This Poem About A Guy’s Feelings For His Lover Is Relatable To All The Guys Out There

 

Contributed by MV Ramana

ఏందిది అసలు,
ప్రకృతిల పరవళ్లు నాలో ఇలా..
ఈ క్షణాలకెందుకింత మధురం,
అమృతం మాత్రమే కురిపించే పాలసముద్రం చిలుకుతున్నదెవరు నాలో ..?

సరిసమానమేది నీ సొగసులుకి
నీ పరువపు పులకరింతలోనే పునీతమవగా,
తనువంతా ఏదో నీ ఆవాహంలా
ఈ కనులంతా నిండిన నీ చిత్రాలతో
ఈ తన్మయత్వపు తుళ్ళింతలు,
స్పర్శ ఏ లేని చెక్కిలిగింతల నడుమ
అధరాలు చేసే నిశ్శబ్ధ అలజడి
ఇంకా..
ఇంకా..
చెప్పాలంటే
గెలిచినా క్షణాన ఆటగాడిలో కలిగే ఆనందం
రుచి నెరిగిన నిమిషాన జిహ్వపు అనుభూతి
ఆ భావాలనెప్పుడు ఎవరు చెప్పినా,
అవి జ్ఞాపకాలాడే మాటలు తప్పా, ఆ క్షణాలానందానికి సాటి రావెలానో ..

నేనెంత వర్ణించినా.. నిను చూసినా.. తలిచిన నిమిషాల అనుభూతులకు సరితూగవెప్పటికీ నా మాటలు..
శబ్ధ రత్నాకరంలో శబ్ధాలేవీ సాటిరావు ఈ భావాలకి..
సరిగమపదనిసలు చాలవు నాలోని బాణీలకు స్వరాలు సమకూర్చడానికిప్పుడు…

అయినా గమ్మునుండమని చెప్పు ఈ మనసుకి,
ఎవరికీ లేని మక్కువ తనకెందుకో నీపైన..
కాళ్ళు విరగొట్టాలనుంది కన్పిస్తే ప్రేమని.
నీపై భావాలన్నీ రెండే పదాలలో ఇముడ్చుతున్నందుకు..

ఒక్క నా వయసుకి మాత్రం పాదాభివందనం చేసేస్తున్న ఎప్పటికప్పుడు..
తను ఒక్కరే నీపై భావాలన్నింటితో సెకను, సెకెనుకు పోటీపడుతున్నందుకు..
ఆ భావాల ఉచ్ఛస్థితిని చూసే నా చివరి శ్వాసకు ఎంత అదృష్టముండకపోతే,
రాసి పెట్టుకొని కూర్చుంటుంది ఆ క్షణాలకోసం …

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: ,