This Short Story Explains The Misunderstandings Between A Newly Married Couple

 

Contributed By Pranaya

మూడు నెలల తరువాత ఇంటికొచ్చా.. కోపంతో..

ఇంట్లో అడుగు పెడుతూనే నాన్న అరుపు అమ్మ పై!! “ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ ఉంచకుండా రోజంతా ఇల్లు సర్దుతావ్ ఇప్పుడు నా ఫైల్ ఒకటి కనపడట్లే అని

ఆఫీస్ లో నే ఉందనుకుంటా మార్చిపోయుంటారు ముందు అక్కడ వెతకండి” అని అమ్మ

నాకు సలహాలు ఇవ్వకు అని గట్టిగా అన్నాడు నాన్న. ఇంతలో నన్ను గమనించి ఎలా ఉన్నావ్ రా అల్లుడుగారు ఎక్కడ అని అడిగారు. ఆఫీస్ లో కొంచెం వర్క్ ఉంది తరవాత వస్తా అన్నాడు అని అమ్మ వంక చూసా. సరే ఆఫీస్ కి టైం అవుతుంది సాయంత్రం మాట్లాడ్తా అని వెళ్ళిపోయాడు.

ఫ్రెష్ అయ్యి నేను, అమ్మ టిఫిన్ చేసాం. కాసేపు అమ్మ ఒళ్ళో పడుకున్న.

 

నేను: అమ్మ ఎందుకు నాన్న నీ తప్పు లేకపోయినా నిన్ను తిడితే పడతావ్.

అమ్మ: ముందు నువ్వు మీ ఆయన తో ఎం గొడవ అయ్యిందో చెప్పు అంది.

వెంటనే ఒళ్ళో నుండి లేచి

నేను: అదేంటి నీకెలా తెలిసింది.

అమ్మ: నేను మీ అమ్మ ని. ఇంట్లో అడుగు పెట్టగానే వచ్చేసా అని, భయటకెళ్తే వెళ్తున్నా అని, ప్రతిదానికి ఫోన్ చేసి చెప్పే నువ్వు ఇంటికొచ్చి ఇంత సేపైనా అల్లుడు గారికి ఫోన్ చేయలేదు. ఆయన కూడా చేయలేదు. అప్పుడే అర్థం అయింది ఎదో జరిగిందని.

నేను: అవును ఆయన కి ఆఫీస్ లో వర్క్ ఎక్కువైంది. ఎదో ప్రాజెక్ట్ అని నన్ను అస్సలు పట్టించుకోట్లేదు. ఈ శనివారం ఇద్దరం కలిసి రావాల్సింది ఇప్పుడు నేను ఒక్కదాన్నే వచ్చాను. అడిగితే మనకోసమే కదా కష్టపడుతుంది అంటాడు. నేను సంతోషంగా లేనప్పుడు అవన్నీ ఎందుకు. నాకు లేదా ఆఫీస్ లో వర్క్. అందుకె తను వచ్చి తీసుకెళ్లే వరకు రాను అని చెప్పి వచ్చేసా. నన్ను అస్సలు అర్థం చేస్కోట్లేదు.

 

అమ్మ: నువ్వు తనని ఎంత అర్థం చేస్కున్నావ్.

నేను: అదేంటి అలా ఆడిగావ్ అని ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాను.

అమ్మ: చెప్పు..

ఇంతలో నాన్న వచ్చాడు.

నేను: ఎప్పుడు లంచ్ కి ఇంటికి రావు కదా నాన్న ఈరోజు ఇంటికోచ్చావెంటి అని అడిగా

నాన్న: మీటింగ్ తొందరగా అయిపోయింది. ఆఫీస్ లో రమేష్ వాళ్ళ అమ్మాయి పుట్టిన రోజంట స్వీట్స్ ఇచ్చాడు. ఇవి మీ అమ్మ కి ఇష్టం కదా అందుకే తీసుకొచ్చా. ( అని అమ్మ వైపు చూసాడు )

తిని వెళ్ళిపోయాడు నాన్న.

అమ్మ: నేను అడిగిన ప్రశ్నకి ఇంకా సమాధానం చెప్పలేదు నువ్వు

నేను: ఎం చెప్పలో తెలియక మౌనంగా ఉన్న

అమ్మ: చూసావా నీ దగ్గర సమాధానం లేదు. మనం బాగా అర్థం చేసుకున్న మనిషిలో కూడా అర్థం కాని ఇంకో మనిషి ఉంటాడు. చూసావ్ గా మీ నాన్న ని. పొద్దున కోపంగా ఉన్నాడు అందుకే అలా మాట్లాడారు. కోపం తగ్గగానే స్వీట్స్ తీస్కొచారు. అదే కోపంగా ఉన్నపుడు నేను కూడా ఒక మాట అంటే మాట మాట పెరిగి గొడవ పెద్దది అయ్యేది. కోపం వచ్చినపుడు ఒక్క క్షణం ఆలోచించి కాసేపు ఓపికగా ఉంటే అన్ని సర్దుకుంటాయ్. భార్య భర్తల లో ఒకరికి కోపం ఉంటే ఒకరు శాంతంగా ఉంటారు, ఒకరు ఎక్కువగా మాట్లాడే వాళ్ళు అయితే ఒకరు అస్సలు మాట్లాడరు, ఒకరు సర్దుకుపోయే అలవాటు ఉంటే ఒకరు ఏ విషయంలో కూడా సర్దుకుపోరు, ఒకరు బాగా ఖర్చు చేస్తారు ఒకరు బాగా పొదుపు చేస్తారు. అలా అన్ని సార్లు నువ్వే సర్దుకుపోవాలి అని లేదు. ఒకసారి నువ్వు ఆగి ఆలోచిస్తే ఇంకోసారి అవతలి వ్యక్తి ఆలోచిస్తారు. ప్రేమ, కోపం ఒక్కో వ్యక్తి ఒక్కోలా వ్యక్తపరుస్తారు. అందరూ ఒకేలా చూపించలేరు. అది అర్థం చేసుకోవాలి. మీ నాన్ననే చూడు సారీ అనే పదం చెప్పకుండానే తను చెప్పాలనుకున్నది చెప్పాడు.

 

అమ్మ చెప్పడం ఇంకా ఆపలేదు. వెంటనే ఫోన్ తీసాను ఆయనకి ఫోన్ చేయాలని..

అప్పుడే ఆయన నుండి ఫోన్..

నన్ను క్షమించు మిథు. తప్పు నాదే అన్నాడు. వెంటనే నేను సారి చెప్పాను. ఐదు సెకండ్ల మౌనం. సాయంత్రం బయల్దేరి వస్తాను అన్న.

వద్దు నేను బయలుదేరాను అన్నారు ఆయన….

ప్రేమికులు కానీ, పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ ఎప్పుడైనా గొడవలు జరిగినపుడు ఆలోచించి మౌనంగా ఉండి, కోపం తగ్గాక కూర్చొని మాట్లాడుకుంటే చాలా వరకు సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి..

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , , ,