This Guy’s Take On How Money Controls Everything Around Us Will Amaze You!

 

Contributed by Saheed Syyed

” మనిషి “అన్ని ప్రాణుల్లోకి తెలివైనవాడు !
హు !! ఈ మధ్య ఇది విన్న ప్రతిసారి నాకు నవ్వొస్తుంది ,
నవ్వే కాదు బాధ కూడా వేస్తుంది,
మీరు అనుకోవచ్చు ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటిని కనిపెట్టింది మనిషే కదా,
మరి ఎందుకు నేను ఇలా అంటున్నాను అని.
మనిషి తన తెలివిని ఉపయోగించి కనిపెట్టిన అన్ని వస్తువులతో పాటు,
ఒక “ఎలియన్ ” ని కూడా కనిపెట్టాడు.
అప్పుడు ఆ మనిషి కి తెలియలేదు అది తనకంటే తెలివైనది బలమైనది అవుతుందని.
మనిషికి తెలియని ఎన్నో ప్రశ్నలకు సమాధానం దానికి తెలుసు , ఎన్నో సమస్యల పరిష్కారానికి ఈ ఒక్క ఎలియను ఉంటే చాలు.

ఆ ఎలియన్ కి మాత్రమే తెలుసు ట్రాఫిక్ పోలీస్ నుంచి ఎలా బయటపడాలో అని,

ఆ ఎలియన్ కి మాత్రమే తెలుసు గవర్నమెంట్ తో సులువుగా ఎలా పనిచేయించుకోవాలో అని,

ఆ ఎలియన్ మాత్రమే ఒక కూతురి పెళ్లి చేయగలదు,

ఆ ఎలియన్ మాత్రమే ఒక మెడికల్ సీట్ ని తెప్పించగలదు,

ఆ ఎలియన్ మాత్రమే ఒక కొడుకుని ఇంజినీర్ చేయగలదు,

ఇలా ఇంకా ఎన్నో ఎన్నేనో పనులు ఆ ఎలియన్ చేయగలదు.

ఈ పాటికి తెలిసి ఉంటుంది ఆ ఎలియన్ ఎవరు అనేది,
అవును! అది ”డబ్బు!!” .
ఇప్పుడు ఒప్పుకుంటారా నా మాటలలో నిజం ఉందని.
నిజానికి ఆ ఎలియన్ కి అంత బలం ఇచ్చింది మనిషే,
అన్ని పనులకు ఆ ఎలియన్ ని వాడి దాని బలాన్ని, తెలివిని రోజు రోజు కి పెంచింది మనిషే.
ఇప్పుడు ఆ ఎలియనే లేకపోతే ఆ మనిషే లేడు.
చూడండి ఎంత చోద్యమో మనిషి కనిపెట్టిన ఎలియనే లేకపోతే ఆ మనిషే ఎందుకు పనికిరాదంట ,
ఇప్పుడు మీకు కూడా నవ్వొస్తుంది కదా !
అంతటి పరిస్థితి కి దిగజారాడు మనిషి ,మరి ఇంకా ఎలా అనగలం ఆ మనిషి గొప్పవాడని, తెలివైన వాడని.

కానీ ఎందుకో నాకు ఇంకా అనిపిస్తుంది కొన్ని విషయాలలో ఆ ఎలియన్ ఎందుకు పనికి రాదని , మరి అలాంటి విషయాలలో మనిషే కదా గొప్పవాడు తెలివైన వాడు

ఆ ఎలియన్ కి ఏమి తెలుసు ఒకరి పెదవి అంచున నవ్వు రావాలంటే ఎం చేయాలో అని !
ఆ ఎలియన్ కి ఏమి తెలుసు ఒకరి ఆకలిని ఎలా తీర్చాలో అని !
ఆ ఎలియన్ ఒక మంచి స్నేహితుడిని ఇవ్వలేదు !

ఇప్పుడనిపిస్తుంది ఆ ఎలియన్ ఎందుకు పనికిరాదని !

ఇప్పుడనిపిస్తుంది ఆ ఎలియన్ మనిషి కంటే తెలివైనది కాదు అని !

ఎంతో తెలివైనదాన్ని అని ఫీల్ అవుతున్న ఆ ఎలియన్ ని చూస్తే బాధేస్తుంది.

తాను కనిపెట్టిన ఎలియన్ కింద మనిషి చితికిపోడని , మనిషే గొప్పవడాని మళ్ళీ నిరూపించుకుంటాడాని కోరుకుంటూ.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , ,