Rupa – An Imaginary Spin-Off From Sekhar Kammula’s Anand, 15 Years After Their Marriage – Part 2

Contributed By Bharadwaj Godavarthi

రెండు రోజుల నుంచి ‘ఆనంద్‘ ఎలాంటి వీడియోలు చేయడం లేదు, ఎంత మంది ‘తనకు’ Messages పెడుతున్న ‘Reply’ ఇవ్వడం లేదు, రూపతో ‘వీడియో కాల్ లో’ కూడా ముక్తసరిగా మాట్లాడుతున్నాడు, రూప ఎంత అడిగినా కారణం చెప్పడం లేదు??

ఒక్కమాటలో ఆనంద్, రూమ్ విడిచి బయటకు రావడం లేదు!!వీటన్నిటికీ కారణం ‘ఆనంద్’, ‘రూపకి’, ఒక ‘ఉత్తరం’ రాయాలనుకుంటున్నాడు!!  

ఉత్తరం‘,  ఎందుకంటే తను చెప్పాలనుకుంటున్న విషయం Whatsapp, Emailsలో చెప్పేసేంత చిన్నది కాదు. ‘ఉత్తరం’ రాస్తే ఆ దూరంసమయం తాలూకు Intensity ‘రూపకి’ అర్ధం అవుతుంది అని ‘ఆనంద్’ నమ్మకం.

ఒక్కోసారి కిటికీలు తెల్లగా అవుతూ ఉంటాయి, కానీ ఆనంద్ కి ‘ఉత్తరం’ మీద అక్షరం నిలవడం లేదు. మొత్తానికి ఒక రోజంతా కూర్చుని ఉత్తరం రాసేశాడు. 

అప్పుడు  ఆనంద్Ladhakhలో ఉన్నాడు, అక్కడి లోకల్ వ్యక్తుల సాయంతో,  ‘పోస్ట్ ఆఫీస్‘ ఎక్కడ ఉందో కనుకొని, అక్కడికి వెళ్లి పోస్ట్ చేసేసాడు ఆనంద్, ఒక వారం రోజులలో హైదరాబాద్ రీచ్ అవుతుంది అని చెప్పారు.

ఆ వారం రోజులు ‘ఆనంద్‘ రూపని పూర్తిగా avoid చేసాడు?? ఆనంద్ నీకేమైనా పిచ్చా!! చెత్త వేషాలు వేయకు!! ఎందుకు మాట్లాడట్లేదు నాతో?? అని రూప రోజు అడుగుతున్నా, ఆనంద్ దాటేస్తున్నాడు!! సిగ్నల్ లేదు, డేటా లేదు అని చెప్పి తప్పించుకుంటున్నాడు!! ఆ ఉత్తరం చదివాక రూపతో ఒకేసారి మాట్లాడేయాలని తన ఉద్దేశం.

ఆ వారం రోజులు, అంత చలిలో, ఆ మంచు పర్వతాలు చూస్తూ రూప ఉత్తరం చదివాక  తనతో ఎలా మాట్లాడాలి, అని ప్రాక్టీస్ చేస్తున్నాడు. తన భావం రూపకి, తను అనుకున్నట్లుగానే అర్థమవుతుందా అన్న భయం  ఆనంద్ ని వెంటాడుతోంది!!

రాజు’ అంటాడు!!  ‘ఆనంద్‘ ఎందుకు ఈ కాలంలో ఉత్తరాలు అవసరమా? నీ రైటింగ్ అసలే కోడి కెలికినట్టుగా ఉంటుంది!! నువ్వు అనుకున్నది ఏదో ఫోన్/Video Call   చేసి చెప్పచ్చుగా!!

కానీ రాజుకి అర్థం కాని విషయం ఏంటంటే,   ఆనంద్కి ‘రూపని‘ చూస్తూ ఈ విషయం చెప్పాలనిపించట్లేదు!! ఒక వేల పొరపాటున రూప ఏదైనా తనని టక్కున అంటే తట్టుకోగలడా??

ఉత్తరంహైదరాబాద్ కి రీచ్ అయిన రోజున ‘ఆనంద్‘,  ‘Ladakh’ -> ‘Srinagar’ Hitchhiking చేస్తున్నాడు. ఆ రోజు ఎందుకో  ఆనంద్ కి   ఎంత అడిగినా లిఫ్ట్ దొరకలేదు, తనకి చాలా ఆకలిగా ఉంది, రూపాయి లేకుండా ప్రయాణం చేస్తున్నప్పుడు అనుకున్నాడు ఎవరిని చెయ్యిచాచి యాచించ కూడదు అని!!  కానీ ఆనంద్  కి  మనుషుల మీద నమ్మకం ఎక్కువ, ఇన్నాళ్ల తన ప్రయాణంలో ఒక్కరోజు కూడా తను పస్తులు లేడు!! అందుకే ఆ ఆశతో అలా రోడ్డు మీద చెదరని చిరునవ్వుతో వెయిట్ చేస్తున్నాడు!!

అలా ఎదురు చూస్తున్న ‘ఆనంద్కి దూరం నుండి, ఒక పాత కాలం చేతక్ మీద ఒక ‘40‘ పైబడిన లోకల్ మనిషి అటుగా వెళ్తున్నాడు, వెనుక ఒక బుల్లి ఆంజనేయస్వామివేషంలో ఒక చిన్న కుర్రాడు ఆ ముందు వ్యక్తిని గట్టిగా హత్తుకొని కూర్చున్నాడు. ఆ పెద్దయిన దూరం నుండి ఆనంద్ బ్యాగ్క్యాంపింగ్ గేర్ఆనంద్ నవ్వు, గమనించి ఏదో సాయం కోసం చూస్తున్నట్లు తోచి బండి ఆనంద్ ముందు ఆపాడు. బండి దిగి స్టాండ్ వేసాడు,  కానీ ఆ బుల్లి ఆంజనేయస్వామి మాత్రం అలాగే బండిపైనే కూర్చొని ఉన్నాడు!!

ఆ వ్యక్తి ఆనంద్ దెగ్గరికి వచ్చి, తనను పరిచయం చేసుకొని, ఆ వెనుక కూర్చుంది తన కొడుకని, తాము ఒక జాతరకు వెళ్తున్నామని, ఆ వేషం ఆ జాతర కోసమే అని చెప్పి, ఆనంద్ గురించి అడిగాడు??   ఆనంద్ తన ట్రావెలింగ్ గురించి, అతను డబ్బులు లేకుండా ఎలా దేశం మొత్తం తిరుగుతున్నాడో ఆ పెద్దాయనకి వివరించాడు!! ఆనంద్ కథ విన్నాక ఆ పెద్దాయనకి ఏమైనా సహాయం చేయాలనిపించింది, కానీ తన జేబులో ఆ సమయానికి  డబ్బులు లేవు, ఆనంద్ని తమ తాండాకు రమ్మని ఆహ్వానించారు. అక్కడి నుంచి వాళ్ళ తండా చాలా దగ్గర అని కూడా చెప్పారు. కానీ, ఆనంద్ తాను శ్రీనగర్ వెళ్తున్నాను, మళ్ళీ లేట్ అయితే తనకి ఇబ్బంది అని చెప్పి,  తప్పకుండా ఇంకోసారి ఆ తాండాకు వస్తానని చెప్పాడు!! ఆ వ్యక్తి ఆనంద్కి సాయం చేయలేకపోయాను నిరాశతోనే బండి తీసాడు

 ఆ వెనక కూర్చున్న కుర్రాడు వయస్సు బహుశా ఒక ‘ఆరేళ్ళ ఉండచ్చు‘, ఆ వ్యక్తి బండి తీసి స్టార్ట్ చేస్తున్నంతసేపు ఆనంద్ వైపే అదే పనిగా చూస్తున్నాడు!! బండి స్టార్ట్ అయ్యి కొంత దూరం నెమ్మదిగా వెళ్తున్నపుడు,  బండి ఆపండి అన్నట్టు సైగ చేసాడు వాళ్ళ నాన్నకి??

బండి దిగి పరిగెత్తుకుంటూ రోడ్ దాటి వచ్చి తన సంచిలో ఉన్న రెండు చిన్న Biscuit packets  ఆనంద్ కి ఇచ్చి నవ్వేసి, అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. మరు క్షణం బండి మీద వాళ్లిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఆనంద్ ఎందుకో తెలియకుండా ఉద్వేగానికి లోనయ్యాడు??  ఆ రోజు తను తిన్న ఆ Biscuits తన ట్రావెలింగ్లో ఒక బెస్ట్ మీల్ కింద అనుకున్నాడు!! వాళ్ళిద్దరి రూపం తనకు అంతగా గుర్తులేదు కానీ వాళ్ళ చిన్న సాయం తనకి బాగా గుర్తుండి పోయింది.

మరో ప్రపంచంలోహైదరాబాద్ పద్మారావునగర్లో సమయం మధ్యాహ్నం ఒంటి గంట,  అప్పుడే పోస్టుమేన్  ఉత్తరం రూపకి ఇచ్చాడు!!

From ‘ఆనంద్‘ అని చూడగానే రూప పెదవులపై చిన్న స్మైల్. చాలా ఆతురతగా ఉత్తరం ఓపెన్ చేసింది.

డియర్ రూప,

నువ్వు ఉత్తరం చదివాక,  నన్నుచెత్త వెధవ అని తిట్టు, కానీ నాతో మాట్లాడడం మానేయకు, నన్ను విడిచి పెట్టకు రూప??

రూప ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, నేను ఇంత దూరం దైర్యంగా ఏమి ‘ఆలోచించకుండా’ ప్రయాణిస్తున్నానంటే దాని వెనక నీ సపోర్ట్ ఎంత ఉందొ నేను మర్చిపోలేను.

‘ప్రయాణం’ నాకెందుకో బాగా నచ్చింది రూపతిండి లేకపోయినా, పడుకోవడానికి చోటు లేకపోయినా, హ్యాపీ మూమెంట్స్ కాని చాలా మూమెంట్స్ కూడా నేను ఎంజాయ్ చేస్తున్నాను!! అవేమి నాకు కష్టాలు గా అనిపించట్లేదు!! 

డబ్బులో పుట్టి పెరిగిన నాకు, ఆ డబ్బు లేకుండా ప్రయాణిస్తున్నప్పుడు అర్థమైంది రూప జీవితం విలువేంటో. ఈ ప్రపంచంలో ప్రతి జీవితం ఒక కథే ‘రూప’

ఒక రోజు ప్రయాణిస్తున్న, నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు, చాలా చిన్న కుర్రాడు, బహుశా ’18’ ఏళ్ళు ఉంటాయనుకుంటా!! ఆ రోజు పడుకోవడానికి వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా నన్ను అక్కడే వదిలివేయడం ఇష్టం లేక నన్ను తన వెంట పెట్టుకుని వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు. 

చాలా చిన్న ఇల్లు రూపBedroom , Living Room అని classify చేయలేని ఇల్లు!! వాళ్ళు వండుకున్న దాంట్లో నాకు పెట్టారు, నాకు మంచం ఇచ్చి వాళ్లకు కిందే బాగుంటుంది అని చెప్పి కింద పడుకున్నారు. పొద్దున తిరిగి ప్రయాణం అయ్యేటప్పుడు నాకు బస్సుకి డబ్బులిచ్చారు వాళ్ళ నాన్నగారు. వాళ్ళ పేదరికం నాకు అర్ధం అర్ధమవుతోంది, వాళ్ళ దగ్గర డబ్బులు లేవని కూడా అర్థం అర్ధమవుతోంది, కానీ  నాలాంటి ముక్కు మొహం తెలియని వ్యక్తి పై చూపిన ప్రేమ నన్ను మార్చేసింది రూప. నేను అలాంటి వాళ్ళకి ఏదో తిరిగి ఇవ్వాలి.

నాకు ఒక Endless జర్నీలో పార్ట్ అవ్వాలని ఉంది, ఇలానే తిరుగుతూ ఉండాలి.  ఎన్నాళ్ళు?? ఎక్కడికి?? వీటికి నా దగ్గర సమాధానం లేదు!! ఈ ప్రయాణానికి ఒక గమ్యం లేదు రూప!!   గమ్యం ఆశించని, గమనం ఎరుగని ప్రయాణం. మనం ఒక వ్యక్తిని కానీ, ఒక వృత్తిని కానీ  ప్రేమించినప్పుడు ఉండాల్సిన మొదటి లక్షణం ఇదేఅని నమ్ముతా!!

మరి నన్ను పెళ్ళెందుకు చేసుకున్నావు?? పిల్లలుబాధ్యతలు అన్నీ నా మీద వదిలేస్తావా?? అసలు నేనేంటి, నన్ను వదిలేస్తున్నావా?? ఇలాంటి చాలా ప్రశ్నలు నిన్ను ముంచుతాయని నాకు తెలుసు.

ఒక విషయం మాత్రం చెప్పగలను రూప,  ‘రూప‘ లేనిదే ‘ఆనంద్‘ లేడు. నా వరకు ప్రేమంటే నువ్వే రూప. నీతో గడపాలని, నీ పక్కనే ఉండాలని, నాకు ప్రతి క్షణం ఉంటుంది రూప, అలాగే నీతో ఉన్నప్పుడు నా మనసు ట్రావెలింగ్ మీద కూడా ఉంటుంది!! రెండిటి మధ్య నలగడం, నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇలానే ట్రావెలింగ్ చేస్తూ ఉంటా, నిన్ను, పిల్లల్ని చూడాలనప్పుడు వచ్చేస్తా.

ఒక టిపికల్ ఫాదర్ పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ నేను చేయట్లేదని నాకు తెలుసు, కానీ Believe me వాళ్ళకి ఒక వయసు వచ్చాక వాళ్ళకి రియల్ ఎడ్యుకేషన్ మాత్రం నేను నేర్పించగలను. I might not be a father, husband that society looks for, But believe me my love and responsibility towards you and kids will never fade away. 

నేను చేయాలనుకుంటున్న ఈ ప్రయాణానికి నీ సపోర్ట్ కావాలి, నా ప్రయాణం డబ్బులు ఇంటికి తీసుకు రాకపోవచ్చు, కానీ నేను నమ్మిన మంచికి,  నన్ను ఒక మెట్టు చేరువ చేస్తుంది. రూప నన్ను నువ్వు తప్పకుండా అర్థం చేసుకుంటావని భావిస్తూ,

నీ

ఆనంద్.

ఉత్తరం మొత్తం చదివేసాక రూప మోహంలో రియాక్షన్ మారిపోయింది, ఎప్పుడూ లేనంత కోపంగా ఉంది. వెంటనే  ఆనంద్కి  ఫోన్ చేసింది, అప్పుడే లిఫ్ట్ దొరికిన ఆనంద్ ఒక బస్సులో ఉన్నాడు. నుంచోడానికి కూడా చోటు లేని పరిస్థితి. రూప నుండి ఫోన్ అని చూడగానే, ఆనంద్ లో చిన్న టెన్షన్ మొదలైంది!!  

ఫోన్ ఎత్తిన వెంటనే,  రూప నేను కొంచెం బిజీగా ఉన్నా మళ్ళీ చేయనా?? రూప నుండి సమాధానం లేదు, రూప అన్నాడు ఆనంద్ మళ్ళీ!!

ఓయ్ హీరో, ఒక నిమిషం విను, నేను కూడా నీ లాగా పెద్దగా ఉత్తరం రాయాలనుకున్నా, కానీ నువ్వు ఎక్కడ ఉంటావో నీకే తెలీదు, ఇంక ఎక్కడికి రాయను??

ఓయ్ హీరో ఒకటి గుర్తుపెట్టుకో, ఇంత రాస్తే కానీ నాకు అర్థం కాదు అని అంత చెత్తగా నువ్వు ఎలా అనుకున్నావు?? నేను ‘నీ‘ దానిని ఆనంద్, ప్రేమించడం అంటే, పూర్తిగా తెలుసుకోగలగం ఆనంద్. ఇంత రాయాల్సిన అవసరం లేదు, నాకు నువ్వెప్పుడూ సమాధానం చెప్పే పరిస్థితి రాకూడదు.  అయినా నన్ను నేను కోల్పోయే క్షణం వస్తే నీకన్నా ముందే నేనే నీకు చెప్పేస్తా, దాంట్లో ఏమి మొహమాటం లేదు.  సరేనా,  ఇంకా వర్రీ అవ్వకుండా హ్యాపీగా ట్రావెల్ చెయ్. హీరో ఉంటా మరి అని ఫోన్ కట్ చేసేసింది రూప!! ఆనంద్ కి  మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వలేదు,   ఫోన్ పెట్టేస్తూ తనలో తాను నవ్వుకున్నాడు, అప్పుడే ఆనంద్ కి బస్సులో సీటు దొరికింది, తన ప్రయాణం కొనసాగుతోంది. 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , ,