Symptoms, Prevention & Backstory .. Here’s Everything About The Deadly Nipha Virus Outbreak!

 

నిపా వైరస్.. ఒకప్పుడు ఇతర దేశాలను భయపెట్టిన ఈ మహమ్మారి ప్రస్తుతం మన దేశాన్ని వణికించబోతుంది. “నిపా వైరస్” వల్లనే ముగ్గురు చనిపోయారు అని నిర్ధారించుకునే లోపే ఈ వైరస్ ప్రాణాలను బలికొనడం మొదలుపెట్టింది. కేరళలో ఇప్పటి వరకు 12 మందిని ఈ వ్యాధి కబలిస్తుండడంతో వారి పరిస్థితి అత్యంత విషమంగా మారింది. మరో 25మంది ఇదే వైరస్ లక్షణాలతో హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం కేరళలో ఏ ఒక్కరికి జలుబు చేసిన, జ్వరం వచ్చినా, చివరికి కాస్త నీరసంగా ఉన్నా కాని తమకూ “నిపా” వ్యాధి సోకిందేమోనని భయం భయంగా బ్రతుకుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జాబితా ప్రకారం ప్రపంచంలో అత్యధిక ప్రాధాన్యత కలిగిన మొదటి పది వ్యాధులలో ఇది కూడా ఉండడం, అత్యధిక జనాభా కలిగిన మనదేశానికి ముప్పు పొంచి ఉందనేది కఠిన వాస్తవం.


అసలు ఎక్కడ పుట్టింది.?
1998లో మలేషియా దేశంలోని “సుంగాయ్ నిపా” అనే మారుమూల గ్రామంలో కొంతమంది గ్రామస్థులకు తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడడం, తలనొప్పి ఉండడంతో హాస్పిటల్ లో చేరడం ట్రీట్మెంట్ అందిస్తున్న కాని కోమాలోకి వెళ్లి 100 మందికి పైగా మృతి చెందడంతో ఈ వ్యాధి మీద ప్రత్యేక పరిశోధనలు చేశారు. ఫ్రూట్ బ్యాట్ పెట్రో పొడిడే జాతికి గబ్బిలాలు మొదటిసారి ఈ వ్యాధి వ్యాపించడానికి కారకాలు. ఇవి కొరికి తినేసిన పండ్లు, కాయలు, ఇతర ఆహార పదార్ధాలను తింటే ఇతరులకూ సోకింది. సింగపూర్, బంగ్లాదేశ్ లోనూ ఈ వ్యాధి బారినపడి వందలాది మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ వ్యాధి పందుల వల్ల కూడా వ్యాప్తి చెందుతుందని తెలుసుకున్న మలేషియా ప్రభుత్వం హుటాహుటిన ఒకేసారి పది లక్షల పందుల్ని చంపేశారు.


ఈ వ్యాధి లక్షణాలు:
కేరళలో మృతిచెందిన వారి ఇంటి పరిసరాలలో గబ్బిలాలు కొరికిన పండ్లు కనిపించాయి. నిపా వైరస్ సోకిన వారికి తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు, తల తిరగడం, ఒక్కోసారి మతి స్థిమితం కోల్పోయినట్టు అనిపించడం, ఊపిరి తీసికోవడానికి ఇబ్బందులు పడడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. సరైన ట్రీట్మెంట్ అందకుంటే 24 గంటలనుండి 48 గంటలలోపు మృతిచెందే అవకాశం ఉంటుంది. దీనిని ముందుగానే నివారించే మందులుకాని, ఇంజెక్షన్స్ కాని రాలేదు. ఈ వైరస్ ఒకరి నుండి మరొకరికి చేరుతుంది. ఈ వైరస్ శరీరంలోకి వెళ్లినవారిలో 70% మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. గబ్బిలాలు, పందులు, మనుషులు ఈ వ్యాధికి వాహకాలు. అందుకే ఈ వ్యాధి సోకిన వారికి ప్రత్యేక గదిలో ట్రీట్మెంట్


నర్స్ మరణం:
కేరళ కోజికోడ్ పెరంబర ఆస్పత్రిలో నిపా వైరస్ లక్షణాలతో కొంతమంది హాస్పిటల్ లో చేరారు. 31 సంవత్సరాల లినీ పుతుస్సేరి అనే నర్స్ వారి ట్రీట్మెంట్ లో భాగంగా అక్కడే పనిచేస్తుంది. ఐతే నర్స్ లినీ కు కూడా ఈ వైరస్ సోకింది. ఏ హాస్పిటల్ లో ఐతే వైరస్ వ్యాధి గ్రస్తులకు ట్రీట్మెంట్ అందించిందో అదే హాస్పిటల్ లో పేషేంట్ గా అడ్మిట్ అయ్యింది. ‘‘ సాజీ(భర్త).. నేను ఇక బతకనని తెలుసు.. ఇక నిన్ను కలుసుకోలేనేమో.. మన ఇద్దరు పిల్లలు జాగ్రత్త’’. అంటూ రాసిన ఉత్తరం కుటుంబ సభ్యులకు రాసిన ఉత్తరం హృదయవిధారకమైన సంఘటన. లినీ మరణం తరువాత కూడా వైరస్ ఇతరులకు సోకుతుందని కుటుంబ సభ్యులు లేకుండానే లినీ కి దాహనసంస్కారాలు చేశారు.


 


జాగ్రత్తలు:
ఈ వైరస్ సోకిన వారి ప్రాణాలను రక్షించడం అత్యంత కష్టతరం కనుక ముందు గానే కనీస జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. అవి ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అని అందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
గబ్బిలాలు ఆహారంగా మామిడి పళ్ళు, జాక్ ఫ్రూట్స్, రోజ్ ఆపిల్స్ మొదలైనవి తీసుకుంటుంటాయి. అందుకే బయట కొనే పళ్ళు, కూరగాయలను పరిశుభ్రంగా కడిగి ఆ తర్వాతనే వాటిని తీసుకోవాలి. బయటకు వెళ్లిన ప్రతిసారి కూడా dettol, lifeboy మొదలైన hand wash తో చేతులను కడుక్కోవాలి.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , ,