This Guy’s Love Letter To ‘Neela’, The Love Of His Life, Comes With A Twist

 

Contributed by Hareesh Neela

హాయ్ నీలా
కొన్ని పరిచయాలు సమాధానాలతో మొదలు అయితే కొన్ని పరిచయాలు ప్రశ్నలతో మొదలు అవుతాయి.
నీతో నా పరిచయం “నేను ఏంటి” అని తెలుసుకోవడానికి బయలుదేరిన నా ప్రశ్నతో మొదలు ఐంది .
మొదటి సారి నిన్ను చూసినప్పుడే తెలియని అభిమానం,తెలుసుకోవాలి అన్న తాపత్రయం,మళ్ళి ఎపుడెపుడు చూస్తానా అన్న ఆరాటం.
ఎన్ని problems ,ఎన్ని tesnions ఉన్న నీ దగ్గరికి వచ్చి మౌనంగా నీతో మాట్లాడే మాటలు ఆ బాధలన్నీ మర్చిపోయేలా చేస్తాయి.
నువ్వు లోపల ఎంత కల్లోలం మోస్తున్న పైకి మాత్రం నిరంతరం ,నిశ్చలంగా, నిర్మలంగా అలా ఎలా ఉంటావో ,ఇది చూసే లోపల ఎన్ని బాధలు,భయాలు ఉన్న మొహం మీద చిరునవ్వుని ఉంచడం నేర్చుకున్న .
నాతో మాట్లాడకుండానే నేర్పిస్తావ్ ,ఇది నువ్వు అని చెప్తావ్ ,నేను ఏంటో తెలుసుకునేలా చేస్తావ్ .
నీతో గడిపే ఆ కొన్ని క్షణాలు నాకు ఎన్నో అనుభవాలు
బహుశా కాలానికి నువ్వే inspiration ఏమో ,అసలు ఆగిపోవడం ,అలిసిపోవడం అనేదే తెలీదు దానికి
నేను ఆగిపోయిన ప్రతి సారి ఒక దారిలా ,చీకటిలోకి వెళ్లిన ప్రతి సారి ఆ దారిలో దీపంలా నువ్వే ఉంటావ్.
అంతులేని అర్ధం కానీ ఎన్నో ప్రశ్నలకి నీ ఉనికే సమాధానం
నీ అనంతమే నా శూన్యానికి గమ్యం

నా గతానికి నీడలా
నా భవిష్యత్ కి ఆశలా
నా జ్ఞాపకాలకు వారధిలా

ఈ క్షణం నాలో ” నీలా ”
ఎపుడు నువ్వు ఉంటావ్.
నేను వెళ్లిపోతున్నా ఆ క్షణం నా పాదాలను తాకిన నీ అలలు నువ్వు చెప్పేది నేను వింటున్న అని అనడానికి ఏమో

నీల ..సముద్రానికి నేను ఇష్టంగా పెట్టుకున్న పేరు

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: