This Girl’s Story About A Call She Got From Her Crush Might Just Give You The Clarity You Need As Well!

 

Contributed By Rithika Devi Sana

 

అందరి life లో ఎదో ఒక time లో అసలు వాళ్ళ జీవితం లో ఏమి జరుగుతుందో అర్ధం కానీ సమయం ఉంటది కదా?
అలంటి time లో ఒస్తారండి ఒక చిన్న సైజు రెక్కలు లేని ఏంజెల్ లాగా.
నేను కూడా అదే phase లో ఉన్నానండీ.
అప్పుడు కనిపించదు అతను.
ఫస్ట్ time చూసినప్పుడు అందరి లగే నేను కూడాఅబ్బాయి బాగున్నాడు కదా అని అనుకున్న. Teenager ని కదండీ! నేను మాత్రం ఎం చేస్తా చెప్పండి?
మాట్లాడాలి అనిపించింది.

“చాలా popular కదా సో కాల్ చేస్తే ఎం కాదు లే” అని నాకు నేను సర్ది చెప్పుకున్న. నెక్స్ట్ డే మాట్లాడా.
He : “హలో? ఎవరు మాట్లాడుతుంది?”
Me : “హే!”
ఆలా చిన్న crush లా స్టార్ట్ అయినా feeling అండి అది. కొన్ని రోజుల తర్వాత ఫ్రెండ్స్ గా మారాం. సరదాగా మాట్లాడటం కన్నా మా మధ్య పెద్ద గా ఏమి ఉండదు అనుకున్న. ఎందుకంటే నాలాంటి అమ్మాయి ని భరించడం మామూలు విషయమా చెప్పండి?
అప్పుడు అర్ధం కాలేదు తనే నా guide అవుతాడు అని. తను పనిచేస్తున్న profession నచ్చడం తో ఆ విషయం లో టిప్స్ తీసుకునే దాన్ని. ఇంకా graduation అవ్వలేదు కదా సో అందరూ చిన్న పిల్ల లగే ట్రీట్ చేస్తున్న time ఇది. ఎం కావాలో, ఎం చెయ్యాలో తెలియని feeling.
పైగా సెలవలు.

ఇప్పుడు తాను నా బెస్ట్ ఫ్రెండ్ .best friend!!!
Part time జాబ్ కి ఆ profession లోనే interview కి వేళ్ళ. ఆ రోజు సాయంత్రం అంతా అయిపోయాక కాల్ చేశా. ఈ సారి మాత్రం జాబ్ గురించి మాట్లాడటానికి చేశా.
Me : “ఇవాళ interview ఎలా చేశాను?
He : “అప్పుడే ఎలా తెలుస్తది? time పడ్తది కదా.”
Me : sad గా “హ్మ్మ్”
He : “ఒకటి అడుగుతా. చెప్తావా?”
Me :”permission ఎందుకు? shoot ది question”
He : “అసలు ఈ జాబ్ ఎందుకు చెయ్యాలి అనుకుంటున్నావు? అసలు నువ్వు ఎం అవ్వాలి అనుకుంటున్నావు?”
Me : thinking “….”
He : “ఇంకో 2 years లో ఇంజనీరింగ్ అయిపోతది. ఎం చేస్తావ్?”
Me : still thinking…
He : “తర్వాత time ఉంటది అనుకుంటారు. కానీ అసలు ఉండదు.ఏదో ఒకటి అనుకోని ఉంటావ్ కదా ఎం చెయ్యాలో. చెప్పు”
Me : “తెలీదు”

ఎదో చిన్నపట్నుంచి ఆ జాబ్ చాలా interesting గా అనిపించి interview కి వెళ్ళాను కానీ అసలు నేను తర్వాత గురించి ఆలోచించలేదు. ఇవాళ గురించి మాత్రమే ఆలోచించాను
అప్పుడు అదిగదండీ…కాదు కాదు చెప్పేడు. తన life గురించి. అసలు ఆ profession ఎలా ఉంటది అని. నాకు కనిపించిన reality అసలు reality ఏ కాదని అర్ధం అయ్యేలా చెప్పాడు. అసలు ఎవరూ అడగని question అడిగాడు.
“అసలు నీకేం కావాలో ఆలోచించు” అని మంచిగా చెప్పేడు.
అప్పుడు వొచింది నా mind లో కి ఆ question.
“అసలు నాకేం కావాలి?”
He : “ఒక పని చేసి పెడతావా?”
Me : “చెప్పు”
He : “బాగా ఆలోచించి నీకేం ఇష్టమో. నువ్వేం చెయ్యాలి అనుకుంటున్నావా list రాసి పంపుతావా?”
Me :”okay”
He : “కానీ ఒక్కటి గుర్తుంచుకో. నీకు కావాల్సింది ఏది ఈజీ గా రాదు. మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి, నిన్ను పెళ్లి చేసుకొనే వాడిని కూడా convince చెయ్యగలిగే strength నీలో ఉంటేనే ఒక step ముందుకు వెళ్తావ్. లేక పోతే ఎదో పని చేస్కుంటా అని కూడా ఆప్షన్ తీస్కోవచ్చు నువ్వు.నీకేది కావాలో నీకు నచ్చినది ఏంటో చెయ్యాలి అంటే మాత్రం ధైర్యం గా decision తీసుకొనే strength నీలో ఉందా?”

Me : My brain never thought this much in my entire life.
Crush లా స్టార్ట్ అయిన పరిచయం నా self introspection తో ఎండ్ అయ్యింది. సరదా గా ఒక ఫోన్ కాల్ తో స్టార్ట్ అయిన ఈ journey life లాంగ్ ఒక మంచి ఫ్రెండ్ ని సంపాదించి పెట్టింది.
ఇప్పటికి నాకేం కావాలో తెలీదు. ఇంకా answer కోసం వెతుకుతూనే ఉన్న. కానీ ఎదో ఒక రోజు దొరుకుతుంది అనే ధైర్యం. ఆ రోజు తొందరలోనే ఉంది అనే నమ్మకం. ఇంకా రెండేళ్లు ఉన్నాయి. ఈ లోపు సాధించగలను అనే ఆలోచన తో ఉన్న.
ఒక అమ్మాయికి అంత కంటే ఎం కావాలి చెప్పండి?

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , ,