Raithu Bandhu: A Never Before Revolutionary Move That Helps Farmers With Their Lands!

 

“తెలంగాణ వస్తదని ఎవరూ కలలో అనుకోలే. కేసీఆర్ బక్కపాన పాణమోడు. ఎవడో వీని మెడలు ఇరుస్తడని చానామంది అనుకున్నరు. చానామంది శాపాలు పెట్టిండ్రు. కొందరు దీవెనలు ఇచ్చిండ్రు. కానీ ఏమైంది. 14 సంవత్సరాల పోరాటంలో తెలంగాణను సాధించుకున్నం” – కేసీఆర్ గారు.


అసాధ్యం అన్నది సాధ్యం అయ్యింది.. తెలంగాణ సచ్చినా రాదు అన్నోళ్ళే తెలంగాణ పోరాటంలో ఓడిపోయారు. తెలంగాణ వస్తే చీకట్లో తెలంగాణ రాష్ట్రం ఉంటుంది అని భయపెట్టి నోళ్లకే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ చూపిస్తున్నారు. 70 సంవత్సరాలలలో తెలంగాణకు ఏ నాయకుడు చేయనిది కేసీఆర్ గారు త్వరలో కోటి ఎకరాలకు నీటిని అందించనున్నారు. నాయకుడు మడమ తిప్పని మొండివాడయితే ఏదీ అసాధ్యం కాదు.


“యావత్తు దేశం అబ్బురపడేలా అన్నదాతకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నం. రాబోయే ఐదేళ్లలో దేశంలో ధనిక రైతు ఎక్కడన్నా ఉన్నాడంటే అది ఖచ్చితంగా తెలంగాణలోనే అనేలా అదర్శనీయ పంథాను అందిస్తున్నం” – కేసీఆర్ గారు.


ప్రతి ఎకరాకు 8,000:

సంవత్సరానికి రెండు పంటల చొప్పున ఎకరానికి 8,000 రూపాయలా.. ఈ ఆర్టికల్ రాస్తున్న నాకే ఆనందంతో చేతులు వణుకుతున్నాయి, అలాంటిది ఇక ఆ రైతు కళ్ళల్లోని ఆనందాన్ని వర్ణించడం సాధ్యమంటారా.? భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలోనే ప్రతి రైతుకు ఇలా ప్రభుత్వం సహాయం చేసి ఉంటుందా..? రైతు బాగుంటేనే సమస్త ప్రాణకోటి బాగుంటుంది. ఇది రైతుల జీవితాన్ని మాత్రమే కాదు సమస్త మానవాళి మనగడను మార్చివేసే పథకం.


“ఈ దేశంలో అన్ని వర్గాలకు యావత్తు ప్రజానీకానికి 24 గంటలపాటు విద్యుత్తును సరఫరా చేస్తున్న రాష్ట్రం ఏదంటే అది ఖచ్చితంగా తెలంగాణనే. కరెంట్ సరిగ్గా ఇస్తున్నం. మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయే పరిస్థితి నేడు లేనే లేదు. నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో నేను ఈటల రాజేందర్ కరెంట్ కష్టాలు చూసి కంటతడి పెట్టినం. ఇదే హుజూరాబాద్ లో బిక్షపతి అనే వ్యక్తి కరెంట్ బిల్లు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటే కళ్ళ నీళ్ళు తీసుకుని ఆవేదన చెందినం రాష్ట్రం వచ్చినాక కరెంట్ విషయంలో అనూహ్య మార్పులు చూపిస్తున్నం. 2014 కు ముందు కరెంట్ వస్తే వార్త. ఈరోజు కరెంట్ పొతే వార్త”. -కేసీఆర్ గారు.


సంవత్సరానికి 12,000 కోట్లు:

10, 20 ఏకరాలున్న రైతులకు పెట్టుబడి కోసం అంతగా కష్టపడాల్సిన పని లేదు. కాని ఒకటి నుండి 5 ఏకరాలున్న రైతులకు మాత్రం ఇది ప్రాణ సంకటం. భూమిని తాకట్టు పెట్టాలి.. బంగారాన్ని తాకట్టు పెట్టాలి.. ఇవన్నీ ఐయ్యాక తల తాకట్టు పెట్టాలి. ఇంత చేసినా పంట పండకపోతే ఈ భూమి నుండి పారిపోవాలి. రైతుకు ఎదురయ్యే మొదటి సమస్య “పెట్టుబడి”. ఈ సమస్యను ప్రభుత్వమే తీర్చుతుండడంతో రైతుబంధు పథకం ప్రారంభమైన రోజు హిందువులకు దీపావళి లాంటిది.. క్రైస్తవ సోదరులకు క్రిస్ మస్ లాంటిది, ఇక ముస్లిం సోదరులకు రంజాన్ లాంటిది. రాష్ట్ర బడ్జెట్ లో 12,000 వేల కోట్లు బాజాప్తగా కేటాయించడం, త్వరిత గతిన బ్యాంకులకు 6,000 వేల కోట్లు అందించింది. పథకం ప్రారంభమైన మొదటి రోజే 1629 గ్రామాల్లో 3.79చెక్కులు పంపిణీ చెయ్యగా ఆనందంతో 51,236 రైతు సోదరులు తమ పెట్టుబడిని దర్జాగా తీసుకున్నారు.


“రైతుకు ముఖ్యంగా మూడు కావాలె. ఒకటి భూమి ఉండాలె. రెండోది కరెంట్ ద్వారానో, కాల్వల ద్వారానో నీళ్లుండాలె. మూడోది పెట్టుబడి కావాలి. ఈ మూడింటి విషయంలో రంది లేదు. తెలంగాణ సర్కారు తీరుస్తుంది. దానికోసం యుద్ధం చెయ్యాలి”. -కేసీఆర్ గారు.


అవును కల్తీ లేని అసలైన విత్తనాలు కొనుగోలు దగ్గరినుండి కలుపుతీత, అకాల వర్షాలు దాటుకుని మొదలైన అన్ని ఆటంకాలు దాటి వచ్చిన బంగారం లాంటి పంటను అమ్మాలన్నా సరైన గిట్టుబాటు ధర రాకపోతే ఆ బాధ వర్ణనాతీతం చాలా మంది రైతులు కనీస ధర రాకపోవడంతో ఉక్రోషంతో పంటను రోడ్డు మీదే పడేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఆ నాలుగోవది గిట్టుబాటు ధర. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చెయ్యాలి. దీనికోసమే తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. ఈ విన్నపాన్నీ మరియు ఎకరానికి 8,000 పెట్టుబడిని కేంద్రం ప్రతి రాష్ట్రంలో అమలుజరిపితే కనుక మన రైతు ఖచ్చితంగా రాజు అవుతాడు.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , ,