This Analysis Of A Scene & BGM In ‘Prasthanam’ Explains Why It’s Underrated

 

Contributed by Chaitanya Kondapi
“తాతయ్య దేవుడు ఎక్కడున్నాడు?” అని చాలా పెద్ద ప్రశ్న చిన్నప్పుడే వచ్చింది ఆ పిల్లవాడికి(మిత్ర – శర్వానంద్).ఆ తర్వాత రోజే తన తండ్రిని చంపేశారు. తన తండ్రి దగ్గర పని చేసే వ్యక్తి(లోకనాధం- సాయికుమార్ )తన తండ్రిని చంపిన అందరినీ చంపేస్తుంటే దూరం నుండి చూశాడు. వాళ్ళ కుటుంబాలని చంపకుండా ఒదిలేయండి అని చెప్తున్నప్పుడు మాత్రం దగ్గర నుండి చూశాడు ఆ పిల్లాడు ( దేవ కట్ట brilliant shot composition). బహుశా ఎందుకో ఆ వ్యక్తిలో చెడు కన్న మంచే కనిపించినట్టుంది. వెళ్లి అతన్ని వాటేసుకుంటాడు. అతని వేలు పట్టుకుని నడుస్తాడు. అపుడు మొదలవుతుంది ఈ పాట.



 

నిప్పు నివురై పోయే, అనలం బ్రహ్మమ్మాయే.
నెత్తురు మతి పోయే, మనసు మబ్బులు దాటే
కండలూవుటి పోయే ఖర్మం ఆవృతంఆయే
చలన నిశ్చలమాయే
జీవం ఈశ్వరం ఆయే.

 

చనిపోయాక అంతా అయిపోతుంది.చావు కన్నా చావు దాకా మనిషి చేసే ప్రయాణమే గొప్పది చావు కంటే అని చెప్తూ అన్నీ మనలోనే ఉన్నాయి(జ్ఞానం, అజ్ఞానం, మంచి, చెడు etc) అని అర్ధం వచ్చేలా ఉంటుంది పాట. అయితే ఈ పాట కి సినిమాకి ఏం సంబంధం ఉంది అనుకోవచ్చు.మొదటిసారి చూసినపుడు నేను అలానే అనుకున్నాను.మళ్లీ చూశాక దేవ కట్టా ఇంకా నచ్చాడు.
దానికి సమాధానం క్లైమాక్స్ లో దొరుకుతుంది. అదేంటో చూద్దాం(spoilers ahead)


 

మిత్ర (శర్వానంద్)కి తన తండ్రిని చంపింది లోకనాధమే(సాయికుమార్) అని తెలుస్తుంది. అప్పటిదాకా ఎవరైతే తన లైఫ్ లో హీరో అనుకున్నాడో అతనే విలన్ అయిపోయాడు. పాత్రలు తారుమారయ్యాయి.
చివరికి తన గమ్యం తను తండ్రిలా భావించే వ్యక్తి మరణం అయింది.
నన్ను చంపెయ్ అంటాడు లోకనాధం. నీ చావు(నా గమ్యం) కన్నా ఇన్ని రోజులు నీతో చేసిన ప్రయాణమే నాకు ఇష్టం, నేను చంపలేనని వెళ్ళిపోతాడు. పశ్చాత్తాపం తోనో, తీరని శోకం తోనో లోకనాధం తనని తానే కాల్చుకొని చనిపోతాడు.
దేవుడు లాంటి తండ్రి నిజరూపం అది కాదని తెలిసిన మిత్రకి మళ్లీ “,దేవుడు ఎక్కడ ఉంటాడు ” అనే ప్రశ్న ఒచ్చే ఉంటుంది. “కాలగర్భంలో చీకటి వెలుతురు లా మనిషిలోని మంచి చెడు ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాయి. ఆ మంచి చెడుల పోరాటమే ఈ మానవ ప్రస్థానం, మనిషి తను విత్తిన పంటనే కోస్తాడు” అంటూ ముగిస్తాడు ఈ ఆధునిక మహాభారతాన్ని


 

పయనమే పయనమే ఆ గమ్యం కన్నా మిన్న పదరా అన్న….! (Rolling titles..claps to Deva katta)


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , ,