This Inspirational Short Poem Tells Us Why You Should Never Give Up On Your Life

 

Contributed By Rohith Sai

నీ అలజడి ప్రశాంతతగా మారడానికి ఒక్క క్షణం చాలు నేస్తమా.
నీ మాటలు చర్యలుగా మారడానికి ఒక్క క్షణం చాలు మిత్రమా.
నీ ఓటమి నీ గెలుపుగా మారడానికి ఒక్క క్షణం చాలు స్నేహమా.

ఆహ్ ఒక్క క్షణం, ఒక్క క్షణం, మరువలేని మధుర క్షణం
నీ ముందుకు రావాలి, ఒక జ్ఞాపకంగా మారాలి,
నీ సత్తువ ఏంటో చూపాలని కలగంటె సరిపోదు, అనుకుంటే జరిగిపోదు.

రెక్కలు ఎంత చిన్నవైన, నింగి ఎంత పెద్దదైన,
పక్షి చూడు సాగుతుంది తన గమ్యం చేరువరుకు.
మొప్ప లెంత చిన్నవైన, సంద్రం ఎంత పెద్దదైన,
చేప చూడు ఈదుతుంది తన గమ్యం చేరువరుకు.

పోరాడు, పోరాడు, సమస్యలతో పోరాడు,
పక్షిలా పోరాడు, చేపలా ఈదాడు.
చెండాడు, చెండాడు, యుద్ధంలో వీరుడిల,
నడి నెత్తి సుర్యుడిల, భయానికె ఒణుకు పుట్టెలా.

విశ్రమించ వద్దు నీ ఆశ తీరే వరుకు, నిరాశ పోయే వరుకు.
ఆగిపో వద్దు, నీ గెలుపు తగిలే వరుకు, ఆహ్ ఒక్క క్షణం కలిగే వరుకు.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , ,