On The Occasion Of Environment Day, Read This Sweet Warning From Mother Nature

 

Contributed By Hari Atthaluri

 

పర్యావరణం పేరు బాగుంటుంది..
మీరు స్పీచెస్ ఇవ్వటానికి..
ఈ పేరు తో మీటింగ్స్ పెట్టుకోడానికి..

 

కానీ ఒక్క మీటింగ్ ఐపోగానే మళ్లీ షరా మామూలే…

ఇవాళ మీతో కొన్ని నిజాలు మాట్లాడాలి అనుకుంటున్నా !!

అసలు మీరు అందరూ ఒక చిన్న విషయం మర్చిపోతున్నారు…
నన్ను స్వచ్ఛంగా ఉంచితేనే కదా..
మీకు కూడా నేను స్వచ్ఛంగా ఉండేవి ఇవ్వగలను…

 

మీరు ఇప్పుడు తినే తిండి విషం.
తాగే నీరు విషం..
పీల్చే గాలి విషం..

“అమ్మ కి విషం ఇస్తే వచ్చే పాలు కూడా విషం”
అనే విషయం మర్చిపోయారు మీరు..

ఆ విషం వల్లే మీకు ఇన్ని రోగాలు…బాధలు…

ఇలా నన్ను సగం నాశనం చేయటానికి నీకు వందల యేళ్లు పట్టింది..

 

నువ్వు ఎన్ని చేస్తున్నా…దాని వల్ల ఎంత నష్టం జరుగుతున్నా !!
పోనీలే నువ్వు కూడా ఈ సృష్టిలో ఒక భాగమే కదా అని భరించా…

సాటి ప్రాణులుకి నీ వల్ల హాని జరుగుతున్నా సహించా….!!
తల్లిగా బాధ ఉన్నా…బాధ లేనట్టు నటించా !!

 

మీ తాత ముత్తాతలు, వాళ్ల తాతలు ఇలా నాకు హాని చేయకుండా..
అనాదిగా ప్రకృతి తో కలిసిపోయి ఉండటం చూసి సంబరపడ్డా..
నాకే పూజలు చేస్తూ..నన్నే దేవతలా చూస్తూ ఉంటే మురిసిపోయా !!

 

కానీ వాళ్లకి పుట్టిన వాళ్ళు..
వాళ్ల వారసులు..
ఇలా మీ తర తరాలు..
పునాదులు మర్చిపోయి..
అభివృద్ధి అంటూ..
అందలం అంటూ..
పర్యావరణాన్ని నాశనం చేస్తూ…
తరగని నా సంపదని..
మీ ఆకలి కోసం..
మీ అవసరం కోసం..అన్నిటినీ చంపుతూ..
మీ సుఖం కోసం పూర్తిగా నన్ను హరించి వేస్తుంటే..
మీ వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టినట్టు..
నన్ను కూడా అవసరం తీరాక పక్కన పెడుతుంటే..
ఒక చిన్న హెచ్చరిక ఇద్దాం అని ఫిక్స్ ఐయ్యా…

 

ఇన్ని రోజులు మీరు నన్ను నాశనం చేశారు కదా…

For a change…

నేను నిన్ను నాశనం చేయాలి అనుకుంటే…

ఆహా.. ఇంకా అంత పెద్దగా అనుకోలేదు లే !!
అలా అనుకునే ఉండి ఉంటే అసలు నువ్వు ఇది చదివే వాడివి కాదులే…

 

జస్ట్ అన్నిటినీ సెట్ రైట్ చేయటానికి..
నాలుగు గోడల మధ్యే నిన్ను కూర్చోబెట్టడానికి..
నాకు నాలుగే నాలుగు నెలలు పట్టింది….

 

ఇప్పటి వరకు దేనికోసం ఐతే నువ్వు నన్ను నాశనం చేశావో, చేస్తున్నావో…
అవేం నీకు అంత అవసరం లేకుండా చేశా..వాటి వైపు కూడా చూడకుండా చేశా…
మళ్లీ నేను బతికి ఉంటే చాలు భగవంతుడా అని నువ్వు అనుకునేలా చేసా…
నీ ఆకలి కోసం మళ్ళీ నా వైపే ఆశ గా చూసేలా చేసా…
ఎప్పుడు మళ్లీ బయటకి వస్తానా అని వెయ్యి కళ్ళతో నువ్వు వెయిట్ చేసేలా చేసా…

 

నువ్వు కనిపెట్టిన వాటిలో నిన్ను కాపాడేది ఏది అంటూ అని కంగారు కంగారుగా వెతుకున్నెలా చేశా..

ఏది అవసరమో…
ఏది అనవసరమో…
అని లెక్కలు వేసుకుంటూ నువ్వు రోజులు లెక్కపెట్టేలా చేసా….

 

నీ పరుగుని ఆపేసా..
ఊపిరి కూడా నీకు ఉక్కపోత లా చేశా…
స్వచ్ఛం గా శ్వాస తీసుకునే నీ స్వేచ్ఛ కూడా లాగేసా…
నీ మొహం కూడా నలుగురికి చుపించుకో లేకుండా చేశా..

 

ప్రపంచం అంతా తిరిగేసే నిన్ను..
ఇవాళ పక్కింట్లో కి కూడా వెళ్లకుండా చేసా..
సముద్రాలు కూడా దాటేసిన నిన్ను..
నీ సందు చివర కూడా దాటకుండా చేశా…

 

నువ్వు ఇవాళ కడుక్కుంటుంది చేతులు కాదు…నువ్వు ఇన్ని రోజులు చేసిన పాపాలు…

సామాజిక దూరం నువ్వు కాదు..నేను స్టార్ట్ చేసి నీ హద్దుల్లో నువ్వు ఉండేలా చేశా…నిన్ను నాకు దూరం గా ఉంచా..

ప్రపంచం అంతా కరోనా భయం అని చెప్పుకుంటున్నావు కానీ.. ఇందులో కూడా నీ స్వార్థమే…

 

ఓ క్షణం ఆలోచించి చెప్పు…

భయం ప్రపంచానికా?? మనిషికా??

ప్రపంచం అంటే నువ్వే అనుకుంటున్నావు..పిచ్చోడా !!!

ఇప్పుడు నువ్వు లేని, నా ప్రపంచం అంతా బాగానే ఉంది…

నువ్వు ఒక్కడివే బాధపడుతూ ఉన్నావు నా బ్రతుకు ఏం ఐపోతుంది అని..

ఇప్పుడు ఐనా అర్దం అవుతుందా !!

ఓ ప్రాణం విలువ..
అది నిలిచి ఉండేలా కంటికి రెప్పలా చూసుకునే నా విలువ…

ఓ పక్క కష్టం చూపిస్తూనే..
ఇంకో పక్క నీకు మంచే చేశా..
బంధీ గా చేసినా..
నువ్వు మర్చిపోయిన నీ బంధాలు కొన్ని రోజులు నీ చుట్టూనే ఉండేలా చేశా…
వాళ్ళతో కొన్ని రోజులు ఐనా ప్రశాంతం గా గడిపెలా చేశా..

ఎందుకు అంటే..

నాది అమ్మ కడుపు…
ఏ తల్లి ఐనా బిడ్డ కష్టం కోరుకోదు…

నవమాసాలు మోసి కన్న మీ అమ్మ ని కంటికి రెప్పలా చూసుకుంటారు కదా..

 

మరి మీ అమ్మ ను..
వాళ్ళ అమ్మ ను…
ఇలా అమ్మలందరిని అలుపు ఎరగకుండా ఇన్ని వేల సంవత్సరాలు గా మోసిన..మోస్తున్న ఈ నన్ను ఇంకెంత అపురూపం గా చూసుకోవాలి…

 

అలా అపురూపం గా చూడకపోయినా పర్లేదు…
ముందు నన్ను నన్నిలా ఉండనివ్వండి…
నా సమతుల్యం ని కాపాడండి…
మీతో పాటు నా మిగతా బిడ్డల్ని కూడా ప్రశాంతంగా బతకనివ్వండి..

 

మీ కోసం మాత్రమే ఇవ్వలేదు ఇవన్నీ..
ఈ నీళ్ళు.. నేల.. ఆకాశం..
మీతో పాటు వాటికి కూడా వాటా ఉంది…
వాడుకునే హక్కు ఉంది…
వారసత్వం గా అనుభవించే హక్కు ఉంది…
అలా కాదు అంటే…

 

ఈ సృష్టి ని మళ్లీ restart చేసే పనిలో నేను ఉంటా…
కానీ ఈ సారి అందులో మనిషి అనే స్వార్థ జీవి మాత్రం ఉండదు…
కరోనా కాకపోతే ఇంకో రూపం లో ఆ జీవి తుడిచి పెట్టుకు పోతుంది…
దానికి మందు కనిపెట్టినా…
నేను పుట్టించిన ఈ భయం కి మందు కనిపెట్టగలరా ????

Refresh button నొక్కితేనే మీ గొంతు ఎవరో నొక్కుతున్నట్టు… కాళ్ళు చేతులు కట్టేసినట్టు… మీ పరిస్థితి ఇలా ఉంది అంటే…

ఇంక నేను నొక్కే ఆ delete button ఇంకెంత worst గా ఉంటుందో జస్ట్ మీ ఊహకే వదిలేస్తున్నా…

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , ,