This Organisation Follows The Ideals Of Swami Vivekananda & Helps The Poor

 

ఎదైనా సమస్య కళ్ళ ముందు కనపడితే ఆ సమస్య ని పట్టించుకోని వాళ్ళు ఉంటారు, ఎలా పరిష్కరించాలి అని ఆలోచించి, ఆచరించి, ఎందరికొ మార్గ నిర్దేశం చేసే వాళ్ళు ఉంటారు. అలా ఆలోచించిన “నరేన్” అనే వ్యక్తి ఎందరికో ఆదర్శంగా నిలిచే స్వామి వివెకానంద గా మారారు, ఆయన అడుగు జాడల్లో నడుస్తూ కొమ్మిటి సందీప్ రెడ్డి( 9010222266 ) అతని మిత్రులు, “నరేన్ ఫౌండేషన్” స్థాపించి, నేటి “నరేన్” లు గా వారి సేవ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆరుగురు సభ్యులతో మొదలైన ఈ ఫౌండేషన్, ప్రస్తుతం 40+ సభ్యులతో దిగివిజయంగా కొనసాగుతోంది. స్వామి వివేకానంద గారి “రామ కృష్ణ మిషన్” లో కొన్నాళ్ళ పాటు శిక్షణ పొందిన “కొమ్మిటి సందీప్ రెడ్డి” తన లాంటి ఆరుగురి మిత్ర బృందం తో, ఈ సంస్థ ని స్థాపించారు. ఇప్పుడు ఈ సంస్థ లో 40 మంది కి పైగా సభ్యులు ఉన్నారు.


సంస్థ వ్యవస్థాపకులు:

సందీప్ రెడ్డి కొమ్మిటి, కొమ్మిటి అమర్ రెడ్డి, శ్రీరామ్ విజయ్, శెట్టి విహర్, శశాంక్, బండారి గణేష్, బండి రాజు


ఆక్టివ్ మెంబెర్స్:

అన్వేష్ రావు, వినీష్ రావు, మనోజ్, రాజు, రమేష్, బండి కిషన్, సాగర్ బోరెడ్డి, గ్రంధి వెంకటేష్, విజయ్ రెడ్డి గడ్డం, అశోక్ రెడ్డి, ఊబ విజయ్, సాయినాథ్, L రాజేష్ బాబు, ప్రదీప్ V, సంతోష్ గందే, రోహన్, ప్రసాద్, ప్రవీణ్ కుమార్

ఈ సంస్థ ద్వార చేసే సేవ కార్యక్రమాలు ముఖ్యంగా 4 విభాగాలు గా నిర్వహిస్తారు.

ప్రేరణ: విద్యార్థులకు, విద్యా వ్యవస్థ కు సంబంధించిన కార్యక్రమాలు.

చేయూత: తల్లి, తండ్రులు చనిపోయి అనాథలైన చిన్నారుల విద్యా అవసరాల కోసం దాతల సహాయం తో ఆర్ధిక సహాయం అందించడం.


స్వచ్ఛత : స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ తెలంగాణ ప్రేరణ పొంది, గ్రామాలలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను అభివృద్ధి చేసి, వాటికి సరి అయిన రంగులు వేసి వాటిని తిరిగి వాడుకలోకి తేవడం.

మైళ్ళు రాళ్ళు:

నరేన్ ఫౌండేషన్ నిర్వహించిన కెరీర్ అవేర్నెస్ ప్రోగ్రాం ఫోటో, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే “డిజిటల్ ఇండియా” కార్యక్రమానికి ఇచ్చే బుక్ లెట్ కవర్ ఫోటో గా ప్రచురించారు.

నరేన్ ఫౌండేషన్ ద్వారా తల్లి తండ్రులు చనిపోయిన సారంపల్లి చిన్నారులు అక్షయ , అజయ లకు 2 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపోజిట్ చేసి కలెక్టర్ గారి చేతుల మీదుగా అందజేశారు.

గత సంవత్సరం సంస్థ సభ్యులు దగ్గర ఉండి అప్లై చేసిన విద్యార్థులలో 11 మంది గురుకుల పాఠశాల కి ఎంపికయ్యారు.

మెడికల్ క్యాంప్ ల ద్వారా పేద ప్రజలకు సేవ ని అందించి, పట్టణ ప్రాంతాలకు పోలేని వారికి సహాయం అందిచారు.

అనారోగ్యం తో మరణించిన పంప్ ఆపరేటర్ “బోయ శీను” కుటుంబానికి 20,000 ఫిక్స్డ్ డిపోజిట్ చేసి శ్రీ “కే.టి.ఆర్” గారి చేతుల మీదుగా ఆ కుటుంబానికి అందజేసారు.


భవిష్యత్ లక్ష్యాలు:

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని గ్రామలలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఆస్తులని, జిల్లా యంత్రాంగం సాయం తో అభివృద్ధి చేసి వినియోగం లోకి తేవడం.

నరేన్ ఫౌండెషన్ తరుపున ప్రతి నెల ఒక గ్రామం లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం.

గ్రామలలో “వేస్ట్ మేనజ్మెంట్” మీద అవగాహన కల్పించడం.

అన్ని గ్రామల ప్రభుత్వ పాఠశాలల విధ్యార్థులకి కెరీర్ పైన అవగాహన కల్పించడం.

ప్రాథమిక విద్యార్థులు, గురుకుల, నవోదయ లాంటి పరీక్షలకు ప్రతొక్కరు హాజరయ్యేలా వారికి వారి తల్లి తండ్రులకు, అవగాహన కల్పించడం.

ఎన్నో నీటి బొట్టులు కలిస్తే ఎందరికొ దాహం తీర్చే చెరువు అవుతుంది. ఎదైనా చేయగలా యువకులు కలిసారంటే సాయం అవసరమైన ఎన్నొ బతుకులకి కొండంత అండ దొరుకుతుంది..

మనిషి గా పుట్టింది సాటి మనిషి కి సాయం చేయడానికే అన్న వివేకానందుని మాట మన “నరేన్ పౌండేషన్” నినాదం. వారి ప్రయాణం ఎన్నో విజయాల మైళ్ళు రాళ్ళని చేరాలని ఆశిద్దాం. మనంకూడా మన చేతనైనా సాయం అందిద్దాం.


Follow and support them on FB

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: ,