Remembering Telugu Version of Geetanjali, Our favorite lesson In 10th Class

 

Contributed By Hari Atthaluri

 

రవీంద్ర నాథ్ ఠాగూర్..
ఈ పేరు వినని వారు ఉండరు..
తెలియని వారు ఉండరు..
విశ్వ కవి గా సుపరిచితుడు…
ఆయన రచించిన అన్నిటి లోకి సుప్రసిద్ధమైన పేరు..
చిర స్థాయి గా నిలిచిన పేరు..

 

“గీతాంజలి”

ప్రపంచ సాహిత్యంలోనే ఇది ఒక గొప్ప రచన.
ఇదే ఆయనికి నోబెల్ బహుమతి ని తెచ్చి పెట్టింది…

వాస్తవానికి దీనిని భక్తి గీతం గా ఆయన బెంగాలీ భాష లో రాశారు, తరువాత ఆయనే స్వయం గా ఇంగ్లీష్ లో తర్జుమా చేశారు..

 

దాని అనువాదాన్ని తెలుగు లో ఇలా ఒక పాఠం గా మన పద్య భాగం లో చేర్చారు…

“ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో..
ఎక్కడ మనుషులు తలెత్తుకుని తిరుగుతారో…
ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా ఉంటుందో..
సంకుచిత భావాలతో ముక్కలుగా చీలిపోదో
ఎక్కడ సత్య వాక్కులు వెలువడుతాయో..
ఎక్కడ నిర్విరామ కృషి పరిపూర్ణత కోసం చేతులు చాపుతుందో..
ఎక్కడ స్వచ్ఛమైన వివేక ధార ఇంకిపోకుండా వుంటుందో
ఎక్కడ నిరంతర ఆలోచన, ఆచరణ వైపు నీవు బుద్ధి ని నడిపిస్తావో…
ఆ స్వేచ్ఛా స్వర్గానికి
నా దేశాన్ని మేల్కొలుపు !!

మనిషి లోని నిరాశా నిస్పృహలను,
సకల సృష్టిని సమ భావం తో ప్రేమ గా చూచి..
“శ్రమ” గొప్పతనాన్ని చెప్పే మహత్తర సందేశం
ఈ గీతాంజలి కావ్యం..

 

తను ఉన్న సమాజం లో.. తన చుట్టూ ఉండే వాటిని, జరిగే వాటిని పూర్తిగా మార్చాలి అనుకునే భావం లో నుంచి ఈ గీతాంజలి పుట్టింది…

ఈ గీతంలో తను కోరుకున్న కలల ప్రపంచం ఎటువంటిదో విశ్వ కవి వివరించారు..
అలాంటి ప్రపంచం కావాలి అని పరితపించారు…
అందులో అసలు మనుషులు.. వాళ్ళ భావాలు.. వాళ్ల చుట్టూ ఉండే సమాజం ఎలా ఉండాలో తన మాటల్లో చెప్పారు

అలాంటి ప్రపంచం అంటూ ఒకటి ఉంటే..
అందులో కి తన దేశాన్ని తీసుకుపో అని దేవుడిని ప్రార్థించారు..

చాలా మంది తమ చుట్టూ ఉన్న ప్రపంచం తో విసిగిపోయి, ఒక ఊహా ప్రపంచం కోసం కలలు కంటారు. కవులు, రచయతలు ఇంకా ఎక్కువ తీవ్రంగా దీన్ని కోరుకుంటారు…

 

“అసలు ఎటువంటి భయం లేకుండా…
మనసులో ఉన్నది ఉన్నట్టు ధైర్యం గా చెప్తూ..
ప్రతీ చోట తల ఎత్తుకుని ఉంటూ..
స్వేచ్ఛగా మనకి నచ్చింది చేస్తూ..
వివక్ష లేకుండా..ఉన్న అభిప్రాయాన్ని చెప్తూ..
మన కష్టం కి..మన తెలివికి తగిన గుర్తింపు పొందుతూ..సమ అవకాశాలు దొరుకుతూ..నిజం మాత్రమే చెప్తూ..అర్ధం పర్ధం లేని ఆలోచనల తో విడిపోకుండా ..
కలిసి కట్టుగా మనిషి ప్రగతి కోసమే పుట్టిన ఆలోచనలు ఆచరణ వైపు గా వెళ్తాయో”

 

ఆ ప్రపంచం నాకు కావాలి..

ఆ ప్రపంచం లోకి నా దేశాన్ని తీసుకు వెళ్ళాలి..

ఎంత గొప్ప భావం..

 

ఇప్పటికీ చాలా మంది కోరుకునే ప్రపంచం ఇదే..

అందుకే భాష తో సంబంధం లేకుండా అందరి హృదయాలని తాకింది.. ఆలోచనలు రేపింది..

ఎంతో సులభ పదాలతో..
ఎంతో భావుకత తో రాసిన ఈ గీతాంజలిని
ఆయన జయంతి సందర్భమగా మననం చేసుకోవటం మనం ఆయనకి ఇచ్చే పెద్ద గౌరవం…

 

Rabindrnath gari swahasthaalatho raasina geethanjali english version idi:
Source: Andhrabharathi


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , ,