పరిణితి – This Short Story Makes You Question Yourself If You Are Matured Enough To Be In A Relationship

సరదాగా అలా చల్లని రాత్రి లో వేడి వేడి ఛాయ్ తీస్కొని డాబా మీద కూర్చున్నా. చల్ల గాలి , ప్రశాంతమైన వెన్నెల. తెలీకుండానే మొహం మీదకి చిరునవ్వు వచ్చేసింది. వెన్నేలిచ్చిన  స్వేచ్చేమో జీవితంలో నడుస్తున్న కష్టాలు , సమస్యలు అన్ని మర్చిపోయాను. సందిగ్ధాలతో నిండిన జీవితంలో ఊహలే కదా అలసటకి మందు.

నాలుగు నెలలు ముందు తను వదిలేసి వెళ్ళింది అనే సంగతి కూడా మర్చిపోయి , గడిపిన తీపి జ్ఞపకాలు , గుర్తులు అన్ని మదిలోకి రావడం మొదలు పెట్టాయి.ఇక్కడే నా పక్కన కూర్చుని ఇదే వెన్నెల్లో మాట్లాడుకునే వాళ్ళం. చరిత్ర నుండి చెత్త విషయాల దాక , పనికిరాని విషయాల నుండి దేశంలో తీసుకునే ప్రధాన నిర్ణయాల దాకా , ఏ అంశం అయినా అలా గంటల తరబడి మాటలాడుకునేవాళ్ళం. కానీ ఏ కథ కైనా మొదలు  తో పాటు ముగుంపు కూడా ఉంటుంది.

అలా జ్ఞపకాలలో తేలుతున్న నాకు , తెలీకుండానే ఆ కథ ముగింపు దగ్గరికి చేరుతున్నాను  అనే విషయం తట్టలేదు. చిరునవ్వుతోనే మొదలైనట్టు గుర్తు , కంటి నిండా కన్నీరు ఎపుడు నిండిందో అర్ధమే కాలేదు. కళ్ళ ముందు ఉన్న వెన్నెల మాయలో పడి మనసంచున ఉన్న చీకటి గాయాలు మర్చిపోయాను. ఆ గాయాలు నేర్పిన పాఠాలు ఎన్నో.

మనం ప్రేమించిన వాళ్ళు జీవితం లో మనతో ఉంటె ఎంత అందంగా ఉంటుంది. ప్రేమ మొదైలనప్పుడు భవిష్యత్తు లో  ఎదురయ్యే సమస్యల కన్నా , అపుడు ఆ క్షణం మనల్ని ఒప్పుకుంటారా ? ఒప్పుకుంటే ఎలా జీవించాలి అనే ఆలోచనలే ఉంటాయి. పెళ్లి అయితే జీవితం ఎలా గడపాలి , పిల్లల పేర్లు , నెలవారీ బడ్జెట్ , షాపింగ్ , ఒకే ఇంట్లో ఉండడం , కష్ట సుఖాలు పంచుకోడం ,  ఈ ఊహలన్నీ అందమైనవే. వీటితోనే మెడలు కట్టేస్తాం. కానీ మనలో ఎంత మంది ఆ కలల్ని నిజం చేసుకుంటాం. సక్సెస్ అయినా ప్రేమ కథలు పదుల్లో ఉంటె , విడిపోయిన కథలు వేలల్లో ఉన్నాయి. మన చేతిలో లేనివి ,సమాజం విడదీసిన కథల గురించి మాట్లాడట్లేదు , ఆ కథలు మన కర్మ , ఎలా అన్నా మార్చలేము. నేను మాట్లాడుతుంది నీ గురించి , నీ గుణాల గురించి , నీ వ్యక్తిత్వం గురించి , నీ అలవాట్ల గురించి. నీ వల్ల విడిపోయిన ప్రేమకథలు గురించి. నువ్వే సర్రిగా ఉంటె నీ ప్రేమ గెలిచేది కాదా?

మనిషి ఉన్నపుడు ఎవరికీ విలువ తెలీదు. వాళ్లే ఉంటారు లే అనే అహంకారం . ప్రేమించడానికి ఇష్టం కలిగితే చాలు , కానీ అది స్థిరంగా నిలబడాలంటే ఒకరిమీద ఒకరికి గౌరవం ఉండాలి.

నీ ప్రేమకథలో నువ్వు సరిగ్గా ఉన్నావా?

ఒక గొడవైతే నాలుగు రోజులు మాట్లాడడం మానేశావా ? లేకపోతే అసలా ఆ గొడవకి కారణం తెలుసుకుని కూర్చుని మాట్లాడుకుని దాన్ని పరిష్కరిద్దాం అనుకున్నావా ?,

తను ఏదన్నా తప్పు చేస్తే , తప్పు చేసావ్ అని నిందించే కారణం దొరికిందని చూస్తావా ? ఎందుకు చేయవలసి ఒచ్చిందో వివరించే అవకాశం ఇస్తావా ?

వాడు కోపం తో ఏదన్నా తప్పు చేస్తే చిరాకు పడి వెళ్ళిపోతావా ? కోపం వెనకున్న కారణం వెతుకుతావా ?

స్నేహితుడు అబ్బాయి అయితే అనుమానిస్తావా ? అర్ధం చేస్కుంటావా ?

2  రోజులు ఏమి మాట్లాడకపోతే వాడు బాధలో ఉన్నాడేమో అని కనుకుంటావా ? వాడే మాట్లాడతాడు లే అని వదిలేస్తావా?

సమస్యలు ఎన్ని ఉన్నాయో సమాధానాలు కూడా అన్నే ఉన్నాయి !

ఏ పరిస్థితి లో ఏ నిర్ణయం తీసుకుంటావో , అదే నీ వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది.

మనందరికీ గతాలు ఉన్నాయి , ఆ గతం లో గాయాలు కూడా ఉన్నాయి. అదే గతం తో ఎవరన్నా నీ దారికి వస్తే అనుమానం తో నస పెట్టి చెంపకు. వీలైతే అర్ధం చేస్కో లేకపోతే మౌనంగా ఉండు. ఒక మనిషి మీద నీ ప్రేమ కనపడాలి పెత్తనం కాదు. ఇంట్లో ఒప్పుకుని పెళ్లి దాక వెళ్లే కథలు చాలా తక్కువ , ప్రేమకి సమాజం అడ్డు పడితే అది నీ కర్మ , కానీ మీ కథకు మీరే శత్రువులు అయితే అంతకన్నా దురదృష్టం ఉండదు , అసలా మనుషులు అందరు సరిగ్గా అర్ధం చేసుకుంటే బ్రేకప్ అనే పదం డిక్షనరీ లో ఉంటుందా చెప్పండి.

ఈ లోకం లో ఇప్పుడున్న సమాజం లో అందరికి గాయాలతో నిండిన గతాలు ఉన్నాయి. వీలైతే గతాన్ని అర్థంచేసుకుని ఒక అవకాశం ఇవ్వండి ,మీకు మీ తోడుకి కూడా. లోకం లో అందరికి అర్ధం చేస్కునే తోడు కావాలి , కానీ ముందు మనం మారితే చుట్టూ జనాలు మారతారు, ప్రేమనే మధురమైన భావంలో అప్పుడపుడు సమస్యలు వచ్చిన కలిసి పోరాడండి.

చూస్తూ చూస్తూనే రాత్రి 12  అయింది. వెన్నెల్లో చంద్రుడ్ని చూస్తూ మళ్ళీ ఏ అమ్మాయిని అయినా ప్రేమిస్తే ఈసారి ఇంకొంచెం ఎక్కువ అర్థంచేసుకుంటా అని ఆ చంద్రుడికి మాట ఇచ్చాను.

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,