువు గా ఉండే నీ మాటల కి,
చిన్నోడా చిన్నోడా అని నువ్వు పిలిచే పిలుపు కి ఫిదా అయిపోయాం…నేను హర్టు, బుంగ మూతి పెట్టుకున్నా అనే నీ మాటలు..”జబర్దస్త్” అంత నవ్వు తెప్పించేవి..

 

“అత్తారింటికి దారేది” అని అనుకుంటూ తిరిగే,
మా లాంటి వాళ్ళందరికీ ఓ అల్లరి మరదలు ఉంటే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉన్న నిన్ను చూడగానే,
నిజంగానే మా చిట్టి గుండె గట్టిగా కొట్టుకుంది…

 

రామయ్య వస్తావయ్య , నువ్వు ఐనా వచ్చి
ఈ అమ్మాయి మనసు కొంచెం మార్చవయ్యా అని మేము వేడుకుంటుంటే…
“మనం” అనుకునే దాని కన్నా తను ఇంకా చాలా ఎక్కువ…
తను మా “కనులను తాకే ఓ కల” మాత్రమే అని అర్దం అవ్వటానికి మాకు చాలా టైమ్ పట్టింది….

 

“S/o సత్యమూర్తి” ని అడిగితే s/o నాగార్జున తో,
నువ్వు ప్రేమ లో ఉన్నావు అని తెలిసి…
ఎంత బాధ పడ్డామో నీకేం తెలుసు…
కానీ అదే నిజం అని తెలిసి, శీతాకాలం సూర్యుడు లా కొంచెం కొంచెం సెట్ అయ్యాం..

 

“24” గంటలు నిన్ను చూస్తూ ఉంటే
మాకు ఓ “బ్రహ్మోత్సవం” లాగే ఉంటుంది….

 

“అ ఆ” లు చెప్పినంత ముద్దు గా నువ్వు..
బావా ఒక్క సారి అంటే అంతే నాశనం, మళ్లీ లవ్ లో పడిపోతారు!
ఏం చేస్తాం అంత బాగుంటావు మరి !!

 

“జనతా గ్యారేజ్” వైపు వచ్చి నే సెలవడిగి అని నువ్వు పాడుకుంటూ అలా నువ్వు వెళ్ళిపోతే మేము మాత్రం అక్కడే ఉండిపోయాం…

ఎప్పుడూ మామూలు అమ్మాయి లా ఉండే నువ్వు..
సడెన్ గా “రంగస్థలం” రామలక్ష్మి లా మారిపోతే…
ఎంత సక్కగున్నవే లచ్చిమి..ఎంత సక్కాగున్నవే…అని ఎన్ని సార్లు దిష్టి తీసామో, నీకు తెలియదు…

 

“మహా నటి” ఆ సావిత్రమ్మ అంత మంచితనం నీ సొంతం…

పెళ్లి అయ్యాక ఇంక నువ్వు కనిపించవు ఏమో అనుకున్నాం కానీ “యు టర్న్ ” తీసుకుని,
మరొక్కసారి అంటూ మ్యాజిక్ రిపీట్ చేసి..
నా “మజిలీ” ఇంకా ఉంది అని అర్థం అయ్యేలా చెప్పావు..
ప్రియతమా ప్రియతమా అనుకునేలా చేశావు…

 

“ఓ బేబీ ! నిజంగా,
నువ్వు దేవుడు మా టాలీవుడ్ కి ఇచ్చిన వరం!
మేరీ “జాను” అనుకునే అంతటి ఇష్టం !!
ప్రాణం మా ప్రాణం అనుకునే అంతటి అభిమానం !!!

 

ఇట్లు
మీ ఓ అభిమాని!

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , ,