రాని మనిషికి కరగని మనసు కి ఒక లేఖ : A Short Poem

 

Contributed By Harika Potluri
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు వేసే జత ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా ”

అని రాసిన సిరివెన్నెల పాట లా

నీవు అడుగులు వేసే నేల నేనౌతూ
నీ చిరునవ్వుల కారణం నేనౌతూ
నీ ఆనందానికి ఆధారం నేనై

“ఓ పాపా లాలి” అని నేను కట్టిన ప్రపంచం లో
నువ్వు రాణి గా ఉండే మన సామ్రాజ్యం లో
నిన్ను నిద్రపుచ్చి నీ గుమ్మం బయట నిన్ను ఎల్లప్పుడూ
కాపాడే రక్షకుడి గా ఉండాలని ఆశించి

నా అను జీవితానికి మనం అనే అర్ధాన్ని అనుకున్నా

 

కానీ పరమార్ధం అని దైవనిర్ణయపు బానిసనై
అనర్ధాల అడ్డుగోడల మధ్య కొట్టుమిట్టాడుతూ
నీకు నన్ను దూరం చేసిన ఆ విధిని చూసి వేధిస్తూ
అంధకారపు అంచుల్లో ఒంటరినై నే కృషించగా
నీవు రావు అన్న బాధ నన్ను దహించు వేళ
నీ ఆనందమే నాకు ముఖ్యం అని
ఆ బాధని దిగమ్రింగే నా ప్రయత్నం,
నన్ను మృగం చేస్తే, దిక్కు తోచక
నొప్పి దాగక బ్రహ్మరాత ను మార్చలేక
క్షణక్షణం నరకవేదనై నన్ను అంతంతమాత్రం గా
కొరికేస్తున్నా

 

కన్నీరు ఆగకపోయిన నీ ఆనందమే నాకు చాలు
అంటూ నరకాన్ని సైతం నవ్వుతూ నడిపిస్తున్నా

నేను వేచి ఉంటా నీ రాకకై
ఎందుకంటే
నేను నిన్ను ప్రేమించటం కన్నా
నీ పై నాకు ఉన్న అభిమానం అధికం
అదే నిజం

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , , , , , , , , , , , , ,