Meet Ponnada Murthy, A 75-Year-Old Man From Vizag & His Sketches

 

1955 విశాఖపట్నం జిల్లా నక్కపల్లి గ్రామం, పొన్నాడ మూర్తి గారు 3వ ఫామ్(8 వ తరగతి) చదువుతున్నారు. టీచర్ మంచి ఉద్వేగంతో క్లాస్ తీసుకుంటున్నారు.. మూర్తి గారికి అది అంత ఆసక్తిగా అనిపించక ఒక పెన్సిల్, పేపర్ పట్టుకుని ఎదురుగా ఉన్న టీచర్ బొమ్మను వేశారు. క్లాస్ లో పాఠం వినకుండా నువ్వు చేస్తున్న పని ఇదా అని టీచర్ కు చిర్రెత్తుకచ్చింది. వెంటనే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. ప్రిన్సిపాల్ గోపాలం గారు ఇలాంటివి మళ్ళి జరిగితే కుర్రాడు దారితప్పుతాడనే ఉద్దేశ్యంతో బెత్తం పట్టుకుని మూర్తి గారిని దండించారు.

ఇక్కడ నిందించాల్సినది ఎవ్వరిని కాదు, ఈ సంఘటన ఆనాటి పరిస్థితులకు తార్కాణం. చదువు మాత్రమే విద్యార్థికి ఆశించిన భవిషత్తును ఇవ్వగలదు అనే రోజుల నుండి పొన్నాడ మూర్తి గారు బొమ్మలు వెయ్యడం మొదలుపెట్టారు. మూర్తి గారికి బొమ్మ వెయ్యాలన్న తపనే గురువు, ఆ గురువు గారి సహాయంతోనే నేర్చుకున్నారు. B.com పూర్తిచేసి ఒక ప్ర్తెవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే కాలక్షేపంగా బొమ్మలు, కార్టూన్లు వేసేవారు. అవన్నీ నాటి ఆంధ్రపభ, ఆంధ్రభూమి, స్వాతి మొదలైన వాటిలో ప్రచురితమయ్యేవి.


75 సంవత్సరాల మూర్తిగారికి జ్ఞాపకశక్తి అధికం, చిన్ననాటి మధుర జ్ఞాపకాలు సంవత్సరాలతో సహా ఇప్పటికీ నెమరువేసుకుంటారు. చదువు ఆ తర్వాత ఉద్యోగ్యం పిల్లలు బాధ్యతల నడుమ పేపర్ పెన్సిల్ తో గడపలేని ఎక్కువ సమయాన్ని మూర్తి గారు ప్రస్తుతం గడుపుతున్నారు. ఈ మధ్యనే సోషల్ మీడియాలోకి రాగానే వారు బొమ్మలకు గాను ఊహించని గుర్తింపు కూడా లభిస్తుంది, ఇది మూర్తి గారిలోని కళాకారుడికి మరింత ఆనందాన్ని ఇస్తున్న అంశం. ఇప్పటి వరకు మూర్తి గారి ప్రయాణాన్ని చదివాము కదా.. ఇక ఇప్పుడు వారి ప్రతిభను చూద్దాం రండి..

1. నేటి యువతకు రామాయణం, మహాభారతం, శివపురాణం మొదలైన పుస్తకాల సారాన్ని అందిస్తూ, వాటిపై మమకారాన్ని పెంచుతున్న ప్రవచన చక్రవర్తులు..


 

2. కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె ఊయలనూపు ఓ కూనలమ్మ..


 

3. సి నా రె అన్నవి పొడి అక్షరాలూ కావు, పుప్పొడి అక్షరాలూ..
అందుకే సి నా రె ను పిండితే మకరందం జాలువారుతుంది
జొన్నరొట్టె మీద వెన్న పూస పూసినారె
తెలుగు పాట బుగ్గ మీద చిటిక వేసినారె
ఇంతింతై విశ్వంభర నంత చూసినారె
జ్ఞానపీటి పైన జానపదములేసినారె.
– తనికెళ్ళ భరణి గారు


 

4. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ప్రకటించుకున్న మహాకవి దాశరథి కృష్ణమాచార్య గారు.


 

5. భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు గారు.


 

6. తెలుగు బిడ్డ, బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ గారు.


 

7. సరిలేరు నీకెవ్వరూ.. సిరి లోనూ.. మగసిరి లోనూ..


 

8. ఒక ఆలోచన.. ఒక సత్యం.. ఒక వెలుగు. జిడ్డు క్రిష్ణమూర్తి గారు.


 

9. కర్ణాటక సంగీతపు శాస్త్రీయ, అర్థ-శాస్త్రీయ గీతాలాపన.. భారతరత్న మదురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి గారు.


 

10. ఎంత హాయి ఈరేయి నిండెనో ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో
కొమ్మల గువ్వల సవ్వడి వినినా రెమ్మల గాలుల సవ్వడి వినినా
ఆలలు కొలనులొ గలగల మనినా దవ్వుల వేణువు సవ్వడి వినినా

నీవు వచ్చెవని నీపిలుపే విని కన్నుల నీరిడి కలయ చూచితిని
గడియె యేని ఇక విడిచి పోకుమా ఎగసిన హృదయము పగులనీకుమా
– దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు


 

11. భారతీయ సినిరంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకిచ్చే రెండవ పెద్ద పురస్కారమైన పద్మవిభూషణ్ తో పాటుగా, భారత సినీరంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును పొందిన మార్గదర్శి.


 

12. ఏ తరమైనా కొత్తని పట్టుకోవాలి, పాతని పట్టుకెళ్ళాలి’ అంటూ లఘు చిత్రాల ద్వారా అంతర్జాలంలోకి ప్రవేశించారు ఎల్.బి. శ్రీరామ్ గారు.


 

13. రెప్పలార్పకుండా నినెప్పుడైనా చూస్తినా
టక్కులాడి చుక్కలన్ని ఫక్కుమని నవ్వుతాయి “సిగ్గే”.


 

14. పౌరాణికమయినా, జానపదమయినా, సాంఘికమైనా తను అలవాటుపడ్డ మాండలికంలోనే ఒకే రీతిలో సంభాషణలు చెప్పిన నటుడు రమణారెడ్డి గారు. తాను పోషించిన పాత్రలతో శెభాష్ అనిపించుకున్న నటుడు.


 

15. సలాం కలాం.. వెల కట్టలేని భారత ”రత్నం”


 

16. సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసిన మహాకవి గుర్రం జాషువా గారు.


 

17. అభినవ సీతమ్మగా ప్రసిద్ధి చెందిన అంజలీదేవి గారు.


 

18. దేవునిగా వచ్చావు.. మొశావు, నడిపించావు, సహచరుడిగా మెలిగావు.. నిన్ను మించిన నాన్న ఇంకొకడు లేడని నిరూపించి వెళ్లావు..


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , ,