These Musings Of A Husband About His Wife’s Motherhood Will Make You Emotional!

 

సమయం : అర్ధరాత్రి 2.30
బెడ్ రూమ్ పక్కన బాల్కనీ లో నుండి గంభీరంగా ఉన్న సముద్రాన్ని చూస్తూ నిల్చున్నాను. ఈ మధ్య నాతో నేను మాట్లాడుకోడానికి నాకు ఇప్పుడే వీలు చిక్కుతోంది . ఈ సంవత్సరకాలం లో నా జీవితం లో ఎన్నో మార్పులు కలిగాయి. ఎనమిది నెలల క్రితం నా ఆఫీస్ లో HR తో దాదాపు గొడవపడినంత పని చేశాను సెలవు కోసం,”ఇస్తే 8 నెలలు సెలవు ఇవ్వండి లేదంటే నేను resign చేసేసి వెళ్ళిపోతా,నా జీవితం లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టైం,Once in a lifetime moment అంటాం కదా అది ఇదే,లీవ్ ఇస్తారా రిజిగ్నేషన్ ఇవ్వమంటారా ” అని గట్టిగా అడిగాను,నాకున్న goodwill వల్ల లీవ్ ఇస్తున్నాను అని చెప్పాడు . ఇంత కచ్చితంగా మాట్లాడానికి ఒక కారణం ఉండింది .ఆ ముందు రోజు నేను, కీర్తన హాస్పిటల్ కి వెళ్ళినపుడు డాక్టర్ ,కీర్తన ప్రెగ్నన్ట్ అని, ప్రస్తుతం మూడో నెల అని కన్ఫర్మ్ చేసారు . ఆ క్షణమే నిర్ణయించుకున్నా,డెలివరీ అయ్యి,బిడ్డకి రెండు నెలల వయసు వచ్చే దాక,కీర్తన పూర్తి ఆరోగ్యం తో ఉండేదాకా నేను ఆఫీసుకి వెళ్ళను అని

ఆరేళ్ళ క్రితం నాకు కీర్తనకి మధ్య ప్రేమ అనే అనుభందం ఏర్పడింది.మూడేళ్ళ క్రితం అది దాంపత్య బంధం గా రూపాంతరం చెందింది.కానీ ఇప్పుడు ఉన్నంత అందం గా తను ఇదివరకెప్పుడు లేదు,ఎదో నిండుతనం,మోహంలో ఓ కళ. ఎప్పుడూ నాకు తనే ఓ పసిపాప లా కనిపించేది ఇప్పుడు తన కడుపులో ఓ బుజ్జాయి.ఒక్కటిగా ఉన్న మేమిద్దరం ,ఇప్పుడు ముగ్గురం అవ్వబోతున్నాం . భర్తగా నా భాద్యత ఇప్పుడు తనకి తోడుగా ఉండడమే,బిడ్డ పుట్టాక తనని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అనేదానికి warm up లాగా ఇప్పుడు కీర్తననే జాగ్రత్తగా చూసుకున్నాను, తనతో వాకింగ్ కి వెళ్లడం, ప్రతీ నెలా checkup కి తీసుకెళ్లడం, తినిపించడం,జో కొడుతూ నిద్రపుచ్చడం లాంటివి…

ఎప్పుడూ భోజనం విషయంలో నిర్లక్ష్యం చేసే తాను,ఇప్పుడు టంచన్ గా భోజనం చేసేస్తోంది,పాలంటే చిరాకు ,కానీ బిడ్డకి బలమని రోజూ రెండు సార్లు తీసుకుంటోంది,నాచేత్తో జ్యూస్లు చేయిస్తుంది,ఇవన్నీ తనకోసం కాదు,కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని,ఎలా ఉంటుందో,కూడా తెలీని బిడ్డ మీద ఇంత ప్రేమ, మమకారం కేవలం తల్లికే సాధ్యం. ప్రతీ రోజూ ఎన్నో కబుర్లు తన పొత్తికడుపుపై చేయి చేసి చెప్పేవాడిని అవన్నీ నేను వింటున్నా అన్నట్టుగా అప్పుడప్పుడు చిన్న చిన్న కదలికలు,ఎన్ని మధురమైన అనుభూతులో .బయటికివెళ్తే హ్యాండ్బ్యాగ్ కూడా బరువు అని నాకు ఇచ్చేసేది కీర్తన , ఇప్పుడు,కడుపులో ఇంత బరువుని ఇన్ని నెలలు ఆనందంగా మోసింది. తొమ్మిది మాసాలు,దినదిన గండం,అయినా హాయిగా నవ్వుతూ భరించేస్తుంది.

అనేస్తేషియా ఇచ్చేసి నొప్పి తెలీకుండా ఆపరేషన్ చేసేయమని నేను డాక్టర్ కి చెప్తాను అంటే,వొద్దు నార్మల్ డెలివరీ ఏ కావాలి అని గొడవ పెట్టేసింది,ఒక చిన్న గాయమైనా భరించలేదు తను,తను బాధపడితే చూడలేను నేను, ఎదో పుస్తకంలో చదివేను ఒక మనిషిని బ్రతికుండగానే కాల్చేస్తే ఎంత నొప్పిగా ఉంటుందో అంత నొప్పి ఉంటుందిట ప్రసవ సమయంలో.ఇంత నొప్పి ని భరించలేవు అని నేను … కానీ నా మాట వినలేదు, పురుటి నొప్పులు రాగానే హాస్పిటల్కి తీసుకెళ్ళాను ,సుమారు 45 నిముషాలు ఆపరేషన్ థియేటర్లో మాటల్లో చెప్పడానికి కూడా లేనంత భాదని పంటిబిగువున భరించింది,అసలు తనకి ప్రమాదం అని తెలిసినా తనలోని మరో జీవికి ప్రాణం పోయాలని తన ప్రాణాన్ని పణంగా పెట్టేసింది. ఆడవాళ్ళలో ఉండే స్వార్ధం ఇదే కాబోలు,తన వాళ్ళకోసం ఏదైనా,చివరికి తన ప్రాణాలైనా వొదులుకునేంతగా,దేనినైనా త్యాగం చేసేయగలరు ఒకసారి నా వాళ్ళు అని అనుకుంటే.స్వార్ధం అంటే తెలీదు,త్యాగమే వాళ్ళకి తెలిసింది. ఆ ప్రసవ వేదనలే బిడ్డకి ఇచ్చే దీవెనలు కావొచ్చు..

మా ఇద్దరి ప్రేమకి ప్రతి రూపంగా ఒక చిన్ని పాప ఈ భూమిమీదికి అడుగు పెట్టింది, ఎప్పుడూ కలగని ఆనందం ,ఎంత వర్ణించినా సరిపోని అనుభూతి అది.కీర్తన చేయి పట్టుకొని తన దగ్గర కూర్చున్నా ,తన కళ్ళలోకి చూస్తూ,అప్పటిదాకా నొప్పితో ఏడ్చిన తన కళ్ళు,ఆనందం తో తడుస్తున్నాయ్, పాపాయి ని చూసి,ఇన్నాళ్లు కడుపు లో పెట్టుకుంది,ఇప్పుడు గుండెల్లో పెట్టుకుంటుంది. తనతో ఎం మాట్లాడాలో నాకు తెలియలేదు,ఆనందం తో,భాధ తో,ఒకేసారి కన్నీళ్లు ఒచ్చేసాయి.తను నా చేయి నిమురుతూ, గొంతును సవరించుకొని, నన్ను దగ్గరికి పిలిచి మెల్లిగా ఓ మాట చెప్పింది,”అమ్మతనం లో ఉండే గొప్పతనం ఇదే రఘు,ఇలాంటి భాద ఇంకో పదిసార్లైనా భరించగలను” అని. తనమీద నాకున్న ప్రేమ గౌరవం వెయ్యి రెట్లు పెరిగింది,తన నుదుటిపై ముద్దు పెట్టాను ,ఎం మాట్లాడాలో తెలియక . మెల్లిగా నిద్రలోకి జారుకుంది.

కీర్తన పక్కనే ఉంటూ ఇన్ని రోజులుగా ఇదంతా నేను గమనించాక నా తల్లి మీద ఆరాధన పెరిగింది,తల్లి అంటే గౌరవం మరింత పెరిగింది.ఇప్పుడు పాప కి రెండు నెలల వయసు,సరిగ్గా 2 గంటలకి పడుకుంటుంది, మళ్ళీ ఉదయం 9 గంటలకి లేస్తుంది,అందుకే కాసేపు నేను,కాసేపు తను ఇలా ఇద్దరం తనతో ఆడుకుంటూ గడుపుతున్నాం…

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , ,