These Musings Of A GIrl Saying No To Her Marriage Is Relatable To Every Girl Out There

Contributed By Hari Atthaluri
అన్నీ మర్చిపోయే అంత సంఘర్షణ నాలో మొదలు అయ్యి నాలుగు రోజులు ఐయ్యింది…
చెప్పాలా వద్దా అని ఆలోచనల తోనే నా నిద్ర కూడా ఆవిరి అయిపోతుంది….
Future అంతా ఏడుస్తూనే ఉండాలేమో అన్న ఆలోచన కే ఏడుపు వస్తుంది.
“అమ్మాయి గా పుట్టడం అంటేనే అన్నీ ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవటం”
వేసుకునే డ్రెస్ నుంచి… చేసుకునే వాడి వరకూ…కొన్నే మన చేతుల్లో ఉంటాయి…
ఆ చేతులు కూడా ఎప్పుడూ సగం కట్టేసే ఉంటాయి..
ఆడపిల్ల మాత్రమే ఇంటి పరువు కోసం పుట్టిందా అనిపిస్తుంది…
మాకు సంభందించిన ప్రతిదీ అలాగే చేస్తారు.. చూస్తారు…చూస్తున్నారు…
ఇలా ఆలోచిస్తూ చీ ఈ జీవితం అనిపిస్తుంది ”
Matches చూస్తున్నారు అని తెలుసు.. కానీ ఇంత సడన్ గా అన్నీ సెట్ అయిపోయి… ఆ జాతకాలు కూడా కలిసి.. మా భవిష్యత్తు బాగుంటుంది అంట అని వచ్చిన match గురించి అమ్మ ఆనందంగా
నాన్న తో చెప్తుంటే …
ఇప్పుడు నా భవిష్యత్తు నాకు కనిపించటం లేదు…అంతా ఎదోలా ఉంది..ఏం అర్ధం కావాట్ల….
Matches చూస్తాం అన్నప్పుడే అమర్ గురించి చెప్పాలా వద్దా అని ఆగిపోయి తప్పు చేశానా అనిపిస్తుంది….
నేను ఎలాంటి husband కావాలి అనుకున్నానో అచ్చం అమర్ అలాగే ఉంటాడు…
తన కళ్ళలో కి చూస్తే తనకి నేనంటే ఓ గౌరవం.. నా పైన ఉన్న ఇష్టం క్లియర్ గా తెలుస్తుంది…
అది నాకు తెలిసి కూడా 3 years అయ్యింది…
కాని అది నేను తనని అడగలేదు…
అడుగు ముందుకు కూడా పడలేదు….
“ప్రేమ అంటే అర్థం చేసుకోవాలి..కాని దానికి చెట్టా పట్టాలు వేసుకుని అక్కడకి ఇక్కడకి తిరగాల్సిన పని లేదు. ఇది నా నమ్మకం”
తను అది కూడా అర్ధం చేసుకున్నాడు.
కానీ నేనే ఒకే చెప్పలేదు…
అలాగే నో అని కూడా చెప్పలేదు….
18 years కి చెప్పినా..
28 years ki చెప్పినా ప్రేమ ఎప్పటికీ తప్పే అని ఫిక్స్ అయ్యి…
అన్నిటినీ.. ప్రేమించే అందరినీ..
ఒకేలా రిసీవ్ చేసుకునే ఈ సొసైటీ మనది..
పాపం మా నాన్న ఏం చేస్తాడు…తను కూడా ఈ సొసైటీ లో ఒక భాగమే గా…
సెటిల్ అవ్వకుముందు చెప్తే చిన్న పిల్లవి అంటారు… ఏంటి ఈ age లో ఇవన్నీ అని తిడతారు…
కాని ఇపుడు నేను ఒక జాబ్ చేస్తున్నాను..
నాకు నచ్చిన వాడు కూడా ఓ బాధ్యత తో ఉన్నాడు…
ఇద్దరకీ అర్ధం చేసుకునే వయసు ఉంది…
నిర్ణయం తీసుకునే sensibility ఉంది….
ఐనా కూడా మాకు నచ్చే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మాకు ఇప్పటికి ఐనా ఉంది అంటే… లేదు అనేదే answer…
ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు మా కోసం ఒప్పుకున్నా ..
వాళ్ళని ప్రశాంతం గా ఉండనిచ్చే అవకాశం లేదు…
సూటి పోటి మాటలతో ఈ సొసైటీ రెడీ గా ఉంటుంది….
నాన్న కి చెప్తే అర నిమిషం లో అమ్మ కి తెలుస్తుంది…
ఇపుడు వాళ్ళు చూసిన సంబంధం నాకు ఇష్టం లేదు అని అందరికీ అర్దం అవుతుంది..
నా ఇష్టం కోసం వాళ్ళు చాలా కష్టపడ్డారు… ఆ కష్టం చూసా కాబట్టే నేను కూడా అంతే బాధ్యత గా ఉన్నాను…
కాని పెళ్లి అనే topic చాలా delicate..
నేను చెప్పే ఈ ఒక్క మాట కొన్ని రోజులు పాటు నా పైన వాళ్ళ ఇష్టం కాస్తా కోపం గా మార్చొచ్చు…లేదా నన్ను ఏమి అనలేక సొసైటీ కి సమాధానం చెప్పలేక
వాళ్ళు కుంగి పోయేలా కూడా చేయొచ్చు…
ఇలాంటి వంద ఆలోచన లతో,
ఉక్కిరి బిక్కిరి అవుతున్నా….
చివరగా నా ఈ సంఘర్షణ కి ఓ ముగింపు ఇద్దాం అనుకున్నా….
అమ్మా నాన్న ని ఇద్దరినీ కూర్చోపెట్టి అర్ధం అయ్యేలా అమర్ గురించి చెప్పా…
చివరగా ఒక్క మాట చెప్పా…
” హాల్ వరకు వచ్చి పోయే వాళ్ళ కోసం ఆలోచించి బెడ్ రూం లో కూర్చుని జీవితాంతం నేను ఏడవలేను ”
నేను ధైర్యం గా నా నిర్ణయం చెప్తున్నా…
మీరు కూడా కుంగి పోకుండా నా ఆలోచన ను అర్ధం చేసుకుని.. వీలు ఐతే ఒప్పుకోండి..
ఒప్పుకుంటే మాత్రం మీ కూతురు నిర్ణయం కి,
దానికి మీరు ఇచ్చిన support కి చివరి వరకు గర్వం గానే ఉండండి…
అంతే గర్వం గా అందరకీ చెప్పుకోండి…
నేనేం తప్పు చేయలేదు…
చేయను కూడా…
If you wish to contribute, mail us at admin@chaibisket.com