Here Are Some Interesting Behind The Scenes Facts Of Our All Time Favorite Entertainer

 

This Post was originally written by Pulagam Chinnarayana garu on his facebook page.

 

‘నువ్వు నాకు నచ్చావ్!’

గుండె గుప్పెడంత…
ఊహ ఉప్పెనంత…
—————-///—————-

 

ఆ హాల్లో ప్రొడ్యూసర్ ‘స్రవంతి’ రవికిశోర్, డెరైక్టర్ విజయభాస్కర్ మొదలుకొని ఆఫీసుబాయ్ దాకా పది, పదిహేనుమంది ఉన్నారు.
త్రివిక్రమ్ డైలాగ్స్‌తో సహా కథ చెబుతున్నాడు.
కొందరు ముసిముసిగా నవ్వుతుంటే,
ఇంకొందరు పగలబడి నవ్వుతున్నారు.
ఈ రియాక్షన్స్ అన్నీ రవికిశోర్ కీన్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు.
‘శుభం’ అంటూ త్రివిక్రమ్ స్క్రిప్టు మూసేశాడు.
అక్కడున్నవాళ్లంతా త్రివిక్రమ్‌కి కంగ్రాట్స్ చెబుతున్నారు. విజయ్‌భాస్కర్ – త్రివిక్రమ్ ఇద్దర్నీ రవికిశోర్ హగ్ చేసుకున్నారు.
ఆ హగ్‌లోనే తెలిసిపోయింది… రవికిశోర్‌కు కథ ఎంత బాగా నచ్చేసిందో!
‘నువ్వే కావాలి’ సినిమా ఎండింగ్‌లో ఉండగానే విజయ్‌భాస్కర్, త్రివిక్రమ్‌లు ఇద్దరికీ అడ్వాన్స్ ఇచ్చేసి ‘‘నెక్ట్స్ సినిమా కూడా మనం కలిసి పనిచేస్తున్నాం’’ అనేశారు రవికిశోర్. ఆయనకు వాళ్లిద్దరూ అంత బాగా కనెక్టయిపోయారు. వాళ్లతో పనిచేస్తుంటే మనసుకు చాలా హాయిగా అనిపిస్తోంది.
ఇలాంటి ఫీలింగ్ చాలా కొంతమంది దగ్గరే కలుగుతుంది.
‘నువ్వేకావాలి’ రిజల్ట్ ఎలా ఉన్నా సరే, వాళ్లిద్దరితో కలిసి పని చేయాలని రవికిశోర్ డిసెడైడ్. అలాగని ‘నువ్వే కావాలి’ మీద డౌట్లు లేవాయనకు! ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడాయన!
ఆ నమ్మకమే నిజమైంది.
‘నువ్వే కావాలి’ ఇండస్ట్రీని ఊపేసింది. ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూనే ఈ ముగ్గురూ నెక్ట్స్ సినిమా పనిలో పడిపోయారు. 

హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఓల్డ్ అపార్ట్‌మెంట్. థర్డ్ ఫ్లోర్‌లో శ్రీస్రవంతీ మూవీస్ ఆఫీస్. అక్కడ టూ మంత్స్ కూర్చుని త్రివిక్రమ్ ‘నువ్వు నాకు నచ్చావ్’ స్క్రిప్టు రెడీ చేసేశాడు. దాన్ని మెయిన్ టీమ్ అందరికీ వినిపిస్తే హండ్రెడ్‌కి హండ్రెడ్ మార్క్స్ వేసేశారు. ఎప్పుడో దర్శకుడు కేవీ రెడ్డి గారి టైమ్‌లో ఇలా స్క్రిప్టు వినిపించేవారట.
రవికిశోర్‌కు కూడా ఆ పద్ధతి ఇష్టం. దీనికలా కుదిరింది!
ఆయన ఫుల్ హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే బ్రీఫ్ కేస్‌లో చెక్కు బుక్కులన్నీ తీసేసి, ఈ స్క్రిప్టే పెట్టుకుని తిరుగుతున్నాడాయన. ఖాళీ దొరికినప్పుడల్లా తనివితీరా చదువుకుంటున్నాడు.
కథ మొత్తం కంఠస్థం వచ్చేసిందాయనకు. ఏ హీరోతో అయినా చేయడానికి ఆయన రెడీ.
కానీ ఈ కథ ఎవరికో రాసిపెట్టే ఉండుంటుంది!
అవును… రాసిపెట్టి ఉంది… వెంకటేశ్‌కి!


 

రవికిశోర్‌కి ప్రొడ్యూసర్ డి.సురేశ్‌బాబు చాలా క్లోజ్. అక్కడ్నుంచీ ప్రపోజల్. ‘‘విజయ్‌భాస్కర్ – త్రివిక్రమ్‌లతో చేయడానికి మా వెంకటేశ్ రెడీ! మీకు ఓకేనా?’’ అంత పెద్ద హీరో పిలిచి డేట్లు ఇస్తానంటే, ఎవరు మాత్రం కాదంటారు?
రవికిశోర్‌కు బ్రహ్మాండంగా ఓకే.
త్రివిక్రమ్ వెళ్లాడు. కథ చెప్పాడు. వెంకటేశ్ ఫ్లాట్!
‘‘వాట్ ఎ లవ్ లీ క్యారెక్టైరె జేషన్’’ అనుకున్నాడు. కానీ వెంకటేశ్‌కో డౌట్!
సెకండాఫ్ మొత్తం ఓ ఇంట్లోనే కథ నడిచిపోతోంది. ఆడియన్స్‌కి కొంచెం రిలీఫ్ కావాలి కదా!
అవును నిజమే! ఇక్కడ రిలీఫ్ కావాలి. గుడ్ సజెషన్.
ఎంతైనా సీనియర్ సీనియరే!
‘మిస్టర్ బీన్’ ఇన్‌స్పిరేషన్‌తో ఓ క్యారెక్టర్ క్రియేట్ చేసి, అతణ్ణి హీరో హీరోయిన్లకు తారసపడేలా చేస్తే…?
త్రివిక్రమ్ అదే చేశాడు.
బ్రహ్మానందం లాంటోడు ఈ క్యారెక్టర్ చేస్తేనా…?
లాంటోడేంటి? బ్రహ్మానందమే చేస్తాడు. చేయాలి కూడా! ఓకే అన్నాడు కూడా!
క్యారెక్టర్స్ అన్నిటికీ స్టార్స్ ఫిక్స్‌డ్.
ఓన్లీ టూ క్యారెక్టర్స్ బ్యాలెన్స్.
ఒకటి – హీరోయిన్ పాత్ర.
రెండోది – హీరోయిన్ ఫాదర్ పాత్ర.

 

ఇక్కడ ప్రొడ్యూసర్, డెరైక్టర్‌లిద్దరికీ ఒకటే ఛాయిస్. ప్రకాశ్‌రాజ్! అతనైతే ఈ హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్లిపోతుంది.
కానీ ప్రకాశ్‌రాజ్ ఆ టైమ్‌లో ఫుల్ బిజీలో ఉన్నాడు. దానికి తోడు ఫుల్ ట్రబుల్స్‌లో కూడా ఉన్నాడు.
‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ వాళ్లు అతని మీద బ్యాన్ పెట్టారు.
ప్రకాశ్‌రాజ్‌ను తెలుగు సినిమాల్లో పెట్టుకోవడానికి వీల్లేదు.
రవికిశోర్‌కి కోపం వచ్చింది. ‘‘నా క్యారెక్టర్‌కి అతనే కావాలి. నేను అతణ్ణే పెట్టుకుంటాను.’’
పరిస్థితి కొంచెం హాట్ హాట్‌గానే ఉంది. నాజర్, రఘువరన్ లాంటి వాళ్లతో ఈ ఫాదర్ క్యారెక్టర్ చేయించేయొచ్చు. కానీ, ప్రకాశ్‌రాజ్ అయితేనే ఆ డెప్త్ వస్తుంది.
అందుకే ఓ పని చేస్తే?
ప్రకాశ్‌రాజ్ సీన్స్ అన్నీ పెండింగ్‌లో పెట్టి, మిగతా వెర్షన్ కంప్లీట్ చేసేస్తే? బాగానే ఉంది కానీ, హీరోయిన్ తేలడం లేదు.
త్రిష… ఇంకెవరో… ఎవరో… చాలా ఆప్షన్స్.
కానీ ఫ్రెష్ ఫేస్ అయితే నే బాగుంటుంది. విజయభాస్కర్ ముంబయ్ వెళ్లాడు.
మోడల్ కో-ఆర్డినేటర్స్ దగ్గర చాలామంది అమ్మాయిల స్టిల్స్ చూశాడు.
వాళ్లల్లో ఒకమ్మాయి నచ్చేసింది.
‘పాగల్‌పన్’ అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా కూడా చేసింది.
పేరు – ఆర్తీ అగర్వాల్.
కానీ ఇప్పుడు న్యూయార్క్‌లో ఉంది. నో కాంటాక్ట్.
మామూలుగా అయితే ఆ అమ్మాయిని అక్కడే వదిలేసేవారు.
అయితే, ఆ పాత్ర ఆమెకే రాసిపెట్టినట్టుంది. అందుకే న్యూయార్క్‌లో ఆమె గురించి వేట మొదలైంది.
డి.సురేశ్‌బాబు ఫ్రెండొకరు న్యూయార్క్‌లోనే ఉంటాడు. అతని ద్వారా ట్రై చేస్తే దొరికేసింది.
ఆర్తి వచ్చీ రావడంతోనే షూటింగ్ స్టార్ట్.
సినిమా మొత్తం దాదాపు హీరోయిన్ ఇంట్లోనే! అందుకే నానక్‌రామ్‌గూడా రామానాయుడు స్టూడియోలో ఆర్ట్ డెరైక్టర్ పేకేటి రంగాతో హౌస్‌సెట్ వేయించేశారు. 60 లక్షల ఖర్చు.


 

సీన్లు … సాంగ్స్… షూటింగ్ చకచకా సాగిపోతోంది. అంతా పర్‌ఫెక్ట్ ప్లానింగ్.
న్యూజిలాండ్‌లో రెండు పాటలు తీయాలి.
అదీ నెక్ట్స్ షెడ్యూల్‌లో!
ఈలోగా అక్కడ నుంచి ఫోన్!
‘‘సీజన్‌లో ఛేంజ్ ఉంది. మీరొచ్చే టైమ్‌కి గ్రీనరీ ఉండదు. వస్తే ఇప్పుడే రావాలి’’.
ఇక్కడేమో 10 – 15 మంది ఆర్టిస్టులతో షూటింగ్ జరుగుతోంది. ఇది అర్ధంతరంగా వదిలేసి, న్యూజిలాండ్ వెళ్తే మళ్లీ డేట్లు దొరకడం కష్టం.
రవికిశోర్ ఒకటే అన్నారు. ‘‘మనుషుల డేట్లు ఎలాగైనా తీసుకోవచ్చు. ప్రకృతి డేట్లు మన చేతిలో ఉండవు.’’
షెడ్యూల్ ఆపేసి మరీ, ఛలో న్యూజిలాండ్!
ఫ్లయిట్‌లో ఆ రెండు పాటలు వింటూనే ఉంది ఆర్తి. తెలుగు అస్సలు రాకపోయినా విని, విని బట్టీ వచ్చేసిందామెకు! న్యూజిలాండ్‌లో దిగగానే ఆ పాటలు కూడా పాడేయడం మొదలుపెట్టింది.
తీరా అక్కడికి వెళ్లాక వెంకటేశ్‌కి ఫుల్ ఫీవర్. అయినా వచ్చాడు. ఆ ఫీవర్‌తోనే షూటింగ్ చేసేశాడు.
న్యూజిలాండ్ నుంచి సరాసరి చెన్నైలో ల్యాండింగ్. అక్కడ ‘ఎం.జి.ఎం అమ్యూజ్‌మెంట్ పార్క్’లో షూటింగ్.
వెంకటేశ్, ఆర్తీ అగర్వాల్, బ్రహ్మానందం, ‘కళ్లు’ చిదంబరం, బేబీ పింకీలపై కామెడీ సీన్స్.
అక్కడ నుంచీ మళ్లీ ఊటీ.
త్రివిక్రమ్ స్క్రిప్ట్ మాహాత్మ్యమో, రవికిశోర్ ప్లానింగ్ చిత్రమో కానీ షూటింగ్ చాలా స్మూత్‌గా జరిగిపోతోంది. ‘పిక్‌నిక్’ అనేమాట అందరూ వాడేస్తుంటారు. కానీ, ఇక్కడ మాత్రం అది నిజం. 64 రోజులు 64 క్షణాల్లా గడిచిపోయాయి. ఇంకా ప్రకాశ్‌రాజ్ రిలేటెడ్ సీన్స్ ఒక్కటే బ్యాలెన్స్. వీళ్లకు అదృష్టం కలిసొచ్చింది. ఇక్కడ పరిణామాలన్నీ మారిపోయాయి. మునుపటి హీట్ లేదు. ప్రకాశ్‌రాజ్ నిరాహారదీక్షకు దిగడంతో అన్ని సమస్యలూ కొలిక్కి వచ్చేశాయి. ఇప్పుడు ప్రకాశ్‌రాజ్‌పై బ్యాన్ కూడా తీసేశారు. ఆ న్యూస్ వచ్చిన మరుక్షణం ప్రకాశ్‌రాజ్ ‘నువ్వు నాకు నచ్చావ్’ సెట్‌లో ఉన్నాడు.
కంటిన్యూస్‌గా 17 రోజులు వర్క్ చేశాడు. హమ్మయ్యా… సినిమాకు గుమ్మడికాయ కొట్టేయొచ్చా!


 

ఇప్పుడు అసలు పనంతా మ్యూజిక్ డెరైక్టర్ కోటి చేతిలో ఉంది.
బ్రహ్మాండంగా రీ-రికార్డింగ్ చేయాలి. ఇదే టార్గెట్. నో టైమ్ లిమిట్.
ట్వంటీడేస్ తర్వాత…
రవికిశోర్, విజయ్‌భాస్కర్ ఫైనల్ అవుట్‌పుట్ చూశారు.
కొన్ని ఎపిసోడ్స్‌లో ఆర్.ఆర్ అంత ఎఫెక్టివ్‌గా లేదు. రవికిశోర్ ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారు.
కోటికి అర్థమైపోయింది. మళ్లీ రికార్డింగ్ థియేటర్‌లో కూర్చున్నాడు.
స్మాల్ ఛేంజెస్.
99 కి 100కి ఒక్కటే కదా తేడా!
అదిప్పుడు ఫుల్‌ఫిల్ అయిపోయింది.
రవికిశోర్ ఈ సారి చూసి కోటిని గట్టిగా హగ్ చేసుకున్నారు. ఆ హగ్‌లోనే రిజల్ట్ తెలిసిపోయింది.


 

2001 సెప్టెంబర్ 6
3 గంటల 12 నిమిషాలు ఓపిక పడితే తప్ప రిజల్ట్ తెలియదు.
అవును… ఈ సినిమా నిడివి అంతే!
బయటికొచ్చిన వాళ్లంతా ‘‘సినిమా బాగుంది కానీ, లెంగ్త్ ఎక్కువైపోయింది’’ అంటున్నారు. డిస్ట్రిబ్యూటర్లు ఖంగారు పడిపోతున్నారు. రవికిశోర్ మాత్రం చాలా తాపీగా ఉన్నారు. ఆయనకు ఈ సినిమా రిజల్ట్ మీద పూర్తి భరోసా.

 

ఆ టైమ్‌లో వెంకటేశ్‌కిది డిఫరెంట్ ఎటెంప్ట్. దానికి తోడు సినిమాలో నో ఫైట్స్. ఫ్యాన్స్‌లో కొంత డైలమా ఉంటుంది. నాలుగు రోజులు ఆగితే అంతా సెట్ అయిపోతుంది.
అవతలేమో పెద్దపెద్దవాళ్లు కూడా ఫోన్లు చేసి, అరగంట సినిమా ఎడిట్ చేసేయమంటున్నారు. ముఖ్యంగా సుహాసిని ఎపిసోడ్ మొత్తం డిలీట్ చేయమంటున్నారు.
రవికిశోర్ మాత్ర ం మొండిగా ఉన్నారు. ఒక్క షాట్ కూడా తీసేది లేదు. ఈ సినిమా సూపర్‌హిట్… అంతే.
ఎస్… వన్ వీక్ తర్వాత రిజల్ట్ అదే! అందరూ ఈ సినిమాను ‘నువ్వు నాకు నచ్చావ్’ అనడం మొదలుపెట్టారు.

 

‘స్రవంతి’ రవికిశోర్ టేబుల్ మీద ‘నువ్వు నాకు నచ్చావ్’ స్క్రిప్టు ఎప్పుడూ ఉంటుంది.
అదో ఇన్‌స్పిరేషన్ ఆయనకు! జాబ్ శాటిస్‌ఫేక్షన్ … జేబు శాటిస్‌ఫేక్షన్ కలగాలంటే స్క్రిప్టే పరమావధి అనే విషయం ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటుంది!
…………………………

వెరీ ఇంట్రస్టింగ్…
—————————————-
? వెంకటేశ్ పారితోషికం మినహాయిస్తే, ఈ సినిమాకైన బడ్జెట్ నాలుగున్నర కోట్ల రూపాయలు.
? ఈ సినిమాకు ఆర్తీ అగర్వాల్ పారితోషికం పది లక్షలు.
?తమిళంలో ఈ చిత్రాన్ని విజయ్‌తో రీమేక్ చేశారు. యావరేజ్. కన్నడంలో మాత్రం హిట్.
? ‘ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని…’ పాట కోసం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి 60 పల్లవులు రాశారు. ఫైనల్‌గా ఫస్ట్ రాసిన పల్లవి ఓకే అయ్యింది.
? ‘బంతి’ క్యారెక్టర్‌తో సునీల్‌కి మంచి బ్రేక్ వచ్చింది.

 

హిట్ డైలాగ్
? మనం సంతోషంగా ఉన్నప్పుడు వెన్ను తట్టేవాళ్లు, బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చేవాళ్లు లేనప్పుడు ఎంత సంపాదించినా వేస్ట్!
………………….


 

Here is an another article, which discuss emotional side of Nuvvu Naku Nachav. Click here to read


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , ,