This Poem On ‘Telugu Aksharam’ Tells Us The Greatness Of Our Language
“దేశ భాషలందు తెలుగు లెస్స” అన్నారు శ్రీకృష్ణదేవరాయలు .. అటువంటి భాష మన మాతృభాషా అయినందుకు మనం గర్వపడాలి . మన తెలుగు భాష ఔన్నత్యాన్ని గుర్తుచేసుకుంటూ మన జీవితాల్లో భాగమైన అక్షరం గురించి నా ఈ చిన్న మాట
ఓ అక్షరమా నీకు నమస్కారం…
బాధను పంచుకోవటానికి
ఆనందాన్ని ఆస్వాదించటానికి
కోపాన్ని కరిగించుకోవటానికి
నువ్వే మా ఆధారం
ఓ అక్షరమా ప్రతి సమస్యకు నువ్వే పరిష్కారం
కలలో అయిన
కళలో అయిన
కథలో అయిన
వ్యధలో అయిన
కలలో కథ అయి
కథలో వ్యధ అయి
వ్యధయె పదమై
పదమే స్వరమై
స్వరమే నీ జీవన శైలి అయితే
ఓ అక్షరమా నువ్వే మా జీవన ఆధారం
చేసావు మా జన్మను సాక్షాత్కారం
ఓ అక్షరమా నీకు నమస్కారం
అమ్మతనాన్ని బోధించే అందమైన “అ”కారం
దైవత్వానికి ప్రతిరూపం మన ఓంకారం
అరచేతికి వ్యాయామం మన ” శ్రీ ” అక్షర ఆకారం
మరువ రాదు మాతృభాష పై ఉన్న గౌరవం
పుడమి జడలో పరిమళ పద కుసుమం
విశాల జగత్తులో ప్రశాంత భావ సంద్రం
హరివిల్లెరుగని మనోహర మది వర్ణం
మన హృదయ సంధాన భాషావనం
ఎంత చెప్పిన తరగని భాషా గొప్పతనం మా తెలుగుదనం
ఓ అక్షరమా నువ్వే మా జీవన ఆధారం
చేసావు మా జన్మను సాక్షాత్కారం..!
If you wish to contribute, mail us at admin@chaibisket.com