Here’s Everything About ‘Nirmaan’ – An NGO That’s Executing Educational & Livelihood Development Initiatives!

 

“నిన్ను నీవు విద్యార్థిగా భావించి నేర్చుకోవడానికి సిద్ధపడితే ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణి, ఆఖరికి చీమ కూడా నీకు గురువు అవుతుంది”.

 

నిర్మాణ్” సంవత్సర బడ్జెట్ ఎంతో తెలుసా..? అక్షరాల 5కోట్ల రూపాయలు. అవును.. ఐదు కోట్లు అంటే ఒక సాధారణ వ్యాపార సంస్థ వార్షిక ఆదాయంతో సమానం అని చెప్పుకోవచ్చు. ఇందులోని ప్రతిఒక్క రూపాయి(ఉద్యోగస్తులు కూడా) దాతలు తమతో పాటు జీవిస్తున్న సమాజం కోసం అందించినవే. దేశంలోని ఎన్నో స్వచ్చంద సంస్థలు ఉన్నాయి వాటన్నింటి కన్నా ఇంత పెద్ద మొత్తంలో నిర్మాణ్ ని నమ్మారంటేనే వారి నిజాయితీని, సమాజం పట్ల వారి ప్రేమను పరిపూర్ణంగా అర్ధం చేసుకోవచ్చు. దేశానికి సేవ చేయాలంటే రాజకీయాలలోకి రావాల్సిన అవసరం లేదు, పెళ్లి చేసుకోకుండా కుటుంబాన్ని త్యాగం చేయాల్సిన పని లేదు. మన స్వంత జీవితాన్ని అనుభవిస్తూనే, అనవసర ఖర్చులను తగ్గించుకుని మన వంతుగా కుటుంబం లాంటి సమాజానికి ఆసరాగా నిలిచినా అది కూడా గొప్ప దేశ సేవనే. ఇలాంటి కాన్సెప్ట్ తోనే నిర్మాణ్ సభ్యులు తాము మాత్రమే కాక మనల్ని కూడా దేశ సేవలో భాగం చేస్తున్నారు.నిర్మాణ్ ఎలా ప్రారంభమయ్యింది.?
అది 2005వ సంవత్సరం.. నాడు ఎందరో విద్యార్థులకు భగవంతుడు ఇచ్చిన తండ్రి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా వెలుగొందుతున్నారు. దేశంలోని ఎన్నో విద్యాసంస్థలలో పర్యటిస్తూ విద్యార్థులకు దిశా నిర్ధేశం చేస్తున్నారు. “అన్ని రంగాలలో ఉత్తమ ఫలితాలను రాబడుతూ మనం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి” అనే రామబాణం లాంటి మాటలు నేషనల్ యూనివర్సిటీ లో ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న 10మంది విద్యార్థులను బలంగా తాకింది. ఏదైనా చెయ్యాలి, ఎలా ఐనా సంఘాన్ని బలంగా తయారు చెయ్యాలి అని తపన పడేవారు. స్వతంత్ర పోరాటంలో భారతీయులందరు ఎలా ఒక్కటై బ్రిటిష్ వారిపై ఎదురుతిరిగి పోరాడి గెలిచామో అంతే స్థాయిలో ఈ విపత్కర పరిస్థితులలో కూడా అదే పోరాట స్పూర్తితో ఉద్యమం చెయ్యాలని సంకల్పించుకున్నారు.మొదటి విజయం:
సుదీర్ఘంగా పోరాడవల్సిన యుద్ధంలో “మొదటి గెలుపు” ఎంతో సంతృప్తినిస్తుంది, జీవితాంతం గుర్తుండిపోతుంది. యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజులలో తమ యూనివర్సిటీ పక్కన ఉన్న గ్రామంలో రోజువారి కూలీలే ఎక్కువ. పెద్దలు మాత్రమే కాదు చిన్నపిల్లలు సైతం పాఠశాలకు వెళ్లకుండా చిన్నతనం నుండే పనులు చేసుకునే దౌర్భాగ్యపు జీవితాలను గడుపుతుండేవారు. చదువు లేకపోవడంతో తీసుకున్న అప్పుకు వడ్డీ వ్యాపారస్తులు అడ్డంగా దోచుకునేవారు. ముందు మన ఉద్యమం ఇక్కడి నుండే ప్రారంభం అవ్వాలని చెప్పి విద్యార్ధులు చదువు చెప్పడం మొదలు పెట్టారు. మొదలు పెట్టాక, ఊరిని రీసెర్చ్ చేశాక తెలిసింది ఈ ఊరిని బాగుచేయాలంటే 10మంది సరిపోరని ఇంకా చాలా చేతుల సహాయం అవసరమని. యూనివర్సిటీలో పరిస్థితిని వివరించి ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్లు, టీచర్స్ తో సహా వందల మంది ఆ మీటింగ్ కు హాజరయ్యారు. అవును.. దేశాన్ని మార్చడానికి ప్రతి ఒక్కరిలో తపన ఉంది కాని వారికి సరైన ప్లాట్ ఫామ్ దొరకడం లేదని గ్రహించారు. ఆరోజు వారందరి సహాయం 6,000. ఇది కేవలం నెల వారి బడ్జెట్. ఒక్కో రూపాయి సరిగ్గా వినియోగించుకుంటూ ఆ ఊరిని 2సంవత్సరాలలో ఉహకందనంత అభివృద్ధి చేశారు. ఇంజినీరింగ్ తర్వాత విద్యార్థులు బయటకు వెళ్ళినా కాని వారి ప్రదేశంలోనే విద్యార్థులను, ప్రజలను దేశ సేవలో భాగస్వామ్యం చేయడం మొదలుపెట్టారు.“ప్రధానమంత్రి నుండి వార్డ్ కౌన్సెలర్ వరకు, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వారి పిల్లలను ప్రభుత్వ స్కూల్స్ లో, కాలేజీలలో చదివిస్తూ, ఆరోగ్య సమస్యలకు ప్రభుత్వ హాస్పిటల్ లో మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే చట్టం తీసుకువస్తే సంవత్సరంలో ప్రయివేట్ హాస్పిటల్స్, స్కూల్స్ కంటే దీటుగా మన కాలేజీలు హాస్పిటల్స్ మారిపోతాయి”.


ప్రభుత్వ పాఠశాలల దత్తత:
ఇందులో గవర్నమెంట్ స్కూల్స్ అని మాత్రమే కాకుండా ఆర్ధికంగా కాస్త తక్కువ స్థాయిలో ఉన్న స్కూల్స్ ని కూడా వీరు దత్తత తీసుకుంటారు. దేశ వ్యాప్తంగ ప్రతి సంవత్సరం 500 పాఠాశాలలను వీరు సందర్శించి స్కాలర్ షిప్స్ ఇవ్వడం, కెరీర్ కౌన్సెలింగ్ ఇవ్వడం చేస్తుంటారు. సేఫ్ డ్రింకింగ్ వాటర్, ప్లే గ్రౌండ్, చక్కని లైబ్రరీ, టీచర్స్ కు మరింత ట్రైనింగ్ ఇస్తూ ఇప్పటికి 6 రాష్టాలలో 50 పాఠశాలల ను కార్పొరేట్ స్కూల్స్ లా మార్చేశారు. ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్స్ అంటే భయపడేవారు ఇప్పుడు కేవలం గవర్నమెంట్ స్కూల్స్ లో మాత్రమే జాయిన్ అవ్వాలని చూస్తున్నారు ఇది నిర్మాణ్ విజయం. ఇంత చేస్తున్నా గాని ప్రతి సంవత్సరం కేవలం మన తెలుగు రాష్ట్రాలలోనే వేల సంఖ్యలో ప్రభుత్వ స్కూల్స్ మూత పడిపోతున్నాయి ఇది విజయం కన్నా బాధ కలిగించే విషయం. మరింత సహాయాన్ని చెయ్యాల్సిన అవసరం ఉంది.


ఉపాధి శిక్షణ:
1.అవంతి:
మన మహిళలలో గొప్ప శక్తి ఉంది, అది వారు తెలుసుకునేలా ఇంకా దానిని సరిగ్గా ఉపయోగించుకునేలా వీరి ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పటికి వేలమంది మహిళలకు ఇందులో బెస్ట్ ట్రైనింగ్ అందించారు. ఇవే కాకుండా Satellite Skill – Centers, Incubation Centers, Threads Of Hope, Vidya (Help Line:18004252425), Youth Empowerment Program, Scholarship & Mentor-ship Program లాంటి 25ప్రోగ్రామ్స్ చేస్తూ ఇండియాలోని 6రాష్ట్రాలలో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్, గోవా, ఛతీస్ ఘడ్ లో వీరి టీం(800వాలంటీర్స్) వీరి సేవలు, టీం ఉదృతంగా పనిచేస్తుంది.

2. విద్యార్ధుల కోసం:
ప్రభుత్వ విద్యాసంస్థలకు భయపడి ప్రయివేట్ లో జాయిన్ అయితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది అక్కడ. ఫీజుల మీద ఉన్న ప్రేమ విద్యార్థుల మీద లేకపోవడంతో స్టూడెంట్స్ కు సరైన స్కిల్స్ లేక వెనుకబడిపోతున్నారు. నిర్మాణ్ ఇందులోను తమ శక్తిని వెచ్చించింది. దేశ వ్యాప్తంగా స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఉపాధి శిక్షణను అందిస్తున్నారు. స్టూడెంట్స్ అందరిని ఒకచోట కూర్చోబెట్టి బోధించడం కాకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ ని నిశితంగా పరిశీలించి వీరు ఎలాంటి రంగంలో రాణించగలరు అని భావించి అందుకు తగ్గ శిక్షణ అందించడం వీరి ప్రత్యేకత. శిక్షణ తీసుకున్న వారిలో ఇప్పటికీ 90% పైగా ఉద్యోగం సాధించారంటే వారి ప్రతిభ స్థాయిని అర్ధం చేసుకోవవచ్చు.


#GiveBack:
నిర్మాణ్ ఈ మధ్యనే ఈ కొత్త యుద్ధాన్ని మొదలుపెట్టింది. మన ఇప్పటి ఈ జీవితాన్ని అనుభవించడానికి మనకు చదువు చెప్పిన పాఠశాల, పెంచిన ఊరు కారణం. ఇప్పుడు ఈ రెండు కష్టకాలంలో ఉన్నాయి వీటిని ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీరు ఒక సాధారణ ఉద్యోగి ఐనా, ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ ఐనా, లేదంటే ఒక ఎన్.ఆర్.ఐ ఐనా గాని మీకు మీ ఊరిని, పాఠశాలను బాగుచెయ్యాలనుకుంటే మేము మీతో కలిసి మీ ఊరిని, పాఠశాలను మార్చడానికి సిద్ధంగా ఉన్నాము అనేది దీని కాన్సెప్ట్. మీరు మీ స్కూల్ కోసం, ఊరికోసం time, talent, treasure ఈ మూడింటిలో ఏది ఇచ్చినా నిర్మాణ్ వారు వారి స్కూల్స్, ఊరిని బాగుచెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికి సామాన్యులు మాత్రమే కాదు. ఎంతోమంది ఎన్.ఆర్.ఐ, ఐఎస్ ఆఫీసర్స్ ముందుకువస్తున్నారు.


For more details or joining hands with Nirman, Contact them:
WhatsApp: 8897347947. Mail ID: contact.nirmaan@gmail.com

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , ,