Meet The Telugu Guy Who Mastered The Art Of Solving “Rubik’s Cube”!

 

మనం ఏ రంగాన్ని ఎంచుకున్నా గాని దానిని మనం మనస్పూర్తిగానే ఎంచుకుంటాం.. మనస్పూర్తిగా ఎంచుకున్న రంగంలో అనుమానాలుండవు, భయం ఉండదు అటువంటి చోటనే వందశాతం మన సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తాం. వంశీ కృష్ణం రాజు కూడా సరిగ్గా ఇలాగే తనకు నచ్చిన రంగాన్నే ఎంచుకున్నారు, ఆ ఇష్టానికి మరింత శ్రమను జోడించారు అంతే.. ఏ ఎక్కరి ఊహకందనంత అద్బుతాలను సృష్టిస్తున్నారు.


 

కొన్ని గేమ్స్ వల్ల ఫిజికల్ గా బెనిఫిట్స్ ఉంటే, రూబిక్స్ క్యూబ్ వల్ల మన ఆలోచనలకు బెనిఫిట్ ఉంటుందనంటారు. ఫిజికల్ గా శ్రమపడడం ఎంత కష్టమో రూబిక్స్ క్యూబ్ లాంటి గేమ్స్ ఆడడం అంతకన్నా కష్టం. ఈ ఆటని వంశీ కృష్ణ ఓ ఆట ఆడుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు కొంత టైం వ్యవది పెట్టుకుని విజయాలను, రికార్డులను నెలకొల్పినవారిని చూస్తున్నాం వంశీ అంతకుమించి నీటిలో రూబిక్స్ క్యూబ్ ని సాల్వ్ చేయడం, కళ్ళకుగంతలు కట్టుకుని సాల్వ్ చేయడం, ఒంటి చేత్తో సాల్వ్ చేయడం, 24గంటలపాటు ఏ విరామం లేకుండా సాల్వ్ చేయడం.. ఇలాంటి రకరకాలై న పద్దతిలో అద్భుతాలను సృష్టిస్తు గిన్నీస్ బుక్ లో సైతం రెండు సార్లు స్థానం సంపాదించుకున్నాడు.



 

నిజానికి ప్రతీది మన జీవితంలోకి కాకతాలీయంగానే వస్తుంది కాని అది మనల్ని ఏ విధంగా ప్రభావితం చేసిందాన్ని బట్టే దానితో మన ప్రయాణం ఆధారపడి ఉంటుంది. ఎప్పుడో చిన్నతనంలో భీమవరంలో మొదటిసారి జాతరలో కొనుక్కున్న క్యూబ్ వల్ల నెమ్మదిగా దానిని సాల్వ్ చెయ్యాలన్న కసి పెరిగింది, సాల్వ్ చేస్తున్న కొద్ది ఆ విజయం హాబిగా మారిపోయింది, ఆ విజయాన్ని ప్రత్యేకంగా పొందాలి అనే తపనలో ఇలా రకరకాల స్టైల్ లో సాల్వ్ చేయడం మొదలుపెట్టారు.



 

రూబిక్ రాజు రికార్డ్స్:
* ఒకే చక్రంతో నడిచే యూనిసైకిల్ మీద ప్రయాణం చేస్తూ గంట ముప్పై నిమిషాల వ్యవధిలో రూబిక్స్ క్యూబ్165 సార్లు సాల్వ్ చేశాడు.
* 2014లో 24గంటల్లో 2176 సార్లు రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి మొదటి గిన్నీస్ రికార్డ్ ను వంశి అందుకున్నాడు.
* అన్నీటి కన్నా కష్ట తరంగా నీటిలో మునిగి, ఊపిరి తీసుకోకుండా కేవలం 53 సెకండ్లలోనే రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసెసాడు.



తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటు రెండు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అందుకుని మరికొన్ని గిన్నీస్ రికార్డ్స్ అందుకునే వేటలో నిమగ్నమయ్యారు.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , ,