అందానికి మూలం ఏంటి? రూపమా? చూసేవాడి భావమా? – A Short Poem

 

Contributed by Yeswanth Chinni

 

మబ్బుల చాటు నుంచి నువ్వు చూసే దొంగ చూపుల వలన వచ్చిందా ఈ అందం?
చల్లని వెన్నెల కురిపించడం
వలన వచ్చిందా ఈ అందం?

 

పక్షం పెరిగి పక్షం తరుగుతూ ఉండడం
వలన వచ్చిందా ఈ అందం?
చెట్టుకొమ్మల మధ్యలో నుంచి నేను చూడడం
వలన వచ్చిందా ఈ అందం?

 

తారలను పక్కకు తన్ని రాత్రికి రారాజు కావడం
వలన వచ్చిందా ఈ అందం?
నెలకు ఒక్కసారి నీ నిండుతనం కోసం నిరీక్షించే
నా కళ్ళ వలన నీకు వచ్చిందా ఈ అందం?

 

గ్రహణం పట్టిన విడిపించుకునే నీ ధైర్యం
నుంచి వచ్చిందా ఈ అందం?
భువి చుట్టూ తిరుగుతూ అనుభవించిన ఒంటరితనం
నుంచి వచ్చిందా ఈ అందం?

 

చంటి పిల్లలకు నిన్ను మాత్రమే చూపించి
గోరు ముద్దలు తినిపించాలని
నువ్వు కోరుకోవడంలో నుంచి
వచ్చిందా ఈ అందం?
భూమికి నేను మాత్రమే సహజ సిద్దమైన
ఒకే ఒక్క ఉపగ్రహం అనే స్వార్ధంలో నుంచి
వచ్చిందా ఈ అందం?

 

ఎలా వస్తే ఏం లే చంద్రమా ఇంత అందం,
దానిని అనుభవించడానికి ఒక మనసు
ఉంది అది చాలు నాకు.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , ,