This Perspective of దోపిడీ From Raja Raja Chora Movie Hits You In A Different Way

Recent ga ochina movies lo characters, story, completeness wise one of the best movies ayina Raja Raja Chora recent ga OTT lo release ayindi. The characters are so beautiful, movie lo unna prathi character ki meaning undhi, unna prathi character lo manam unnam. spoilers unnai kaani spoilers levu,endukanna manchidi movie chusesi ochi chadiveseyandi. 

Mana loni characters tiskoni vatiki mana kathalu alli, manaki manam cheppukune dhairyam leni nijalani manaki cheppinattu anipinchindi. Udyogam kosam enno patlu paduthunnna Sanjana, badyatha marichi atyasha lo irukkupoyina Tirumala Rao, Adhikaram tho em chesina chelluthundi anukune William, Udyogala akkara tirusthu intini marchina Madhav, adhi aasara ga tiskuni mosam chesthunna Buelah. Inka Vishnu? Mana antharathma ki inko roopam ayina Bhaskar aka Chorudu. Aa chorudu nundi maharshi la marina katha ye ga idhi. Idhi mana katha , manaki mana gurinchi evaru cheppani katha. Prathi dopidi lo iddaru untaru, mosapoyina vadu, mosam chesina vaadu ? kaani aa iddaru okare ayithe ? vaadi pere manishi kaadha? 

Final ga dopidi ni inko rakanga varninchina Ghanapathi garu. Cinema mugimpu lo ghanapathi gaaru cheppina maatalu andariki gattiga tagile untayi.

“ఏం సాధించావ్ అయ్యా?

దారి దోపిడీ సొమ్ముతో కుటుంబాన్ని పోషించావ్, తప్పు అని తెలిసి  పశ్చాత్తాప్ప పడ్డావ్, ఇంకెప్పుడు చేయకూడదు  అనుకున్నావ్ , మరి చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ? ” అని అడిగాడు వాల్మీకి మహర్షి

మాట పెగలలేదు బోయవాడికి….

వెంటనే ప్రాయశ్చిత్తంగా  కఠోరమైన తపస్సు మీద మనసు లగ్నం చేసాడు, ఆ క్రమం లో వాల్మీకి, మహర్షి అయ్యాడు 

దోపిడీ అంటే కేవలం దొంగతనాలేనా ?

నిన్ను ఒకళ్ళు  మోసం చేయడం వాళ్ళ తప్పే ! కానీ నిన్ను నువ్వు చేస్కునే మోసం ?

నువ్వు చేయగలిగే పని మానేసి డబ్బుకోసం ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రాకులాడడం దోపిడీ కాదా?

డబ్బు మీద వ్యామోహం తో నీ బాధ్యతలను విస్మయించడం దోపిడీ కాదా?

అక్రమ సంబంధాలు, నమ్మక ద్రోహాలు వీటికన్నా నీచమైన దోపిడులు ఉన్నాయా ?

సంసారాన్ని సవ్యంగా చూస్కోకుండా గుడుల  చుట్టూ గోపురాల చుట్టూ తిరగడం, ఉద్యోగం పేరుతో ఊర్లు తిరగడం ఎవర్ని ఉద్దరించినట్టు, ఇది ఒక విధమైన దోపిడీ నే…

ఇవన్నీ చట్ట ప్రకారం దోపిడీ కాకపోవచ్చు అందుకే తప్పు అని గమనించడమే కష్టం, ఇంకా శిక్ష సంగతి దేవుడే ఎరుగు

కానీ చేసిన తప్పుకి తమంతట తాము శిక్ష కోరుకునే వాళ్ళు మార్పుకి నాంది పలికినట్టే, మరో వాల్మీకి అయినట్టే“

End of Scene

మనకి నచ్చని పని  ఎంత మంది చేస్తున్నారు ? వారం ఎప్పుడు అవుతుంది అని వారమంతా ఎదురు చూడడం తోనే గడిపేస్తున్నావా ? అది నిన్ను నువ్వు చేస్కునే దోపిడీ కాదా ?

నీ వీధి చివర పోలీసోడె కదా నిన్ను కాపాడాల్సింది ? మరి వాడికి ఎందుకు భయపడుతున్నావ్ ? వాడి బాధ్యత మరిచి అధికారం తలకి ఎక్కడం దోపిడీ కాదా ?

సమాజపు కళలు కనడానికి మనల్ని మనం చంపుకోట్లేదా ? ఐదంకెల జీతం నీ చేతులకి సంకెళ్లు వేస్తుంటే తెంచకుండా ఉంచుకోడం దోపిడీ కాదా ?

డబ్బు మీద వ్యామోహం తో బాధ్యత మరిచిన ఎందరో ఉద్యోగులు, పరువు కోసం పిల్లల ఆనందానికి అడ్డు చెప్పే తల్లి తండ్రులు. వారిని పట్టించుకోకుండా విహార లోకాలు తిరగాలనుకునే పిల్లలు, మీ మనుసుకి నచ్చే చేస్తున్నారా ఇవన్నీ !

మనల్ని మనం చేస్కునే మోసాలు కాదా ఇవన్నీ ?

నిను నువ్వు మరిచి ఏదో లోకంలో బ్రతకాలనుకోడం కూడా దోపిడీ నే !

నీలా నువ్వు ఉండి ఎన్ని రోజులైంది ?  సమాధానాలు అందరికి కావాలి కానీ దానికి ముందు సరైన ప్రశ్నలు వెతకండి ! సరైన ప్రశ్న తర్వాత నిజాయితీగా నీ మనసుకి ఇష్టమైన సమాధానం ఇవ్వడం నీ బాధ్యత, ఇవ్వకపోతే అది కూడా దోపిడీనే.

Adandi sangathi ending it with my favourite dialogue in the film 

“చిన్నదైనా పెద్దది అయినా చెప్పడానికి నిజం ఒకటే ఉంటుంది ! దాన్ని ఎన్ని కాపీలు తీసిన అసలు అసలే, నకలు నకలే !

నకలు చూపించుకోడానికి ఉపోయోగ పడుతుంది కానీ చెల్లదు అయ్యా ! ”

నీకు నువ్వు నిజం చెప్పుకోడం అవసరం కాదు, బాధ్యత !

Ikaselavu

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , ,