ఒక కవి పుట్టిన రోజు: A Short Poem About A Poet & Moment Of His Origin

 

Contributed by Pranavanath margala

ఆ రోజు

అందరూ వాళ్ళ మిత్రులతో , సోదరులతో , తోటివారితో వాళ్ళ పనిలో గజిబిజిగా ఉన్నవేళ …

నేను నాలా నాకై ఒంటరిగా , నాకే తెలియని ఏదో ఆలోచనలో పడినవేళ…

నీటి గట్టు పై నడుచుకుంటూ , మనసులో ఏదో తెలియని వ్యధతో వెళ్తున్నవేళ…

నీటిలో చేపలా కాకుండా , నీటిపై భూమిపై ఉండే కప్పలా కాకుండా , ఒక చిన్న చీమలా గట్టుపై కూర్చున్నవేళ…

ముందు నీరు , పైన ఆకాశం , పక్కన అడవి ఇవన్నీ చూసిన ఆ ఒక్క క్షణం నాలో ఉన్న ఆ చిన్న వ్యధ ఎంత అని ఆలోచిస్తున్నవేళ…

కనుమరుగైన ఆ వ్యధ , సంతోషంతో నిండిన నా ఎద , నాలో మార్పుతెచ్చిన ఆ క్షణం , ఎన్నడూ లేని ఉత్సాహాన్ని నింపినవేళ…

యుద్ధంలో కత్తి పట్టిన ఒక సైనికునిలా , తరగతి గదిలో పుస్తకం పట్టిన ఒక విద్యార్థిలా , కలాన్ని పట్టిన ఒక కవిలా మారినవేళ…

ఆరోజు నేను ఏరోజు మరువని రోజుగా మారిన వేళ…

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , ,