Meet The Man And His Amazingly Lively Pencil Sketches

 

మంచిర్యాల సమీపంలోని బుద్దిపెళ్లి గ్రామం,
గవర్నమెంట్ పాఠశాల,
ఆరవతరగతి, భయంకరమైన హిందీ క్లాసు. చచ్చాన్రోయ్!!

 

రేయ్.. అందరూ మీ దగ్గర హిందీ టెక్స్ట్ బుక్ ఫస్ట్ పేజ్ లోనే అనార్, ఆమ్, కెలా మొదలైన పదాలున్నాయి కదా.. రేపు మీరు వచ్చేటప్పుడు వాటిని చూసి రాసుకురండి. అని టీచర్ హసీనా గారు చెప్పారు. మనోడు సిద్దు కు టీచర్ గారు చెప్పింది వేరే రకంగా అర్ధం చేసుకుని రాత్రి టెక్స్ట్ బుక్ చూస్తూ రాసుకుని ఉదయం క్లాసుకు వచ్చి మేడమ్ గారికి బుక్ ఇచ్చాడు. మిగిలిన పిల్లల నోట్ బుక్ మాములుగా చూస్తే, సిద్దుది మాత్రం ప్రత్యేకంగా చూసి కావాలనే ఆర్టిఫీషియల్ కోపంతో పిలిచారు. ఇక్కడ సిద్దుకు నిక్కర్ తడిచిపోయేలా ఉంది, కట్ చేస్తే మేడమ్ గారు చప్పట్లు కొట్టి సిద్దు ని అభినందించి నోట్ బుక్ అందరికి చూపించారు, అభినందించారు. అనార్ ఆమ్ లాంటి హిందీ పదాలు చూసి రసుకురమ్మంటే మనోడు ఏకంగా బుక్ ఎలా ఉందో అలాంటి ఫాంట్స్ తో పక్కన ఉన్న పండ్ల బొమ్మలతో మక్కీ కి మక్కీ రెప్లికా గా దించేశాడు. అదే అతని మొట్ట మొదటిసారి తన టాలెంట్ వెలికితీయబడిన సక్సెస్. అప్పటి నుండి మేడం గారు ఆరోతరగతి నుండి పదో తరగతి వరకు స్కూల్ అంతటికీ సిద్దు ప్రతిభను తెలియజేశారు.


 

నాన్న నుండి:
సిద్దు గురించి ఒక్క పదంలో చెప్పాలంటే అతనొక మట్టిలో మాణిక్యం. ఏ ఫైన్ ఆర్ట్స్ చెయ్యలేదు, ఏ మాష్టారు గారి దగ్గర బొమ్మలు గీయడం నేర్చుకోలేదు. వారిది మంచిర్యాల జిల్లాలోని బుద్ధిపల్లి అనే ఓ చిన్న గ్రామం. నాన్న ఆర్టీసీ డ్రైవర్. సిద్దు కు నాన్నే హీరో. నాన్న రామచంద్ర గారు ఉద్యోగం చేస్తూనే హాబీ కింద న్యూస్ పేపర్ లోని అక్షరాలను సరిగ్గా అదే ఫాంట్స్ తో రాసేవారు. దీనిని సిద్దు అతి జాగ్రత్తగా తన నోట్ బుక్ లో దాచుకునేవారు. చిన్నతనం నుండే సిద్దు చదువుకునే స్కూల్ లో సెలెబ్రిటీ. మన సైన్స్ సబ్జెక్ట్ లో కనిపించే హార్ట్, చెవులు, నాలుక, కళ్ళు లాంటి అవయవాలను పర్ఫెక్ట్ గా గీసేవారు, దీని మూలంగా తోటి క్లాస్ మేట్స్ ఇంకా టీచర్స్ లోనూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందాడు.


 

స్నేహితుడి గైడెన్స్:
సిద్దు పెద్దగా చదువుకోలేదు, చదువుకోవాలన్న తపన మాత్రమే కాదు కెరీర్ పట్ల కూడా ఒకానొక సమయం వరకు అంతగా పట్టింపు లేదు, ఇలాంటి సమయంలోనే బంధువుల దగ్గర ఒక వారం రోజులపాటు కూలి పనిచేయడానికి వెళ్ళాడు, అక్కడికి సాగర్ అనే మిత్రుడు వచ్చి ఇంత గొప్ప టాలెంట్ పెట్టుకుని ఇలా చెయ్యడం కరెక్ట్ కాదు!! బొత్తిగా నీలోని టాలెంట్ ను నువ్వే వృధా చేసుకుంటున్నావని నాడు మోటివేట్ చేశారు. నిజానికి అవ్వేమంత తీవ్రమైన మాటలు కాదు, బహుశా సాగర్ లాంటి నిజాయితీ గల వ్యక్తి చెప్పడం మూలంగా సిద్దులో మార్పు మొదలయ్యింది. ప్రస్తుతం మంచిర్యాల సిటీలోనే నాన్న స్పూర్తితో డాడీ ఫైన్ ఆర్ట్స్ పేరుతో బొమ్మలు వేస్తూ ఉపాధి పొందుతున్నారు.


 

పెన్సిల్ లోనే జీవం ఉంది:
నలుపు తెలుపు మన జీవితానికి ప్రతీక. రాత్రి పగలు, ఆనందం కష్టాలు.. మిగిలిన రంగులు కొన్ని రోజులకు వెలిసిపోతాయి కానీ నలుపు తెలుపు మాత్రం నాణ్యమైనవి శాశ్వితమైనవి. అందుకే సిద్దు పెన్సిల్ తో ఆర్ట్ వెయ్యడానికే ఎక్కువ ఇష్టపడుతుంటారు. రంగులు లేకపోయినా కానీ ఈ బొమ్మలలో జీవం కనిపిస్తుంటుంది, సుమ గారు ఐతే ఇది అసలు ఆర్ట్ కాదు, గూగుల్ నుండి ఇమేజ్ డౌన్లోడ్ చేసి ఫ్రేమ్ కట్టించి తీసుకువచ్చారని అనుకున్నారట. ఐతే పక్కనే ఉన్న ఇతర సిబ్బంది వారు ఆర్ట్ ను చేరిపేస్తే చెరగడం చూసి సుమ గారికి చెప్పారు, అంత వరకు నమ్మలేదు. సిద్దు కు ఇలాంటి అనుభవాలు సాధారణమే. 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , ,