పందొమ్మిదేళ్ళకే సంగీతంలో డాక్టరేట్ సాధించిన హైదరాబాదీ పూజా నీలం కపూర్!

పూజా నీలం కపూర్ కు పదకొండేళ్ళ వయసులో తన తల్లి మ్యూజిక్ కీబోర్డ్ బహుమతిగా ఇచ్చింది. తన చేతిరాత మెరుగు పరుచుకుంటుంది అనే ఉద్దేశంతో తన తల్లి నీలంకు ఇచ్చింది. కాని తన మనసులో ఇంకా ఎన్నో అలోచనలు ఉన్నాయ్, ఓ సాయంత్రం ‘ఏక్ ప్యార్ కా నగ్ మా హై ‘ హిందీ క్లాసిక్ సాంగ్ ను కీబోర్డ్ పై పలికించడం మొదలుపెట్టింది. అది విన్న తన తల్లి పూజా ప్రతిభను చూసి ఆశ్చర్యపోయింది, పూజాకి ఇంకో రెండు పాటలు వినిపించింది, వాటిని కూడా పూజా అలవోకగా కీబోర్డ్ పై పలికించింది. తన కూతిరి టాలెంట్ గుర్తించిన పూజా తల్లి రోజూ ఒక పాటను సాధన చేయించింది. అలా తను 1200 పాటలను కంపోజ్ చేసి స్కూల్ ఫంక్షన్స్ లో తన ప్రతిభను కనపరిచేది. అప్పటి గవర్నర్ ముఖ్యమంత్రి సమక్షంలో కూడా ప్రదర్శనలు ఇచ్చింది పూజా, తన టాలెంట్ ని మెరుగుపరుచుకోటానికి హిందుస్ధానీ సంగీతంలో శిక్షణ తీసుకుంటుంది.
 
Pooja 1
 
పూజా రోజూ పొద్దున ఐదింటికి లేచి సాధన మొదలుపెట్టేది, సరదాలు నిరంతరం సంగీత ప్రపంచంలోనే ఉండేది, అలా తనకంటూ ఒక సొంత అర్కెస్ట్రాను ఏర్పాటుచేసుకుంది. తన ప్రతిభను గుర్తించిన అనేక టీవీ చానల్స్ రియాలీటి షోలకు ఆహ్వానించాయి. ‘ఇండియాన్ గాట్ టాలెంట్ ‘ షోలో కళ్ళకు గంతలు కట్టుకొని పియానో వాయించినందుకు అక్కడ ఉన్న న్యాయనిర్ణేత, ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ పూజాని గ్రేట్ మొజార్ట్ గా అభివర్ణించాడు. ‘తేరే మేరే బీచ్ మే’ షోలో అప్పటికప్పుడు ఒక పాటకి సంగీతం కట్టినందుకు హృతిక్ రోషన్ ఫిదా అయిపోయానంటూ వచ్చి పూజాను హత్తుకున్నాడు, అదే షోలో సోనం కపూర్, దర్శకురాలు ఫరాఖాన్ కూడా పూజాని మెచ్చుకున్నారు. కామెడీ నైట్స్ విత్ కపిల్ షోలో కూడా తలుక్కుమంది.
 
pooja 5
 
అలా తన ప్రతిభ అన్ని చోట్లకి వ్యాపించి బాలాజీ టెలీఫిల్మ్ నుండి కబురు వచ్చింది, తన టాలెంట్ ను నిరూపించుకున్న పూజాకి ‘క్యుహోగా నిమ్నో కా’ అనే డైలీ సీరియల్ కి అవకాశం వచ్చింది. అప్పుడు తన వయసు పదహారేళ్ళు, తర్వాత అనేక అవకాశాలు రావడంతో ముంబై లోనే నివాసముంటున్నారు. పూజా పాటలు కంపోజ్ చేయడమే కాదు లిరిసిస్ట్ కూడా, ఈ మధ్య కాలంలో ‘ యే ముజే క్యా హువా ‘ అనే అల్బుం కుడా విడుదల చేసింది.
 
Pooja 4
 
ఇప్పటి వరకు పూజా సాధించిన సంగీత సత్కారాలను చుద్దాం
 
1. ఇండియా బుక్ ఆఫ్ రికార్ద్స్ 2010
2. వరల్డ్ అమేజింగ్ రికార్ద్
3. ఆసియా బుక్ ఆఫ్ రికార్ద్స్
4. తెలుగు బుక్ ఆఫ్ రికార్ద్స్
5. కెల్వినేటనర్ గ్రేట్ వుమన్ అవార్డు 2013
6. అతి చిన్న వయసులో డ్యూక్ యునివర్సిటి ఆఫ్ నార్త్ కరోలిన నుంచి డాక్టరేట్
7. గ్లోబల్ వరల్డ్ రికార్ద్స్
 
ఇలాంటి ఎన్నో అవార్డులను పూజా గెలుచుకోవాలని, ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలని ఛాయ్ బిస్కెట్ కోరుకుంటుంది.
 

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , ,