This Joint Effort By Telugu NRIs & The Govt Of AP Is Revolutionising Government Schools In The State!

తెలుగు రాష్ర్టాలలోనే కాదు యావత్ భారతదేశమంతటా ఉన్న వ్యక్తులందరూ తమ చదువును ఒక గవర్నమెంట్ స్కూల్ నుండి ప్రారంభించినవారే.. మరి ఇప్పుడెందుకు అలాంటి వ్యక్తులు అక్కడి నుండి రావడం లేదు అంటే పరిస్థితులకు తగ్గట్టు కాంపిటీషన్ కు తగ్గట్టు, వ్యవస్థకు తగ్గుట్టు మన గవర్నమెంట్ స్కూల్స్ ఎదగకపోవడమే. ఇందుకు రకరకాల కారణాలు ఉండొచ్చు కాని ఈ ప్రస్తుతం అంతా రేపటికి గతంలోకి వెళుతుంది ఎన్.ఆర్.ఐ మిత్రులు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా..


NRI’s Help:
Abroadకి వెళ్ళిన మన తెలుగువారందరిలో కామన్ గా వారి మాటల్లో ఒక విషయం కనిపిస్తుంటుంది ‘సంపాదిస్తున్న డబ్బులో కొంత పేదల కోసం ఉపయోగించాలి అని. అలా చేయాలని ఉన్నా కాని వారికి టైం లేకపోవడం వల్లనో లేదా మరే ఇతర కారణం వల్లనో ఆగిపోతుంటారు’ వారి తపనను చూసి ఇందుకోసం గవర్నమెంట్ వారే ముందుకొచ్చి వారి సేవలను ఊపయోగించుకుంటున్నారు. ఇందులో మొదటగా గవర్నమెంట్ స్కూల్స్ లను అన్ని రకాలుగా Develop చేసే యజ్ఞంలో పాల్గొంటున్నారు. ఇప్పటికి 1000 గవర్నమెంట్ స్కూల్స్ Digital Schoolsగా మారిపోయాయి.. భవిషత్ లో పూర్తిగా 5,000 గవర్నమెంట్ స్కూల్స్ కార్పోరేట్ స్కూల్స్ కన్నా అన్ని రకాలుగా ఉన్నతంగా మార్చేందుకు ప్రణాళికలు సాగుతున్నాయి..



దలైలామా ఒక మాట చెబుతారు ‘నువ్వు సంపాదించిన డబ్బును ఖర్చుచేయకుండా పిసినారిగా దాచుకోవడం ఎంతటి మూర్ఖత్వమో, నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచకపోవడం కూడా అంతే మూర్ఖత్వం’. NRIలు డబ్బును మాత్రమే కాకుండా వారు సంపాదించిన మేధస్సును కూడా విద్యార్ధులకు పంచుతున్నారు.. ఈ స్కూల్స్ లో స్క్రీన్స్ ఏర్పాటుచేసి వివిధ టాపిక్స్ మీద ఫారెన్ లో ఉన్న ఎన్.ఆర్.ఐ లు ఇక్కడి పిల్లలకు గైడెన్స్ ఇస్తుంటారు. ఇలా స్పీచెస్ ఇవ్వడానికి కూడా కొంతమంది ప్రత్యేకమైన మేధావులను ఎంపికచేసి పిల్లలకు ఒక సొంత కుటుంబ సభ్యులుగా గైడెన్స్ ఇస్తున్నారు. ప్రతి క్లాస్ రూమ్ ని డిజిటలైజ్ గా మార్చడానికి రూ.1,50,000 ఖర్చవుతుంది. ఇందులో ప్రభుత్వం 70% భరిస్తే మిగిలిన 30% దాతల నుండి సేకరిస్తున్నారు. నిజంగా ఇది చాలా గొప్ప ప్రణాళిక, నిజాయితిగా దీనిని అనుకున్నట్టుగా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్న స్కూల్స్ లో ఉన్నతంగా అమలు చెయ్యగలిగితే లక్షలకు లక్షలు ప్రైవేట్ స్కూల్స్ కు కట్టలేని సామాన్యుడు ఉచితంగా ఉన్నత విద్యను తన పిల్లలకు అందించగలుగుతాడు..



If you wish to contribute, mail us at admin@chaibisket.com