Presenting “Kaalam Cheppina Katha – Episode 4” The Narmada Bachao Andolan!

 

దేశం లోని పంట పొలాలకు నిత్యం నీళ్ళు ఉంటేనే రైతు బాగుంటాడని, అలా నిత్యం నీళ్ళు వుండటం కోసం ప్రతి రాష్ట్రం లో ఎన్నో డాం లు రెసెర్వొఇర్ లు కట్టాలని ప్రబుత్వం నిర్ణయం తీసుకుందని ప్రధాని ప్రకటించారు…ఈ వార్తలు ఇంతటితో సమానం..ముఖ్యాంశాలు మరో సారి..

బబ్లూ
అమ్మ మన దేశం లో ఎన్ని డం లు వున్నాయి
అమ్మ
చాల వున్నాయి
బబ్లూ
డాం ల వల్ల ఉపయోగం ఎంటమ్మ
అమ్మ
పెద్ద డాం లల వల్ల రెండు లాభాలు వున్నాయి..ఒకటి నీరు ను నిలువ వుంచి అవసరమైనప్పుడు పంట పొలాలకి ఆ నీళ్ళని ఇవ్వడం ఇంకొకటి విధ్యుత్ ఉత్పతి చేయడం
బబ్లూ
అవునా!!అలాంటప్పుడు చాల డాం లు కట్టచ్చు కదా ప్రభుత్వం
అమ్మ
డాం లు కట్టడం వళ్ళ ఉపయోగాలు ఎన్ని వున్నయూ నిరుపోయోగాలు కూడా అన్నే వున్నాయి..ఒక డాం కట్టాలంటే ఎంతో అడవి ప్రాంతాన్ని నేల మట్టం చేయాలి దీని వళ్ళ పర్యావరణం కి ప్రమాదం..అలా అడవి ప్రాంతన్ని అంత నాశనం చేస్తే అడవినే నముకున్న ప్రజలు ఏమౌతారు??ఒక పెద్ద డాం కట్టాలంటే ఆ నది చుట్టూ వున్నా ఎన్నో వందల చిన్న గ్రామాలు నది ప్రవాహం లో కొట్టుకొని పోతాయి..అక్కడున్న ప్రజలంతా ఏమౌతారు??ఇంకా కాలుష్యం కూడా..
బబ్లూ
ఎన్ని రోజులు పడుతుంది ఒక డాం కట్టాలంటే
అమ్మ
చాల సంవత్సరాలు పడుతుంది..
నీకు ఒక డాం గురింఛి చెప్తా ..ఆ డాం 1961 లో మొదలు పెడతే 2004 కి ఐపోయింది
బబ్లూ
ఆ డాం ఎక్కడ??

 

1960 జవహర్ లాల్ నేహురు
పెద్ద నిర్మానలే దేశ ప్రగతికి చిహ్నాలు.దేశం అభివృధి పదం వైపు నడవాలంటే, దేశం లోని వివేకులు తమ ప్రతిభ నైపుణ్యం తో ప్రపంచం లోనే ముందున్న దేశాలకి మేము కూడా దేనికి తీసి పోము అన్నంతగా విజ్ఞాన ప్రదర్శన చేయాలి..మనమూ అన్ని చేయగలం అని చూపించుకోడానికి దేశం లోని పెద్ద పెద్ద నిర్మనాలే దోహద పడతాయి.పెద్ద పెద్ద భవనలను నిర్మించి డబ్బు ని వృధా చేయడం నాకు ఇష్టం లేదు..అందుకనే కరువు ప్రాంతాల్లు అయిన గుజరాత్ రాజస్తాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాష్ట్రాల్లో నర్మదా నది మీద ప్రపంచం లోనే పెద్ద ఆనకట్ట కట్టాలని నిర్ణయించుకున్న.ఈ ఆలోచన నిజానికి నాది కాదు సర్దార్ వల్లబై పటేల్ గారిది, దేశం అంటే భక్తీ దేశ ప్రజలంటే ప్రాణమైన పటేల్ గారు ఎం చేసిన ఆలోచించే నిర్ణయం తీసుకుంటారని నా ప్రగాడ నమ్మకం.అందుకే వారు ఇచ్చిన సలహాని ఆచరణలో పెట్టడానికి మొదటి అడుగు వేస్తున్న.

1961 లో గుజరాత్ రాజస్తాన్ సరిహద్దులో వున్నా జలసింద్ ప్రాంతంలో పటేల్ గారి ఆలోనకు శంకుస్థాపన జరిగింది వారి ఆలోచనకు గౌరవార్థం గ ఆనకట్టకు సర్దార్ సరవౌర్ డాం అని నామకరణం చేసారు.
ఆరంబిమపరు నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై
యరంబించి పరిత్యజిందురు విఘ్నాయత్తులై మధ్యముల్
దిఇరుల్ విఘనిహన్య మానులగుచు ద్రుత్యున్నతోత్శాహులై
ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్
అన్నారు ఏనుగు లక్ష్మణ కవి!!!!పద్యాలు చాల పురాతనమైనవి అయిన ఆ భావాలు భూమి ఉన్నంతవరకు అలానే వుంటాయి .పద్య భావము లాగానే శంకుస్థాపనన జరిగింది 1961 అయినా ఆనకట్ట పనులు మొదలయ్యింది మాత్రం 1989 లో..ఆనకట్టు నిర్మాణం లోని మొదటి అడుగు నర్మదా నది చుట్టూ వున్నా అడవి ప్రాంతాలోన్ని జనాలని అక్కడి నుండి కాళీ చేయించడం.ఇక్కడే మొదలయ్యింది అసలైన చిక్కు!!!!!!!!!!!

ఎన్నో తరాలుగా అక్కడే నివసిస్తున్న ఆదివాసులలో ఆ వార్త అన్దోలనని రేకేతించింది.అక్కడే నివసిస్తున్న ఆదివాసులకు అక్కడ కొండలలో వ్యవసాయం పశువులకు మేత వేయడం తప్ప ఏమి తెలీదు.భయట ప్రపంచంతో సంభందం లేకుండా వారు వాళ జీవితాన్ని సాగిస్తున్నారు.కల్ముషం లేని ఆ ఆది వాసులకి మొదటి సారి భయట ప్రపంచం లో మనుషులు ఇంత నీచంగా జీవిస్తున్నారా అన్న విషయం తెలిసింది.సర్కారి వాళ్ళు చదవడం కూడా చేతకాని ఆ మనుషులకు తక్షనమే ఆ చోటును కాలి చేయాలనీ ఉత్తరవులు పంపించారు.దిక్కుతోచని స్థితిలో వున్నా వారికి డా.మేధా పటేకర్ అండగా నిలబడింది.
డా.మేధా పటేకర్ సమాజం మీద ఎంతో గౌరవం వున్నా వ్యక్తి.దేశం లో నివసించే ప్రతి ఒక్కరు సమాజం లో భాగస్వాములే అన్ని నమ్మినవారు. దేశం లోని ఎన్నో మారు మూర ప్రాంతాలలో వున్నా ప్రజల్ని చైతన్య వంతులని చేసి జన జీవన స్రవంతి లో కలపాలని అహర్నిశలు శ్రమించారు.సర్దార్ సరవౌర్ డాం కట్టడం వళ్ళ జలసింద్ అడవులలో వున్నా ఆది వాసులు వాళ్ళ జీవనాన్ని కోల్పోయి అనధలవుతారని గ్రహించి వారి తరుపున ప్రభుత్వంతో కూడా తగువులాడుతకు సిద్ధ పడ్డారు.

దేశంలోని అన్ని భారి నిర్మాణాలు ప్రభుత్వ డబ్బు తోనే నిర్మించినవి కాదు, నిర్మాణం ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయడం కోసం ప్రభుత్వం తో పాటు ఎన్నో ఇతర సంస్థలు వాళ్ళ దబ్బుని నిర్మాణం లో పెట్టు బడిగ పెట్టి ఆ తర్వాత కట్టిన ఆనకట్ట నుంచి వాటి ఆదాయంలో వాటా పుచ్చుకుంటారు.సర్దార్ సరవౌర్ డాం కి కూడా ప్రభుత్వం తో పనిచేయడానికి ముందుకు వచ్చింది ప్రపంచ బ్యాంకు.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 450 కోట్ల రుఉపయలను ఆనకట్టు నిర్మాణానికి మంజూరు చేసింది.ఆర్ధిక ఇబ్బంది లేని ఏ నిర్మాణం అయిన చాల త్వరగా పూర్తి అవుతుంది.ఈ విషయం గ్రహించిన డా.మేధా పటేకర్ ఆదివాసుల గోడును ప్రపంచానికి తెలిసేలా ఎన్నో అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ విభాగాలలో ఉపన్యాసాలు ఇచ్చిప్రపంచ దృష్టిని భారత్ వైపు మళ్ళించింది.రష్యా లో నిర్వహించిన అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సదసులో ఆమె ప్రసన్గిస్థూ…….

భారతదేశంలో ఎన్నో యుగాలనుంచి వివిధ సంస్కృతులు అనేక బాషలు వ్యత్యాసమైన వాతావరణం అనేక కుల మతాలతో ఒక గొప్ప ఉపఖండం గ పేరు తెచ్చుకుంది.స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్య వైద్య సాంకేతిక విఘ్ఞానం లో అభివృధి దేశాలతో పోటి పడుతూ ముందుకు దూసుకేల్తుంది.కాని అభివృధి ఎవరికోసం??దేశం లో జరిగే అభివ్రుది కేవలం ఒక వర్గం ప్రజలకి మాత్రమె ఉపయోగ పడుతుంది.అభివృధి పేరుతో ప్రభుత్వం ఎంతో మంది ప్రజలకి జీవన ఆధారం లేకుండా చేస్తుంది.భారతదేశం లో ప్రతి ఒక్కరికి దేశం లో నివసించే హక్కు వుంది.తర తరాలనుంచి వాళ్ళు దున్నుకుంటున్న భూమి ని రక్షించుకునే స్వేచ్చ వుంది.కాని నేటి పరిస్థితులు చూస్తుంటే భలవంతుడు భలహీనుడిని ఇంకా బలహీన పరిచి అభివృధి అనే ముసుకుతో మోసం చేస్తున్నాడు.గుజరాత్ లో నిర్మించే సర్దార్ సరవౌర్ డాం నాలుగు రాష్ట్రాలలోని పంట పొలాలకి చాల ఉపయోగ పడుతుంది.కాని ఈ నిర్మాణం వల్ల ఎన్నో వేల ఎకరాల పచ్చని అడవులు మృత్యువాత పడతాయి.ఆ అడవులనే నమ్ముకున్న ఎన్నో ఆది వాసుల గ్రామాలకు జీవన ఆధారం లేకుండా పోతుంది.అభివృధి కి ఎవరు అడ్డం కాదు కాని ఈ ఆనకట్ట కట్టడం వల్ల నాశనం అవుతున్న ఎంతో మంది ఆదివాసులకు ప్రభుత్వం కలిపించిన ప్ర్త్యంన్యాయ చర్యలు చాల దారుణం.గుజరాత్ లో నివసించే ఆదివాసులకి మహారాష్ట్ర లో భూమాలని కేటాయించారు.అది కూడా ఎలాంటి సారవంతం లేని భూమి.అడవుల్లో పశువులకు మేత పుష్కలంగా దొరుకుతుంది కాని బంజర భూమి లో పంటే పండదు ఇక మేత ఎక్కడ్నుంచి తెస్తారు?పునర్వస్తికరణం చట్టం కింద ఆదివాసులకి సర్కారు వారు ఇస్తున్న రుక్కం కేవలం 500 రూపయిలు.ఇది ఎక్కడ న్యాయం??చదువు లేని వాళ్ళకి నోటిసులు పంపిస్తారు,ఇదేంటి అని ప్రశ్నిస్తే పోలీసులతో కొట్టిస్తారు.న్యాయం కోసం పోరాటం లో దేశం లో ఇంకా ఎన్నాళ్ళు రక్తం చిన్డుస్తూనే వుండాలి??దయ చేసి ప్రపంచ బ్యాంకు వారు మరొకసారి అలోచించి నిర్ణయం తీస్కోవాలని ఆశిస్తున్నాను.
డా.మేధా పటేకర్ గారి ప్రసంగం ప్రపంచ బాంకు ను అలోజిమ్పచేసింది.ప్రపంచ బ్యాంకు ఒక కమిటీ ని ఏర్పాటు చేసి ఇక్కడ పరిస్తుతులని గమనించాక పెట్టుబడులను నిరాకరించారు.

డా.మేధా పటేకర్ “నర్మదా బచావ్ ఆందోళన్” పేరు మీద 22 రోజులు చేసిన నిరాహార దీక్షతో ప్రభువత్వం దిగి వచ్చింది.సుప్రీమ్ కోర్టు ముగ్గురు ఉన్నతమైన న్యాయమూర్తులతో ఒక కమితీ ని ఏర్పాటు చేసి అక్కటి పరిస్థుతులు మీద ఒక నివేదిక ఇవ్వవలసినదిగా ఆదేశించింది.

2000 సంవత్సరం లో ముగ్గురు లో ఇద్దరు న్యాయమూర్తులు పునర్వస్తికరణాలు అన్ని సరిగ్గానే వున్నాయని ఆనకట్ట కట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేదని నివేదిక ఇచ్చింది.దాంతో 2000 సంవత్సరం లో సరావౌర్ ఆనకట్టు నిర్మాణం పునఃప్రారంభం అయ్యింది.కాని అక్కడున్న ఆది వాసులు మాత్రం ఈ అడివి మనది నర్మదా మనది మన పుట్టుక ఇక్కడే మన చావు కూడా ఇక్కడే అని ఆనకట్ట నిర్మాణం లో వున్నప్పుడు నదీ ప్రవాహం లో చాల మంది మరణించారు.

ఆనకట్ట నిర్మాణం పూర్తి అయ్యే సమయానికి గుజరాత్ 13 ammusment పార్కులు వున్నాయి.ఇందులో వృధా అయ్యే నీరుతో రాష్ట్రం లోని ౩౦ శాతం కరువు ప్రాంతానికి నీటిని సరఫరా చేయ్యోచు.సర్దార్ వల్లభై పటేల్ గారి ఆలోచన చివరికి 2004 లో పూర్తియ్యింది.కల అయితే పూర్తి అయ్యింది గాని కల వెనుక నీటిని ఆద చేసి కరువు ప్రాంతలకు అందించాలన్న ఆశయం మాత్రం అలాగే మిగిలిపోయింది.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , ,