Here’s How This Artist Is Creating Beautiful Portraits Of Popular Telugu Writers & Poets!

 

టెక్నాలజీలో ఎన్ని మార్పులు వస్తున్నా కాని పేయింటింగ్స్ కున్న గుర్తింపు, ఆదరణ ఎప్పటికి ఉంటుంది. ఒక వ్యక్తి మనస్తత్వాన్ని, అందాన్ని పేయింటింగ్ చూపించినంతగా మరేది చూపలేదనిపిస్తుంటుంది. అందుకే ఫొటోగ్రఫికి ఇప్పుడు ఎంతటి ఆదరణ ఉందో పేయింటింగ్స్ కు అంతే ఆదరణ ఉంది. ఫొటోగ్రఫి ఎవ్వరైనా నేర్చుకోగలరు కాని ఆర్టిస్ట్ మాత్రం కొందరే అవ్వగలరు. “పద్మకృష్ణ” గారు 7వతరగతి చదువుతుండగానే చదువును ఆపేసి పూర్తి సమయాన్ని పేయింటింగ్స్ వేస్తూ ఆర్టిస్ట్ గానే తన జీవితాన్ని కొనసాగించాలని అనుకున్నారు. కాని ఇంట్లో మాత్రం “చదువు మానేసి పేయింటింగ్స్ వేయడం మొదలుపెడితే చివరికి రోడ్డు మీద వేసుకోవాల్సి ఉంటుంది” అని ఇంట్లో వాళ్ళు హితభోద చేశారట. కాని తన ఇష్టాన్ని ప్రతిభను మాత్రం వదిలేయలేదు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఫైన్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుని తనలో ఉన్న వజ్రంలాంటి ప్రతిభకు మరింత పదునుపెట్టారు. కట్ చేస్తే తను కలలు కన్నా ఆర్టిస్ట్ జీవితాన్ని గడుపుతున్నారు.. నిన్నటి తరం సాహితి ప్రముఖుల ఫోటోలు అత్యంత అరుదుగా మాత్రమే దొరుకుతాయి ఒకవేళ దొరికినా గాని క్వాలిటీ అంతగా ఉండవు పద్మకృష్ణ గారు వేసిన ఈ అందమైన వర్ణ చిత్రాలలో మన తెలుగు సాహితీ ప్రముఖులతో పాటు తన ప్రతిభను కూడా దర్శించవచ్చు.


 

1. కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ.
మాట్లాడే వెన్నెముక పాటపాడే సుషుమ్న -శ్రీ శ్రీ


 

2. శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు.
విరజాజి శిలపైన రాలేందుకు మరుమల్లె కెంధూళి కలిసేందుకే.


 

3. అరుద్ర గారు.
కసిని పెంచే మతము, కనులు కప్పే గతము, కాదు మన అభిమతము
ఓ కూనలమ్మ.!!


 

4. రాజశ్రీ గారు.
మనసనేదే లేని నాడు మనిషికేది వెల మమతనేది లేని నాడు మనసు కాదది శిల.!!


 

5. గిడుగు రామమూర్తి గారు.
గ్రాంధికమ్ము నెత్తిన పిడుగు గిడుగు, వ్యవహార భాషోద్యమ స్థాపక ఘనుడు గిడుగు, తేట తేనియల తెల్లని పాల మీగడ గిడుగు కూరి తెలుగు భాషకు గొడుగు గిడుగు


 

6. శ్రీ శ్రీ గారు.
నీ ప్రతిమాట నెత్తుటి మంటై కొత్త వెలుగులు చూపింది.!
నీ ప్రతివాక్యం ప్రభాత కిరణమై చీకటి కోణాలను చీల్చింది..!!


 

7. ఆచార్య ఆత్రేయ గారు.
అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని..!


 

8. చలం గారు.
నా చూపులో కట్టుబడి నీ చూపును ఆపు నీ చూపు కదిలిందా నీ మనసు కదులుతుంది నీ మనసు కదిలిందా ప్రపంచాలే కదులుతాయి.!!


 

9. సముద్రాల వేంకట రాఘవాచార్యులు గారు
ఆశామోహముల దరి రానీకోయి బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్, ఆ యెఱుకే నిశ్చలానందమోయ్, బ్రహ్మానందమోయ్!!


 

10. దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు.
నా అక్షరాలు కన్నీటి జడులలో తడిపే దయాపారావతాలు నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు..


 

11. చందాల కేశవదాసు గారు.
మీరజాలగలడా నాయానతి వ్రతవిధాన మహిమన్..


 

12. త్రిపురనేని గోపిచంద్ గారు.
మానవుడు సగం జీవితం నేర్చుకోవడంతోనూ మిగిలిన సగం తాను నేర్చుకున్నది తప్పు అని తెలుసుకోవడంతోనూ గడుపుతున్నాడు..


 

13. సి. నారాయణ రెడ్డి గారు.
పగలే వెన్నెల, జగమే ఊయల కదిలే ఊహలకే కన్నులుంటే..


 

14. బుచ్చిబాబు గారు.
మానవునికి కావాల్సింది మతాలు, దేవుళ్ళు, మొక్కుబళ్ళు, రాజకీయాలు కావు.. కావాల్సింది దయ. అది ఏ కొంచెం ఉన్నా చాలు..


 

15. పింగళి నాగేంద్రరావు గారు.
అటు నేనే.. ఇటు నేనే చిరంజీవ.. చిరంజీవ..
సుఖీభవ! సుఖీభవ!!


 

16. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.
గూడు నిద్రపోయినా గువ్వ మేలుకొంది
గొంతు మూగపోయినా గుండె పాడుతుంది.


 

17. కొసరాజు రాఘవయ్య చౌదరి గారు.
అపాయమ్ము దాటడానికి ఉపాయమ్ము కావాలి అంధకారమలమినపుడు వెలుతురుకై వెదకాలి ముందు చూపులేనివాడు ఎందునకూ కొరగాడు.


 

18. గుర్రం జాషువా గారు.
కుల మత విద్వేషంబుల్ తలసూపని తావులే, కళారాజ్యంబుల్ కళ లాయుష్మంతములై యలరారెడు
నెలవు స్వర్గమగు చెలికాడా!


 

19. గురజాడ అప్పరావు గారు.
మంచి గతమున కొంచెమేనోయి
మందగించక ముందు అడుగేయి..


 

20. దాశరథి గారు.
అలుగు నేనే! పులుగు నేనే!
వెలుగు నేనే! తెలుగు నేనే!


 

21. యండమూరి వీరేంద్రనాథ్ గారు.
ప్రేమంటే హృదయాన్ని పారేసుకోవడం కాదు.. నువ్వులేనప్పుడు నవ్వుని
నువ్వున్నప్పుడు కాలాన్నీ పారేసుకోవడం..


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , ,