ఓ చిన్న ఆశ – Musings Of A Boy About His Love & Dreams

 

Contributed by Gopinath Vaddepally

 

ఓ సాయంత్రం,
సముద్ర తీరాన నీతో కూర్చుని,
అలలు నా కాళ్ళని తాకుతుంటే,
నా కనులు నిన్ను చూస్తూ
ఏవో కలల అలల్లో మునిగిపోవాలని
ఓ చిన్న ఆశ..

 

విరగకాసిన వెన్నెల రాత్రిలో,
ఆ వెన్నెల ప్రతిబింబన్నీ
నీ కళ్ళలో చూస్తూ,
ప్రపంచం పెట్టిన హద్దుల్ని చేరిపేస్తూ,
నిన్ను నా కౌగిట్లో బందించి,
గుండెసడి ఎక్కువై తడారిపోయిన
నీ పెదాలపై నా పెదాలతో ముద్దుపెట్టాలని
ఓ చిన్న ఆశ..

 

ఎంత మందిలో ఉన్న
నీకోసం వెతికే నా కనులకి
నువు చూసే ఓ ఓరచూపు
మరో జన్మలో గత జన్మ జ్ఞాపకంగా
నన్ను వెంటాడుతుండాలని
ఓ చిన్న ఆశ..

 

గెలుపోటముల పరుగు పందెంలో
నేను ఓడిపోయి,
మనసు నిరాశలో మునిగిపోయి,
జీవితం ఏడరాయితే,
నీ ప్రేమ వర్షం కురిపించి,
నీ చిరునవ్వుతో
ఓ కొత్త ఆశ చిగురింపచేసి
కాలలు కొలవలేనంత దూరాన్ని
నా చెయ్యి పట్టుకుని నడవాలని
ఓ చిన్న ఆశ..

 

నా మాటలు విని
ఆశకి ఓ హద్దు ఉండాలి రా అన్నాడొకడు.
ఉందొ లేదో తెలియని రేపటి కోసం
ఈరోజు కష్టపడటంలో అర్థం ఉన్నప్పుడు
నా ప్రేమ ఇలా ఉండాలని
ఆశపడడంలో తప్పు లేదనిపించింది..

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , ,