కృత్రిమ జీవితం: An Insight On What’s Wrong With Today’s Food Habits

 

Contributed By Vamshi Gajendra

“మనిషి శరీరం ఒక యంత్రమైతే.. ఆహారం దానికి ఇంధనం వంటిది.. ఇంధనంలో నాణ్యత లోపిస్తే యంత్ర మనుగడకు ప్రమాదం వాటిల్లినట్టే..”

భారతదేశానికే “Rice Bowl” గా పేరొందిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్..
అదే ఆంధ్రప్రదేశ్ ది దేశంలో కెల్లా అత్యధిక మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో ఒకటో స్థానం.

గడిచిన శతాబ్ధంలో పెరిగిన సాంకేతిత సాయంతో మనిషి చాలా సాధించాడు.. చేతిలో సెల్ఫోన్నుంచి చేతికందని చందమామపై కాలుమోపడం దాకా మనిషి సాధించిన విజయాలు ఎన్నో.. పంటకోసే కొడవలి పీకకూడా కొయ్యగలదు అన్నట్లు అదే సాంకేతికత మానవజాతి మనుగడకి శాపమై మారింది.. శత్రువై నిలుచుంది.. అంతరిక్షంలో ఎం జరుగుతుందో విశ్లేషించగల మనిషి.. తన శరీర అంతరంగంలో కలిగే మార్పును మాత్రం ఎందుకు విస్మరించాడు…?? సమాధానం తెలియనిప్రశ్న.. కానీ సమాధానం లేని ప్రశ్న కాదు.. వెతికే ప్రయత్నం చేద్దాం..

మూడు తరాల ముందు మనిషి జీవనశైలి చాలా సరళంగా ఉండేది.. భూమిని వ్యాపారంగా కాకుండా సాగుకోసం మాత్రమే ఎక్కువగా ఉపయోగించిన రోజులవి.. మనిషికి చాలా తక్కువ అవసరాలు ఉండేవి.. వాటిలో ప్రధమమైంది ఆహరం.. ఆ ఆహారం సృష్టించుకోటంలోనే రోజులో చాలా భాగం గడిచేది.. విత్తనం నాటితే చెట్టు మొలకెత్తుతుంది అనే విజ్ఞతకి వారసత్వంగా పుట్టిందే వ్యవసాయం అనే ప్రక్రియ. అప్పట్లో ఈ వ్యవసాయం చాలా సహజంగా జరిగేది.. బహుశా అప్పటివాళ్ళకి కృత్రిమత్వానికి అర్ధం తెలియకపోవటమో.. అవసరం లేకపోవటమో కారణం అయ్యుండొచ్చు..! నదిలో పారేనీరే దాహార్తిని తీర్చేది.. అవయవాలకు కావాల్సిన పోషకాలన్నీ ఆహారంలోనే అందేవి.. శరీరానికి కావాల్సిన వ్యాయామం రోజువారీ దినచర్యలోనే దొరికేది..

మనిషికి జ్వరం సోకితే వంటింట్లోని కాషాయమే ఔషధమయ్యేది.. పంటకి పురుగుపడితే ఆవుపేడే ఎరువయ్యేది.. పండించినవాడికి.. కొనేవాడికి మధ్యలో ఎటువంటి పద్ధతులుగాని వారధులు గాని ఉండేవి కావు.. బ్రతకటానికి సరిపడా డబ్బుకోసం పనిచేసేవారు.. జీవితం కూడా అంతేతేలికగా.. ప్రకృతిలో భాగంలా సాఫీగా గడిచిపొయ్యేది.. 90 శాతంమంది శతకం దాటి బతికిన వాళ్ళే..

ఏళ్ళు గడుస్తున్నాయి.. తరాలు మారుతున్నాయి.. సాంకేతికత పేరుతో మానవజీవనశైలిలోకి కృత్రిమత్వం చొచ్చుకు రావటం మొదలుపెట్టింది..

ఆహారం పండే భూమి నుండి… బిడ్డ ఆకలితీర్చే అమ్మపాల వరకు ప్రతిదీ వ్యాపారాత్మకమై కూర్చుంది.. డబ్బు సంపాదనే ప్రధాన ధ్యేయమైమారింది.. ఆ పరుగులో మనిషి మూలాల్నిమరిచి.. కొత్త గమ్యాలని ఏర్పరుచుకున్నాడు.. సరిగ్గా అప్పుడే తన ఆరోగ్యాన్ని.. శరీరాన్ని కూడా విస్మరించటం ప్రారంభించాడు.. తాగేనీరు ఎక్కడమొదలై.. ఎన్ని రసాయనాలను తనలో కలుపుకుని.. ఎలాంటి తుప్పు పట్టిన గొట్టలోంచ్చి మన ఇంటి కొళాయికి వచ్చి చేరుతోందో తెలీదు.. అలా వచ్చిన దాన్ని ప్లాస్టిక్ బిందెల్లో, బాటిల్స్లో నింపి.. మైక్రోనానో కణాలను కలిపి ఎన్నేళ్లుగా తాగుతున్నామో లెక్కలేదు.. మనపళ్లెంలో బియ్యం ఏ పల్లెలో ఎవరి పొలంలో పండి.. ఏ రైస్ మిల్ ల్లో పాలిష్ అవ్వబడి వచ్చిందో పత్త లేదు.. పండ్లు, కూరగాయాలు కృత్రిమ రంగులు పులుముకుని బజారులో దర్శనమిస్తున్నాయి.. వాటిని కొని తిని ఆరోగ్యమైన వనే భ్రమలో ఉంటున్నాం.. ఇలా అనేక రకమైన రసాయనాలు మనచేతులారా మనకడుపులోకి చేరి అవయవాలకు పోషకాలు అందించాల్సిన పేగుపై పేరుకుపోయి మనల్ని నానాయాతనకి గురిచేస్తోంది.. ఊబకాయం, అసిడిటీ, మధుమేహంలాంటి ఎన్నో నోరుతిరగని పేర్లున్న రోగాల్ని రోజుకోటి కనిపెట్టుకుంటూ పోతున్నాం. రోజు వారి జీవితంలో మనంచెయ్యాల్సిన పనులన్నీ మెషిన్లకి అంటగట్టి.. శారీరక శ్రమచేయక పోవటం వాళ్ళ పెరిగిన కొవ్వును కరిగించడానికని మళ్ళి కొత్త రకమైన మెషిన్లనే ఆశ్రయిస్తున్నాం.. సరైన ఆహారం తినక వచ్చిన అనారోగ్యాన్ని పోగొట్టుకోవటానికి ఔషధాన్ని ఆశ్రయిస్తున్నాం.. చివరి పంటకి పట్టిన పురుగు చంపటానికి రసాయన ఎరువులని కనిపెట్టేసాం.. పురుగుచంపిన మందు మనిషి మాత్రం ఎందుకు విడిచి పెడుతుందనే చేదు నిజం మర్చిపోయాం.. డబ్బు సంపాదించటమే పరమావధిగా సగం జీవితం గడిపేసి.. ఆలా గడిపిన జీవనశైలి కారణంగా కలిగిన జబ్బుల్ని నయం చేసుకోటానికి తిరిగి ఆ డబ్బునే ఖర్చు చేస్తున్నాం.. ఇంత తాపత్రయపడి మనం సాధించింది ఏంటంటే మనిషి సగటు జీవితకాలం సగానికి కుదించాం.

మనిషిగా మన జీవిత మొదటి ముఖ్య ధ్యేయం బ్రతికినంతకాలం ఆరోగ్యంగా, ఆనందంగా బ్రతకగలగటం.. మిగిలినవన్నీ దాని చుట్టూ ఏర్పడిన అవసరాలు మాత్రమే.. కాల ప్రవాహంలో అసలు నిజం మర్చిపోయి.. అవసరాల వేటకై చాలా దూరం సాగిపోయాం.. భూమి గుండ్రం.. ఎంతవేగంగా ముందుకు వెళ్తామో అంతే త్వరగా మొదలైన చోటుకి మళ్ళి చేరుతాం.. అమావాస్య చీకటికి ముందే పౌర్ణమి చంద్రుడ్ని ప్రేమిద్దాం.. అంత అయిపోక ముందే ఉన్న కొంత కాలమైనా ఆరోగ్యంగా జీవిద్దాం.. ఆనందాలను పోగు చేసుకుని పయనమౌదాం.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , ,