సామజవరగమనా : A Deeper Meaning Into A Keerthana Written By Sri Tyaagaraya & A Song Written By Sirivennala Garu

 

అల వైకుంఠపురం సినిమా మనకు బాగా connect చేసిన మొదటి అంశం. సామజవరాగమనా పాట. ఆ పాట ఎన్ని సార్లు మనం విన్నామో, విని ఎన్ని సార్లు ఊహల్లో తేలామో మనకే తెలుసు. ఆ పాట లోని సాహిత్యం కూడా అంతే బాగుంటుంది. సిరివెన్నెల గారి పదాలతో మరింత అందంగా మారిన ఆ పాట గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం రండి..


 

“సామజవరగమనా” అనే పదం వినగానే.., కొంతమందికి త్యాగరాయ కీర్తన గుర్తొస్తుంది..
కొంతమందికి “శారద” అని గట్టిగా అరిచే “శంకరాభరణం శంకరశాస్త్రి” గారు గుర్తొస్తారు.. కొంతమందికి “మా మావ పాట” అని తన జ్ఞాపకాలను గుర్తు చేస్కునే కింగ్ సినిమా లోని “స్వరబ్రహ్మ జయసూర్య” గుర్తొస్తాడు.
కానీ అసలు “సామజవరగమనా” అంటే ఏంటో, ఇంకా సిరివెన్నెల గారు ఈ పాట లో కొన్ని కవితాత్మకమైన అందమైన వర్ణనలు కూడా రాసారు, వాటిని తెలుసుకుందాం.

 

“సామజవరగమనా” త్యాగరాయ కీర్తన :
పల్లవి: సామజవరగమనా! సాధుహృత్సారసాబ్జపాల! కాలాతీతవిఖ్యాత! ॥సామజ॥
అనుపల్లవి: సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల! దయాలవాల! మాంపాలయ! ॥సామజ॥
చరణం: వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీపా। స్వీకృత యాదవకులమురళీ!
గానవినోదన మోహనకర త్యాగరాజ వందనీయ ॥సామజ॥

ఈ కీర్తన త్యాగ రాయ కీర్తనలన్నిటిలో ప్రసిద్ధి పొందినది.. ఈ కీర్తన లో ని ప్రతి పదం, శ్రీ కృష్ణుడిని వర్ణిస్తూ ఉంటుంది..


 

ప్రతి పదార్ధం :

సామజ(ఏనుగు) వర(వంటి) గమనా(నడక కలిగిన వాడ) – ఏనుగు నడక లాంటి గంభీరమైన నడక కలవాడా

సాధుహృత్సారసాబ్జపాల – సాధువులు, సజ్జనుల హృదయపద్మములను పాలించేవాడా

కాలాతీతవిఖ్యాత – అన్నికాలములలోనూ కీర్తింపబడేవాడా

సామనిగమజ సుధామయగానవిచక్షణ – సామ వేదానికి మొదలు గా ఆ సంగీతముని నిత్యం పరిశీలిస్తూ పర్యవేక్షించేటి వాడ

గుణశీలదయాలవాల – గుణముకు దయకు ఉదాహరణగా నిలిచేటి వాడ

మాంపాలయ – నన్ను పాలించు

వేదశిరోమాతృజ – వేదములలో గొప్పదైన సామవేదమునుండి పుట్టిన

సప్తస్వరనాదాచలదీప – సప్తస్వరముల లయము వలన కలిగిన కదలని దీపమువంటి నాదమువలె ప్రకాశించువాడా

స్వీకృతయాదవకుల – యాదవకులములో జన్మించినవాడా

మురళీగానవినోదనమోహనకర – మురళీగానముచే వినోదించుచూ అందరిని ఆనదింప జేసేవాడా;

త్యాగరాజ వందనీయ – త్యాగరాజుచే నమస్కరింపబడినవాడా

 

అర్ధం:

ఏనుగు నడకవంటి గంభీరమైన నడక తో, మునులు మనిషులు హృదయాలను ఏలుతున్న ఓ శ్రీ హరి, నువ్వు కాలం తో సంబంధం లేకుండా అందరి చేత పొగడ బడతావు..
సామవేదం పుట్టుక నీవల్లే జరిగింది.. సంగీతాన్ని రక్షించేవాడివి నీవే, గుణమునకి, దయకి ఉదాహరణ నీవే.. నన్ను కూడా నీవే నడిపించాలి..
సమావేదమునుండి పుట్టిన సప్తస్వరముల వల్ల, ప్రకాశిస్తూ.. గోవులని రక్షిస్తూ.. మురళి గానం తో మామ్మలందరిని ఆనంద పరుస్తూ.., ఈ త్యాగరాజ వందనములను అందుకో..

 

Meaning:

O Lord whose princely gait is like an elephant! O Lord who protects the lotus like hearts of the pious people! O Lord whose fame transcends time! O Lord who is expert in the nectar-like music arising from the sAma veda! O Virtuous! O Compassionate! Protect me! O Lord who a lamp in the mountain that is music! O Lord in the Yadava clan! O Lord who plays the flute! O Lord who amuses himself by being enchanting! Protect me!

 

త్యాగయ్య, శ్రీకృష్ణుడి నడక ని, ఏనుగు నడక తో పోల్చారు. మనం ఏనుగు నడక ని గమనిస్తే, ఎంతో గంభీరంగా, నెమ్మది గా నడుస్తుంది. సింహం నడక హింస తో కూడిన అధికారానికి ప్రతీక అయితే, ఏనుగు నడక హింస లేని అధికారానికి ప్రతీక.

 

సిరివెన్నెల గారి “సామజవరగమనా”:
పల్లవి:
నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు

ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయ లేదా అసలు

నీ కళ్ళకి కావలికాస్తాయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు

నా ఊపిరి గాలికి ఉయ్యాలాగ ఊగుతూ ఉంటే ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు

సామజవరగమనా నిను చూసి ఆగ గలనా?
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పా తగునా…

 

చరణం:
మల్లెల మాసమా…
మంజుల హాసమా…
ప్రతి మలుపులోన ఎదురు పడిన వెన్నల వనమా…
విరిసిన పింఛమా…
విరుల ప్రపంచమా…
ఎన్నెన్ని వన్నెచిన్నలంటే, ఎన్నగ వశమా?

అరె, నా గాలే తగిలినా…
నా నీడే తరిమినా..
ఉలకవా, పలకవా, భామా…
ఎంతో బతిమాలినా…
ఇంతేనా అంగనా..
మదిని మీటు మధురమైన మనవిని వినుమా..

 

త్యాగయ్య “సామజవరగమనా” అని శ్రీకృష్ణుడిని వర్ణిస్తే, సిరివెన్నెల గారు అమ్మాయిని వర్ణించారు, ఆ పాత్రలోని గాంభీర్యాన్ని (seriousness,dominance) ని వర్ణించారు.

ఏనుగు ఎప్పుడు ముక్కుసూటి గా వెళ్తుంది(చదరంగం లో కూడా అంతే), అలా నడుస్తున్నప్పుడు దారిలో ఏమున్నా తొక్కేస్తూ, తొండం తో అవతలికి విసిరేస్తూ ఉంటుంది.

అలానే ఈ అమ్మాయి కూడా, ఆ అబ్బాయి కళ్ళు, తన కాళ్ళని పట్టుకుని ఉన్న తొక్కేస్తూ వెళ్ళిపోతోంది. తనదైన గంభీరత్వం తో నడుచుకుంటూ..

కాటుకల ఆ అమ్మాయి కళ్ళకి కాపల గా ఉందామనుకున్న, నులిపేస్తోంది.

తన ఊపిరి తో ఆ అమ్మాయి ముంగురులని (ముందుకు వచ్చే జుట్టుని) ఉయ్యాలలా ఊపుదామనుకుంటే ఆ ముంగురులని కూడా నెట్టేస్తోంది.

ఇలా ఆగకుండా ఎన్ని చేస్తున్న ఆ అమ్మాయి అస్సలు పట్టించుకోవట్లేదు..

ఆ అమ్మాయికి మల్లెల మాసం లాంటి మనోహరమైన రూపం ఉంది.

మంజుల (అందమైన) నవ్వు ఉంది..

ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్లిన వెన్నల లా ఎదురుపడుతోంది..

విరిసిన పింఛం లాంటి ముఖం.

పువ్వులాంటి సువాసన కలది.

ఇలా చెప్పుకుంటూ పోతే ఆ అమ్మాయి గురించి చెప్పడం చాలా కష్టం.

అలాంటి తను, ఆ అబ్బాయి గాలి తగిలిన, నీడలా వెంటాడుతున్న, ఒక్క చూపు కూడా చూడట్లేదు..

(ఇక్కడ ‘అంగన’ అనే పదం ఉపయోగించారు సిరివెన్నెల గారు, అంటే, మంచి రూపం గల అమ్మాయిని అని అర్ధం (ప్రేమ కి దేవత అని అర్ధం))

అలా తను ఎంత బతిమాలిన ఒక మాటైనా అనట్లేదు.. ఒక్కసారైనా మాట్లాడమని మనవి చేసుకుంటున్నాడు ఇక ఈ అబ్బాయి.

 

సిరివెన్నెల గారు “సామజవరగమనా” అనే పదం ఇంతకుముందు ఇంకో పాటలో కూడా చాలా బాగా ఉపయోగించారు..


 

సిరివెన్నెల గారు, మనలో ఉత్తేజాన్ని, గెలవాలి అనే ప్రేరణ ని ఎంతలా గలిగిస్తారో, ప్రేమ ని, ఆ ప్రేమ ని పుట్టించిన అమ్మాయిని కూడా అంతే అందంగా వర్ణిస్తారు. “అల వైకుంఠ పురం లో” ని ఈ పాట అందుకు ఒక చక్కటి ఉదాహరణ.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , , , , , , , , ,