Meet The Company That’s Ripening The Mango In A Healthy & Safe Method

 

ఎండాకాలంలో ప్రజలు ఎండవేడికి తట్టుకోలేరని వారికి స్వాంతన కలుగజేయాలని ప్రకృతి కమ్మని మామిడిపండ్లను ఇస్తుందని అంటారు. ఐతే ప్రకృతి అంత ప్రేమతో ఇచ్చే పండ్లు అంత స్వచ్ఛంగా ఉంటున్నాయా అంటే అది అందరికీ తెలిసిన విషయమే. మామిడి ఎక్కువ శాతం కలుషితమవుతున్నది వాటిని మాగబెట్టే దశలోనే. ప్రమాదకరమైన కార్బైడ్ కాకుండా హైటెన్ సంస్థ వారు కొన్ని ప్రత్యేక పదార్ధాలతో తయారుచేసిన En-Ripe పద్దతితో మామిడిని మాగబెట్టడం ద్వారా మామిడి లోని అసలైన రుచిని, ఆరోగ్యాన్ని పొందవచ్చని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి వారితో కలిసి పనిచేస్తున్నారు. 

కార్బైడ్ ఎందుకు హానికరం.?
సాధారణంగా పండ్లు తిన్నాక శరీరానికి మంచి జరగాలి, అలా కాకుండా మామిడి పండ్లు తిన్నాక వేడి చెయ్యడం, తుమ్ములు రావడం, శరీరంలో శక్తి లేనట్టుగా అనిపించడం మొదలైన అసౌకర్యాలకు మనం గురి అవుతున్నాం. అంటే మన శరీరం మనల్ని హెచ్చరిస్తోంది, అది బాధ పడుతుందనంటే అది మంచి ఫుడ్ కాదు అని. మామిడి కాయ దశ నుండి పండుగా మారడానికి ఒక నిర్ణీత సమయం ఉంటుంది, మామిడికాయ కూడా చాలా రకాల హింట్స్ కూడా ఇస్తుంది. కానీ చాలామంది వీటిని పరిగణనలోకి తీసుకోకుండా పచ్చిగా ఉన్నప్పుడే కోసి వాటిని మధ్యలో ప్రమాదకరమైన కార్బైడ్ ను ఉంచుతున్నారు.


 

మీరు గమనించే ఉంటారు అసలైన మామిడిపండు మన దగ్గర్లో ఉంటే కనుక సువాసన అద్భుతంగా ఉంటుంది, కానీ ఇప్పుడు ముక్కు దగ్గరగా పెట్టుకుని చూస్తే తప్ప ఆ వాసన రుచి తెలియడం లేదు. మామిడి తొక్క చేదుగా మారిపోవడం, దానిని చిత్రవధకు గురిచేసినట్టుగా కనిపించడం.. ఈ పద్ధతి మామిడి పండుకే కాదు, మనకు తీవ్ర అనారోగ్యకరం. ఇలాంటి పండ్లు తింటే క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు వస్తాయని రీసెర్చ్ లో తేలింది. కార్బైడ్ కేవలం మామిడిపండ్ల కోసమే కాదు ఏ పండ్ల కోసం ఉపయోగించకూడదు అని ప్రభుత్వం ఎప్పుడో దీనిని బ్యాన్ చేసింది, ఐనగాని తెలివి మీరిన వ్యాపారస్తులు ఎలాగోలా నిషేదితంగానే పండిస్తున్నారు.


 

En-Ripe ఎందుకు సేఫ్.?
పూర్వం మామిడికాయలను చెట్టు మీద పండడమో లేదంటే గడ్డిలో మాగబెట్టేవారు దీనికి వారం నుండి సుమారు పదిరోజుల సమయం పట్టేది, ఇదే పద్దతిలో ప్రస్తుతం కూడా పండిస్తే కనుక మార్కెట్ ధర, డిమాండ్ కు తగ్గ సప్లై సరిగ్గా జరగక రైతులకు అధిక నష్టాలు వస్తాయి. అందుకే అనారోగ్యకరమైన కార్బైడ్ వాడుతున్నారు. ఇలా కాకుండా మామిడికి ఏవిధమైన హాని కలిగించని en-ripe తో మాగబెడితే కనుక రెండు, మూడు రోజుల్లోనే పూర్తి ఆరోగ్యాన్ని, రుచిని అందించే మామిడి పండు వస్తుంది. ఇది పూర్తి సేఫెస్ట్ మెథడ్ అని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ వారు ఆమోదం తెలిపారు, అలాగే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇంకా మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. En-Ripe ను తయారుచేస్తున్న హైటెన్ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుని రైతులకు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ఈ పద్ధతి మూలంగా పండించే రైతులకే కాదు వాటిని తినే ప్రజలకు ఇది అన్ని విధాలా ప్రయోజనకరం. అభివృద్ధి పెరగడం అంటే మృత్యువుకు దగ్గరగా వెళ్లడం కాదు మనిషి మరో మెట్టుకు ఎదగడం అని నిరూపిస్తున్న ఇలాంటి వ్యక్తులు, సంస్థలు మరింతమంది ముందుకు రావాలి.


 

You Can Contact Them: 9666179475(Sathwik)
Website: http://Www.heighten.co.in

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , , , , ,