This Short Story Defines The Happiness In Little Things

Contributed By Phaneendra Varma

స్థలం:- ఒక కుగ్రామం

ఒక గండుచీమ, గోడ పక్కన పాకుతూ పాకుతూ పడుకున్న మూడేళ్ల పిల్లాడిని కొడుతుంది ఆ పిల్లాడు బేర్ మంటూ ఏడవడం మొదలు పెడతాడు ఆ ఏడుపు వినగానే ఆ పిల్లాడి అమ్మ(శ్యామల) గుండె గూభేలుమంటుంది పనులన్నీ వదిలేసి పిల్లాడి దగ్గరికి పరిగెత్తడం మొదలు పెడుతుంది వంట గదిలోంచి.

శ్యామల:- అయ్యో… అయ్యో… నిద్ర లేచినావా నాన్న!!

లేదు.. లేదు… ఏం లేదు… ఏం లేదు… ఏమైంది అమ్మా??

పిల్లడు ఏడవడం ఇంకా ఆపడు..

శ్యామల పిల్లల్ని ఎత్తుకొని పడక గదిలో నుంచి హాల్ లోకి వెళుతుంది.

హాల్లో నుంచి ఇంటి గుమ్మం దాటి వాకిట్లోకి వచ్చింది.

ఆ ఇంటికి అల్లంత దూరంలో ఉన్న దండకారణ్యాని దానిని మోస్తున్న కొండలకు ఎదురుగా నుంచుని చూస్తూ ఉంటుంది..

ఆ కొండపైన, ఆ సూర్య కాంతి వెలుగులో 2 పశువులు కాస్తున్న ఒక కాపరి, ఆ కొండపై ఉన్న పెద్ద రాయి మీద అ నుంచి ని తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ కాలాన్ని అడుగుతాడు ఇంత అందం ఇంకా ఎంతకాలం నీలోనే దాచుకుంటావు అని..

పిల్లాడి వేలు పట్టుకుని శ్యామల ఆ మనిషి వైపు చూపిస్తూ..

కన్నా!! చూడు చూడు నాన్న ఆ కొండపైన ఉన్నాడు చూడు… చూడు… అడుగో అడుగో..

పిలువు…నాన్న అని పిలువు…

పిల్లాడు ఏడుపు ఆపేసి, అయోమయంలో పడిపోతాడు…

టాటా చెప్పు నాన్నకు టాటా చెప్పు… అంటూ శ్యామల పిల్లాడి చేతిని పట్టుకుని ఆ మనిషి వైపు చెయ్యి ఊపుతూ ఉంటుంది… శ్యామలకు తెలుసు అతను వాళ్లను చూడలెడని..

టాటా చెప్పడం అయిపోయాక శ్యామల తిరిగి ఇంటిలోకి వెళుతుండగా వరండా ముందర పాక సూరి లో పిచ్చుకల గుళ్ళు ఉంటాయి.. ఒక గుళ్లో ఒక ఆడ పిచ్చుక గుడి బయట నిలిచి ఉంటుంది లోపల నుంచి పిల్లలు ఆకలితో చేస్తున్న ఆర్తనాదాలు శ్యామలకు, పిల్లాడికి వినిపిస్తాయి.. శ్యామల ఇంట్లోకి వెళ్లి బియ్యం గింజలు తెచ్చి సూరి దగ్గర వేస్తుంది.

శ్యామల ఆతృతగా ఆ పిచ్చుక గుళ్ళు పిల్లాడికి చూపిస్తూ ఉంటుంది.. పిచ్చుకలను చూసి పిల్లాడు నవ్వటం మొదలు పెడతాడు. కాసేపటి తర్వాత పిచ్చుక పిల్లలు మళ్లీ ఏడవడం మొదలుపెడతాయి అవి విన్న పిల్లాడు మళ్లీ ఏడవడం మొదలు పెడతాడు.. ఆ శబ్దం కొంత కొంత కొంతగా పెరుగుతూనే ఉంటుంది.

ఆ పిల్లవాడు చేసే శబ్దాన్నికి నానార్ధంగా, ఇంకోచోటులో

స్థలం:- పెద్ద నగరం.

గట్టిగా… గడియారం చేసే అలారపు శబ్దం, ప్రసాదు మెలకువ వచ్చి అలారం కట్టేసాడు, మళ్లీ నిద్ర పోయినట్టు నటిస్తూ తన కొడుకు ప్రవీణ్ మీద చెయ్యి వేసి, ప్రవీణ్ నిద్రలోంచి బయటకు నెట్టడానికి మెల్లగా చెక్కిళ్ళు పెడుతూ ఉంటాడు, అలా వాళ్లు ఇద్దరి మధ్య నవ్వులు పరవళ్లు తొక్కుతూ వంటగదిలో ఉన్న ప్రియా చెవులలో పడతాయి..

ప్రియా:-

మీ ఇద్దరికీ ఆదివారం వస్తే చాలు ఏ పని అక్కర్లేదు నిద్ర ఉంటే సరిపోతుంది..

ప్రసాద్ తో మీరు లేవండి తొందరగా,,, మర్చిపోయారా ? ఈరోజు మమ్మల్ని మాల్ కి తీసుకెళ్తాను అన్నారు..

ప్రసాద్:-

హా||

అయినా మనం వెళ్ళాల్సింది సాయంత్రానికి కదా..

ఇంకా బోలెడంత టైం ఉంది.

ప్రియా:-

నవ్వుతూ…

ఇప్పుడు భోజనం టైం అయింది.

మనం రెడీ అయ్యే పాటికి సాయంత్రం అయిపోతుంది..

నేను చికెన్ చేస్తున్నాను.. ముందర మీరు వెళ్లి ముఖం కడుక్కుని రండి..

ప్రసాద్ బాత్రూంలోకి వెళ్లి, లక్కీ ఇంట్లో నీళ్లు పట్టడానికి ట్యాప్ చెబుతాడు.

గలగలా పారే నీళ్ళ శబ్దం మొదలవుతుందది…

స్థలం:- శ్యామల నివాసం (అదే కుగ్రామం)

నూతిలో నుంచి నీళ్లు తోడుతు వాటిని ఒక బకెట్ లోకి పోస్తున్న శబ్దం చేస్తూ శ్యామల. బకెట్ నిండిన తర్వాత, పిల్లాడిని స్నానానికి పిలవడానికి వెళ్తుంది.

పిల్లాడు వాళ్ళ స్నేహితులతో తన కళ్ళ ముందే ఆడుకుంటూ ఉంటాడు శ్యామల వాడిని పిలుస్తుంది. శ్యామల పిలుపు వినగానే పిల్లోడు వుట్టి కాళ్ళతో పరిగెత్తుతూ వచ్చి శ్యామల ముందు వాలి పోతాడు.

వచ్చిన పిల్లాడికి స్నానం చేయించి అన్నం పెట్టడానికి పిల్లల్ని కంచం తెచ్చుకోమంటుంది.

పిల్లాడు:-

అమ్మ ఈరోజు గుడ్డు కూరెనా?

శ్యామల:-

హా||

పిల్లాడికి రెండు గుడ్లు వేసి తను మాత్రం గుజ్జు వెసుకుని తినేసి, శ్యామల పిల్లాడికి బొమ్మలు ఇచ్చి ఇంట్లోకి వెళ్లి ఆడుకో మని చెప్పి తను అంట్లు తోముకుంటుంది, కాసేపటి తర్వాత ఇద్దరూ నిద్ర పోతారు అప్పుడు ఆ పరిసరాల్ని నిశ్శబ్దం కమ్మేస్తుంది.

స్థలం:- చెప్పడం కష్టం (అదే నగరం)

ట్రాఫిక్లో ఇరుక్కుపోయింది ప్రసాద్ కుటుంబం ఆ కుటుంబాన్ని కమ్మేసింది కారల హొరన్ శబ్దం.

ప్రియా:- మనం ఇంకా కొంచెం తొందరగా బయలుదేర వలసింది అండి..

ప్రసాద్:-

తొందరగా అంటే… మిట్ట మధ్యాహ్నం బయలుదేరుతావా? ఏంటి..

ఏం పర్లేదు ఒక 15, 20 నిమిషాల్లో మనం మాల్ రీచ్ అయిపోతాం ఆ తర్వాత హాయిగా షాపింగ్ చేసుకోవచ్చు.

ప్రవీణ్:-

డాడీ!

నాకు షాపింగ్ పాటు గేమ్స్ కూడా..

ప్రసాద్:-

ఓకే. గేమ్స్ షాపింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే.

ప్రవీణ్ ఏమీ మాట్లాడడు! నువ్వు గేమ్స్ కావాలి అంటే గేమ్స్ ఆడుకోవచ్చు నేను అమ్మ మూవీకి వెళ్తాము.

గేమ్స్ కావాలా? మూవీ కావాలా?

ప్రవీణ్:-

గేమ్స్ గేమ్స్….

ప్రసాద్:-

అయితే మేము మూవీ నుంచి తిరిగి వచ్చేంతవరకు నువ్వు గేమ్స్ జోన్ నుంచి బయటకి రాకూడదు ఓకేనా?

ప్రవీణ్:-

హా.

ప్రియా:-

ఇప్పుడు పిల్లాడిని వదిలి సినిమాకి వెళ్లడం అంత అవసరమా?

అసలుకే రోజులు బాలేదు.

ప్రసాద్:

ఏం పర్వాలేదు అక్కడ ఉన్నద గేమ్ ఆపరేటర్స్ కి చూడమని చెప్పి వెళదాం. నువ్వు ఏమి టెన్షన్ పడకు.

అయినా నువ్వు అనుకుంటున్నట్టు వాడు ఏమీ చిన్న పిల్లవాడు కాదు ఇంకా.. అవునా ప్రవీణ్?

ప్రవీణ్:-

అవును డాడీ. నాకు టెన్ ఇయర్స్ వచ్చేసాయి…అని చెప్పి ప్రసాద్ మెడ వెనుకనుంచి కౌగిలించుకుంటాడు.

ఇంతలో మాల్ చేరిపోతారు..

స్థలం:- చెప్పుకోండి చూద్దాం.

పిల్లాడి తండ్రి ఇంటికి వస్తాడు వస్తూనే చేతిలో ఉన్న జామకాయలు, నారింజకాయలు, సీతాఫలాలు ఇంటి గుమ్మం దగ్గర పెట్టి ఆవులను కట్టడానికి వెళ్లి కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వస్తాడు రావడం తోటి పిళ్ళాన్ని ఎత్తుకుని ముద్దాడుతాడు పిల్లాడు వాళ్ల నాన్నను చూసి సంబరపడిపోతూ ఉంటాడు. తదుపరి తండ్రి చేసే ప్రతి పనిని పిల్లాడు తీక్షణంగా చూస్తూ తనకు తెలియకుండానే సూర్యుడికి టాటా చెప్పేస్తాడు ఆ తర్వాత ఆ ఇంటిల్లిపాది ఆకలికి తలొగ్గి కడుపు నింపుకోవడం కోసం కష్టపడి సంపాదించుకున్న దానితో సరిపెట్టుకుంటారు. తింటూ ఉన్నప్పుడు శ్యామల ఇంట్లో సరుకులు ప్రస్తావన ఇంటి వాడికి వినిపిస్తుంది. ముగిసిన వెంటనే ఆ ఇంటి ముంగిట నక్షత్రాలు వచ్చి వేచి చూస్తున్నాయి. ఆ నక్షత్రాలతో పడుకొని పిల్లాడు, పిల్లాడి తండ్రి అర్థం కాని భాషలో ఊసలు అల్లారు కాసేపటికి శ్యామల కూడా వచ్చి వారికి సాయం చేసింది.

అలా ఆరోజు శ్యామల కళ్ళలోంచి కనుమరుగైంది…

స్థలం:- చెప్పనవసరం లేదు అనుకోండి.

సినిమా హాల్ తలుపులు తెరుచుకుంటాయి ప్రసాద్, ప్రియా బయటికి వచ్చి ప్రవీణ్ ను కలుస్తారు. అందరూ కలిసి సరదాగా దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి వెళ్లి సాయంత్రం భోజనం చేస్తారు. ఆ తర్వాత తిరిగి వాళ్ల ఇంటి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత నిద్రపోయే ముందు ప్రవీణ్ తను ఆడిన ఆటల గురించి చెబుతూ ఉంటాడు వాటిని వింటూ ప్రసాద్, ప్రియా తమ తమ ఆలోచనల్లో మునిగిపోతారు.. ప్రియా వాళ్లతో తనకు సినిమా బాగా నచ్చింది అని చెబుతుంది మళ్లీ ఎప్పుడు వెళదాం అని ప్రసాద్ ను అడుగుతుంది. వచ్చే వారం వెళ్దామని ప్రసాద్ సమాధానం చెబుతాడు. ఇంకా నిద్రలోకి జారుకుంటారు.

ప్రియకు,

ఆదివారం వెళ్ళిపోయింది.

జ్ఞాపకాలు మిగిల్చింది.

శ్యామలకు,

రోజు వెళ్ళిపోయింది.

జ్ఞాపకాలు మిగిల్చింది.

ఇద్దరి జీవితాల్లోని తేడా ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది అని ఆశిస్తూ.…

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments