A Harsh Note About How A Man’s Unintentional Selfishness Will Ruin Him

 

Contributed By Vasudeva Sri Vamsi

 

* ఎటు పయనం.. ఎటు పయనం..
అంతుచిక్కని నీ గమ్యం…
* కోతియుగం , రాతియుగం..
మారిన మన నవోదయం…
* ఏమిలాభమేమిసుఖం..
ఎక్కడ సంపూర్ణత్వం..
* “హమ్మయ్య పురోగమనం ”
అనులోపే తిరోగమనం…
* పెరుగుతున్న విజ్ఞానం ..
తరుగుతున్న స్వజ్ఞానం…
* ఎటు పయనం.. ఎటు పయనం..
అంతుచిక్కని నీ గమ్యం…
* అబలకి రక్షణ కొరత ..
చదువుకు జ్ఞానం కొరత…
* మంచి ఉన్నది 4 శాతం ..
చెడు ఉన్నది 5 శాతం..
మిగిలిన 90 శాతం గోడమీద పిల్లి వాటం…

* ఎటు పయనం.. ఎటు పయనం…
అంతుచిక్కని నీ గమ్యం…
* పోతున్నాం పోతున్నాం అజ్ఞానపు చరలలోకి..
పోతున్నాం పోతున్నాం మూర్ఖత్వపు గనులలోకి.
పోతున్నాం పోతున్నాం దిక్కెరగని బావి లోకి .
పోతున్నాం ఎక్కడికో స్వార్ధం అనే పథం లోకి.
నాశనమై పోతున్నాం మనకు మనం అంతుచిక్కని ఈ గమ్యం లోకి.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , , ,