This Song From Siddharth’s “180” Is Definitely One Of The Most Underrated Songs About Child Education!

Contributed By MV Srikanth
చదవాలి అనుకునే ప్రతి పని పిల్లల గుండె చప్పుడు ఎంత గట్టిదో చాటి చెప్పే పాట ఇది. కారణాలు ఏమిటో తెలియదు గాని, చాలా మందికి ఈ పాట చేరలేదు.
వనామాలి గారు ఎంతో గొప్ప భావోద్వేగాలను చాలా సరళంగా రాసారు. ఆయన సాహిత్యానికి జోహారులు..
కుదిరితే వినండి.. వినిపించండి..!!
పద పదమంది పసి కంటి స్వప్నం,
గడ గడ లాడాని ఈ చేదు సత్యం.
బెదరద అంబరం. కలిపితే స్వరమందరం.
ఎదో నాడు నన్నే చూపించి లోకం మెచ్చగ..
ఆ బడి వైపు ఈ పాదం ఈనాడే సాగని.
ఎన్నో వేలు సంపాదించేటి ఆశే తీరగ.
నా గమ్యాన్ని చేరే ఆ చదువులే చదవని..
వెతలు దాచి నన్నే నవ్వించి, వెలుగంత నాకిచ్చి,
బ్రతికేటి మా అమ్మ కి..
నా రెక్కలు కరిగించి, తన చిరుగులు కనిపించని,
ఓ నూలు చీర కానుకీయనా…
మెరిసే మినుగుర్ల వైపే చూసే ఈ లోకమంత..
చరితే మార్చబోయే, సూర్యుల్నే చూడనంద..
చినుకై, అలలై, వరదై, కడలై, ఎదిగే…
కలనే చిదిమే బలమే కలదా.. విధికే???
కలగన్నది తీరగ సాగే నా దారిలో..
కడగండ్లను దాటుతూ పోనా..
మహారాజుగ మారనా.. ఈ కోటికి,
పదిమందికి నీడనే కానా..
ఇప్పుడీ కథ చూడగా నేటి లోకానికే,
నేనే ఒక వార్తనై రానా…
రచన : వనామాలి గారు
చిత్రం : 180

If you wish to contribute, mail us at admin@chaibisket.com