This Sarcastic Poem Of A Person Wishing All The Corrupted People In India On Republic Day Is Spot On!

 

స్వతంత్ర భారత దేశ పుత్రులారా..
అవినీతి బురదలో ఉన్న క్షతగాత్రులారా..
లంచం కంచంలో తినే ప్రజాసేవకులారా..
పదవికోసం కొట్టుకు సచ్చే పిచ్చి కుక్కలారా…

ఇవే మీకు నా శుభాకాంక్షలు, 69వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ..

వందేమాతరం పాడే తీరిక లేని విద్యార్థులారా..
జనగణమన విలువ నేర్పలేని గురువులారా..
నిజానికి రూపాన్ని మార్చి అబద్దాన్ని నిజం చేసే అమరశిల్పులైన న్యాయవాదులారా…
క్రూరమైన మృగాలని ఏ.సీ రూములలో ఉంచి z కేటగిరీ సెక్యూరిటీ తో కాపుగాసి…
భారతజాతి స్త్రీ గుండెల్లో మాత్రం “నిర్భయా”న్ని నిలుపలేని పోలీసులారా ..

ఇవే మీకు నా శుభాకాంక్షలు, 69వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ..

ప్రజలే దేవుళ్లంటూ.. వారి సేవకే మేము అంకింతమంటూ
ఓటుకు నోటంటూ .. నోటుంటే సీటు అంటూ..
పదవులను అమ్ముకుని పార్టీలు మారే రాజకీయ నేతలారా..
నిరాహార దీక్షలని.. రాస్తా రోకోలని నానా ఖరాబ్ చేసే పని తెలియని గొడ్డులారా…

ఇవే మీకు నా శుభాకాంక్షలు, 69వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ..

ఆగష్టు 15 న ,, జనవరి 26 న
తాడుకు ముడి విప్పి… నాలుగు మాటలు చెప్పి..
జెండా ఎగుర వేసి … దానికి సెల్యూట్ కొట్టి..
వాళ్లకు జేజేలు చెప్పి
“మేరా భారత్ మహాన్ ” అంటే సరిపోదునా ????

కనపడుతుందా?? పోనీ వినపడుతుందా??
అరె ఓ ఇండియన్!!

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , ,