Rupa – An Imaginary Spin-Off From Sekhar Kammula’s Anand, 15 Years After Their Marriage – Part 1

Contributed By Bharadwaj Godavarthi

‘ఆనంద్’ కథ చివర్లో ‘ఆనంద్’ అని గట్టిగా అరుచుకుంటూ వచ్చి తనని హత్తుకునే సన్నివేశాన్ని ఎవరు మర్చిపోగలరు. అసలు ఆ కథ లో రూపని అంత త్వరగా ఎవరైనా మర్చిపోగలరా.

అన్నట్లు చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి కూడా అయిపోయింది, పద్మారావునగర్ లోని, ఆ ఇంట్లోనే ఉంటున్నారు.

పెళ్లయ్యాక ఆనంద్, ‘రూప’ నిన్ను రాజకుమారిలా చూసుకుంటా, మా ఇంటికి వెళ్దాం అన్నాడు!!

దానికి రూప ‘పోవోయ్, ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయో తెలుసా ఆనంద్ ఈ ఇంట్లో!! ‘అమ్మ’,’అనిత’, ‘బామ్మ’, ‘బౌ బౌ’, ‘నీతో స్నేహం’, ‘ప్రేమ’!! ఈ జ్ఞాపాకాలు నాకు ఇచ్చిన ఆనందం, మీ ఖరీదైన ఇల్లు ఇవ్వలేదేమో ఆనంద్, ప్లీజ్ ఆనంద్ ఇక్కడే ఉందాం!! ఇల్లు కొంచం ఇరుకు, కానీ కొన్ని కోట్ల ఖరీదైన జ్ఞాపకాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి అంది రూప!!

నీకు బోనస్ ఏంటో చెప్పనా??

హా చెప్పు??

నువ్వు ఆ గదిలో ఉండవచ్చు, అప్పుడప్పుడు నా ఇంట్లో కూడా ఉండచ్చు, అంది చిలిపిగా నవ్వుతూ!!

అప్పుడప్పుడు!! అన్నాడు ఆనంద్ కోపం నటిస్తూ, రూప వైపు ప్రేమగా చూస్తూ??

రూప మామూలు పిల్లా, ఆనంద్ ఒప్పేసుకున్నాడు!!

ఇప్పుడు అదే ఇంట్లో, ఆనంద్ ఉన్న అదే రూమ్ వాళ్ళ పెద్దబ్బాయి ఇచ్చారు, అనిత పెళ్లి చేసుకొని కెనడా వెళ్ళిపోయింది,

చెప్పడం మర్చిపోయాను ‘వాళ్ళకి’ ఇద్దరు పిల్లలు ‘అద్వైత’, ‘ఆనంద్’

రూప కి ‘ఆనంద్’ పట్ల ఉన్న ప్రేమకి ఇది నిదర్శనం, పట్టు పట్టి తన కొడుకు పేరు కూడా ఆనంద్ అనే పెట్టింది!!

‘వాడికి’ కూడా నా పేరు పెట్టేస్తే ‘బోర్’ కొట్టేస్తుంది ‘రూప’,  అన్నాడు ఆనంద్!!

పోవోయ్, నాకు ‘నీ’ మీద కోపం వస్తే ‘వాడిని’ హ్యాపీగా తిట్టొచ్చు, అంది నవ్వుతూ!! అక్కడితో ఆగలేదు !! పెళ్ళైన దగ్గర నుంచి పెద్ద ఫోజ్ కొడుతున్నావు, చిన్న మాట అంటే చాలు, నేను ఎవరినో తెలుసా అంటావు??

ఆ ఎవరో నువ్వు చెప్పనివ్వవుగా రూప??

చెప్తే విడాకులు ఇచ్చేస్తా??

ఇవ్వు చూదాం, నేను నీ మొగుడిని, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంటాడు ‘ఆనంద్’ ఆటపట్టిస్తూ!!

రూప కి నేను ‘మొగుడు’, నేను చెప్పింది వినాలి, ఇలాంటి మాటలు వింటే తన్నేయాలి అనిపిస్తుంది, మొన్నెప్పుడో ‘ఇలానే’ వీధి చివర ఒకడు అంటే వెళ్లి పంచాయతీ పెట్టి వచ్చింది. నువ్వు రచ్చబండకు వెళ్ళిపో ‘రూప’,  మంచి డబ్బులు కూడా వస్తాయి అంటాడు ఆనంద్ నవ్వుతూ!!

మొత్తానికి ఆనంద్ పట్టు పట్టి కొడుకుకి ‘జున్ను’ అని ముద్దు పేరు పెట్టాడు!!

రూప తన పిల్లలకు సింహ స్వప్నం??

ఒక వారం ‘అద్వైత’ వంటింట్లో హెల్ప్ చేస్తే, మరో వారం ‘ జున్ను’   వంటింట్లో హెల్ప్ చేయాల్సిందే. ఒక వారం బయట పనులు జున్ను చేస్తే, మరో వారం అద్వైత చేయాల్సింది.

నన్ను అమ్మలా చూడొద్దు అంటుంది రూప??అమ్మ సూపర్ నువ్వు, అన్ని పనులు నువ్వే చేస్తావు, నీకు విశ్రాంతి ఉండదు, ఇలాంటి ;చెత్త’ మాటలు వద్దు అంటుంది.

అందరూ సమానం,జాలి చూపిస్తూ ‘నా’ పుట్టిన రోజు నాడు ‘మగువా మగువా’ అని పాటలు పెట్టి insta స్టోరీస్ పెడితే చంపేస్తా , అని పిల్లలకు నవ్వుతూ వార్నింగ్ ఇస్తుంది.

రూప కి తన అమ్మ ఇంట్లో ఇష్టం, అత్తగారిని అమ్మలా చూసుకుంటుంది, తన ఫ్యామిలీ చావుకి కారణం అయిన ఆనంద్ తండ్రిని సొంత కొడుకులా సాకుతుంది.రూపతో ఆనంద్ పొరపాటున కూడా షాపింగ్ కి వెళ్ళడు, ‘మాల్ లో’ కూడా బేరం ఆడిస్తుంది అని భయం. ఆనంద్ పెళ్లి అయ్యాక కొంచెం మారాడని రూప అనుమానం??

రూప, ఇంకా ఆ అరుగు మీదా కూర్చొని కాఫీ తాగడానికి ఇష్ట పడుతుంది, ఇంకా పిల్లలకి సంగీతం నేర్పిస్తూ ఉంటుంది, ఇంకా చూపులతో ఆనందని భయపెట్టేస్తూ ఉంటుంది.

రూప ఏమి మారలేదు, ఎందుకు మారాలి అంటుంది.

కానీ ఒక రోజు రూప మారాల్సి వస్తే?

రూప ‘మాయలో’ పడిపోయి,  ‘ఆనంద్’ గురించి చెప్పడం మర్చిపోయాను అనుకున్నారా??

ఆనంద్, 

‘రూప తో’  వివాహం తర్వాత ‘ఆనంద్’ చాలా మారిపోయాడు!!

‘సొంతంగా తనకు పెద్ద కంపెనీ ఉన్నా,  బాధ్యతలు అన్నీ తన ‘రాజుకి’ అప్పగించేసాను, ‘ఆస్తుల’ గురించి  అంత ‘యావ లేదు’!!

‘రూపకి’ ‘తను’, ‘ఇల్లు’, ‘ఆనంద్’, పిల్లలే తన ప్రపంచం, తన జీవితం.

‘ఆనందకి’ ప్రపంచమే తన ఇల్లు, ట్రావెలింగ్ అంటే పిచ్చి, YOUTUBEలో సొంతంగా ట్రావెలింగ్ ఛానల్ స్టార్ట్ చేసాడు. మొన్ననే ‘300K Subscribers’ కూడా సాధించాడు!!

‘రూప’ అంటుంది, ‘ఓయ్ ఆనంద్’ పెద్ద youtuber అయిపోయావ్ బాస్, ఇలానే grounded గా ఉండు, చెత్త ‘పొగడ్తలకి’ దూరంగా ఉండు, అని తనదైన శైలిలో సలహా ఇస్తుంది!!

ఆనంద్ ‘ఎప్పుడు’ సింపుల్ గానే ఉంటాడు?? తన ‘subscribersకి’ ఆనంద్ అంటే అందుకే ఇష్టం.

ప్రదేశాలు చూపించడం ఒక్కటే కాదు!!తను ‘ప్రయాణం చేసేటప్పుడు’ ఒక్క రూపాయి తీసుకువెళ్ళడు??’Hitchhiking’  చేస్తాడు, మనుషులని నమ్ముతాడు, వాళ్ళ కథలు వింటాడు, తన కథ పంచుకుంటాడు. వాళ్ల ఇళ్లలో మనిషిలా కలిసిపోతాడు??అనేక సంస్కృతులు, అనేక భాషలు, వేరు వేరు మనుషులు, వేరు వేరు అభిరుచులు!!

కానీ ఆనంద్ అందరికీ నచ్చేసాడు, ఇట్టే మన మనిషి అనిపించుకుంటాడు!!

ఒకో రోజు ఆశ్రయం దొరకదు, తిండి దొరకదు, జేబులో రూపాయి ఉండదు, కానీ తన చిరునవ్వు మాత్రం చెదరదు.

‘ఆనంద్’ దృష్టిలో ‘ట్రావెలింగ్’ అంటే,’Flight/Bus/Train’ ఎక్కి కళ్ళు మూసుకొని,చెవిలో ‘HeadSet’ పెట్టుకొని, ‘హోటల్లో’ దిగి, కొన్నిప్రదేశాలు చూసి, ఫోటోలు దిగి, Instagram స్టోరీ అప్డేట్ చేయడం కాదు??

‘ఆనంద్’ దృష్టిలో ట్రావెలింగ్ వెళ్లే మార్గాన్ని ఆస్వాదించడం,ట్రావెలింగ్ అంటే ‘మీటింగ్ పీపుల్’, ట్రావెలింగ్ అంటే అందమైనక్షణాలు మాత్రమే కాదు, 

వెళ్లే మార్గంలో ఎదురయ్యే భయం, ఒంటరితనం,  అవి నేర్పే పాఠాలు,  చూపే కొత్త దారులు, దారులు పరిచయం చేసే కొత్త స్నేహాలు, స్నేహాలు మిగిల్చే జ్ఞాపకాలు,

జ్ఞాపకాలు నింపే ధైర్యం,

ధైర్యం వేయించే మరో అడుగు,

అడుగు చూపించే కొత్త ప్రపంచం.

ఒక్కమాటలో చెప్పాలంటే ఆనంద్ ‘డబ్బుల కోసం’, ‘YOUTUBE’ నుంచి ‘వచ్చే’ ఫేమ్ కోసమో రోడ్ ‘ఎక్కలేదు’, ఒక Endlessజర్నీ కోసం రోడ్ మీదకి వచ్చాడు,

ఒకసారిఆనంద్ ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తే ఇంటికి రావడానికి నెల రోజులు పట్టొచ్చు, ఒకోసారి 6నెలలు పట్టొచ్చు!!

 మరి ‘రూప కి’ కోపం రాదా అని అడగచ్చు,

‘ఆనంద్ ని ‘అంతగా ప్రేమించిన రూప, ‘ఆనంద్’ ఎక్కువగా ప్రేమించే ట్రావెలింగ్ నుంచి ఎందుకు దూరం చేస్తుంది??

ఆనంద్, రూప పరస్పరం గౌరవించుకునే వ్యక్తులు, ఒకరి అభిరుచికి, జీవితానికి ఇంకొకరు అడ్డు రాకుండా చూసుకుంటారు. ‘Companionship’ బాగా నమ్మే వ్యక్తులు.

‘లాక్ డౌన్’ కారణంగా leh లో ఇరుక్కుపోయిన ఆనంద్, ఒకరోజు పొద్దున్నే రూప కి వీడియో కాల్ చేసాడు.

I MISS YOU రూప,ఆనంద్ సాయంత్రం తీరిక గా మాట్లాడుకుందాం, ఇంకో 30minలో నాకు ప్రెసెంటేషన్ ఉంది, పో ‘రూప’ నీకు ‘నా’ మీద ‘ప్రేమ’ లేదు, మిస్ ‘అయ్యానని’ ఫోన్ చేస్తే కనీసం బాధ కూడా లేదు.

ఆనంద్ ఇవే చెత్త మాటలు వద్దన్నా, నువ్వెప్పుడూ నాతోనే ఉంటావు, ‘నేను’ నిన్నెపుడూ మిస్ అవ్వను!!

ఆనంద్ నవ్వేస్తూ, రూప, నేను నీతో మాట్లాడగలనా?? 

అద్వైత, జున్ను ఎలా ఉన్నారు?

వాళ్ళకే,  బయట బౌబౌతో ఆడుకుంటున్నారు, పిలవమంటావా??

వొద్దులే, తొందరగా వచ్చేస్తాను అని చెప్పు, సరే మరి Bye  Bye Anand

ఓయ్ ఆనంద్,

ఎంటీ??

నిజంగా మిస్ అయ్యావా??

ఇందాక అదేగా చెప్పింది!! సరిగ్గా వినిపించలేదా!!

ఆ మాట వినగానే చీకట్లోగాలికి నాట్యం ఆడే ‘దీపంలా’, రూపపెదవులపై నవ్వు నాట్యమాడింది.

‘నువ్వు’ నన్ను మిస్ అవ్వడం నాకు చాలా బావుంది ఆనంద్, ఈ ఫీలింగ్ చాలా బాగుంది. ఆ మాటతో ఆనంద్ కి కొంచెం ధైర్యం వచ్చింది,ఇంకొంచం ఏదో చిలిపిగా మాట్లాడపోయాడు!!

సరే ఆనంద్, టైం అవుతుంది Bye, అని గంభీరంగా నవ్వుతూ ఫోన్ పెట్టేసింది. రూప తో మాట్లాడిన ప్రతిసారీ ఆనంద్ కి కొత్త ఉత్సాహం, కెమెరా పట్టుకొని తన subscribers కొన్ని కొత్త జీవితాలని చూపించడానికి ఆ ఉత్సాహంతో మొదలయ్యాడు!!

—————TO BE CONTINUED——————–

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , ,