This Short Conversation Between Mom And Son With A Twist At The End Is A Must Read!

 

అమ్మ : “నాన్నా ఎనిమిది అయ్యింది ఎప్పుడు లేస్తావ్, ఎప్పుడు కాలేజీ కి వెళ్తావ్…… త్వరగా లే స్నానానికి వేన్నీళ్ళు పెట్టా , మళ్ళీ చల్లారిపోయాయి అంటే వేడిచెయ్యను చెప్తున్నా”

టింగ్ ……. టింగ్ ……. టింగ్ ……. ( ఫోన్ లో వాట్సాప్ మోగింది )

సమయం : పొద్దున్న 08 : 12 గం||

ఆనంద్ : “అబ్బా విసిగించకు అమ్మ….. ఈరోజు సెకండ్ సాటర్డే సెలవు….!” (ఎప్పుడు చూడు ఏదొక నస, ప్రశాంతంగా పడుకోనివ్వరు ఎప్పుడూ… )

టింగ్ ….. టింగ్ ……. టింగ్ …….. ( ఫోన్ లో వాట్సాప్ మోగింది )

(ఆనంద్ నెమ్మదిగా ఒక కన్ను తెరిచి, వాట్సాప్ లో ఉన్న మెసేజ్ లు చదువుతూ ఉంటాడు)

అమ్మ : “లేచావా ! పొద్దున్నే ఫోన్ ఎందుకు రా నీకు…. ఇందాక లేపితే లేవకుండా ఆ పనికిమాలిన ఫోన్ చుస్తే కానీ పొద్దు గడవదా నీకు ?”

ఆనంద్ : “అబ్బా ఏంటమ్మా నేను ఎప్పుడూ ఫోన్ తో ఉండను, నేను ఫోన్ తీసినప్పుడే నువ్వు చూస్తావ్ అంతే !”

అమ్మ : “అది సరే ఇందాక ఏవో టింగ్ టింగ్ అని సౌండు వచ్చింది ఏంటది ?”

ఆనంద్ : “అది ఎదో మెసేజ్ అమ్మా…. వాట్సాప్ అని అందులో అలా వస్తాయ్ లే …… !”

అమ్మ : “వాట్సాప్ అంటే ఏంటి నాన్న ?”

ఆనంద్ : “ఎహె ఇప్పుడే చెప్పా కదా , మెసేజ్ లు పంపుకునేది అని …….. ”

అమ్మ : “ఏంటి అదేంటో తెలియదు, తెలుసుకుందాం అంటే విసుక్కుంటావా ?”

ఆనంద్ : “అబ్బా అలా ఏం లేదు లే ….. ఒక్క నిముషం ఆగు చెప్తా నన్ను నస పెట్టకు ……. ”

అమ్మ ( లోపల ): ( పోన్లే రా …… ఇన్నాళ్లు ఇన్ని సాకిరీలు చేసినందుకు బాగానే విసుక్కున్నావ్ )

అమ్మ : “సరేలే , లేచి స్నానం చెయ్యి తొమ్మిది అవుతుంది…”

(ఆనంద్ తనలో తాను నవ్వుకుంటూ ……. వాట్సాప్ లో రిప్లైలు ఇస్తుంటాడు )

అమ్మ : “వినిపించిందా ?”

ఆనంద్ : “అబ్బబ్బా వినిపించింది లే, నువ్వెళ్లు …. ”

(ఆనంద్ టిఫిన్ తింటూ మళ్ళీ ఫోన్లో చూసి నవ్వుతుంటాడు )

అమ్మ : “తిండి దగ్గర కూడా అదే పని ఏంట్రా నీకు ? ప్రశాంతం గా తినవా నువ్వు ? ఫోన్ కొనివ్వడం మాదే తప్పు, 24 గంటలూ అదే ధ్యాసేనా ?”

( ఆనంద్ పట్టించుకోకుండా మళ్ళీ తన ఫోన్ ప్రపంచం లో తాను ఉంటాడు )

అమ్మ : “సరే ఎక్కడికి వెళ్తున్నావ్ తయారయ్యి ? సెలవు అన్నావ్ కదా … ”

ఆనంద్ : “అదేదో చిన్న పనిలే ….. …… సరే తొమ్మిదిన్నర అయ్యింది , నాకు లేట్ అవుతుంది.”

అమ్మ : “అరేయ్ నిమ్మకాయ నీళ్లు ఏనా తాగి వెళ్లరా ! అసలే ఎండగా ఉంది బయటా .”

( మళ్ళీ ఆ ఫోన్ నే చూసుకుంటూ ఆనంద్ నడుచుకుంటూ వెళ్తాడు బయటికి … )

సమయం : ఉదయం 10 : 00 గం ||

( ఇంట్లో ల్యాండ్ ఫోన్ .. . . . . . . . ట్రింగ్ ట్రింగ్గ్ ట్రింగ్ టింగ్గ్ ……. )

అమ్మ : “హలో ఎవరండీ ?”

ఫోన్లో : “హలో మేడం మేము అపోలో హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాము …… ”

అమ్మ : “హా అపోలో ఆ ?! హా చెప్పండి ….. ”

ఫోన్లో : “మేడం మీ అబ్బాయి కి యాక్సిడెంట్ అయ్యింది మేడం ఇంద్రావతి జంక్షన్ లో …. దగ్గర్లోనివాళ్ళు హాస్పిటల్ లో చేర్చారు , ట్రీట్మెంట్ జరుగుతుంది , మీరు త్వరగా రండి ….. తన ఫోన్ లో కాంటాక్ట్స్ చూసి మీకే కాల్ చెయ్యాల్సొచ్చింది.”

అమ్మ : ( బాధతో ) “అయ్యో భగవంతుడా …….. అయ్యో …… వెళ్ళీ వెళ్లడం విసుక్కుంటూ వెళ్ళాడు , నేను మాట్లాడకుండా ఉండాల్సింది …. ”

ఫోన్లో : “మేడం ……”

అమ్మ : “ఇప్పుడే వస్తా అమ్మ …. ”

( అమ్మ హాస్పిటల్ లో తన కొడుక్కి ఆపరేషన్ జరుగుతున్న ఆపరేషన్ థియేటర్ దగ్గరకి చేరుకుంటుంది …. )

అమ్మ : (బాధపడుతూ … ) “దేవుడా …. వీడికే ఎందుకు ఇలా జరగాలి …. నేనేం పాపం చేసాను …”

డాక్టర్ : “మీ అబ్బాయి పేరూ ….. !!!”

అమ్మ : ( బాధపడుతూ ) “ఆనంద్ అండీ ….. మా వాడికి ఏం కాలేదు కదా అండీ …చెప్పండి డాక్టర్ గారు, అసలే వాడికి నేను తప్ప ఎవరూ లేరు …. ”

డాక్టర్ : “మీ వాడిని సమయానికి అక్కడున్న స్థానికులు తీసుకొచ్చారు, టిప్పర్ లారీ వచ్చి ఢీకొట్టడం తో మీ అబ్బాయికి వెన్నెముక విరిగింది….. సర్జరీ చెయ్యాలి అమ్మ, కాష్ వివరాలు అవి మా నర్స్ మీతో మాట్లాడతారు.”

అమ్మ : “వాడు జాగ్రత్త గానే ఉంటాడు డాక్టర్….. అలా జరిగి ఉండదు డాక్టర్ …. ”

డాక్టర్ : “మీ వాడి ఫోన్ చూస్తే మాకు అర్ధమయ్యింది ఏంటి అంటే, రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఫోన్లోనే నిమగ్నమయి ఉన్నాడు. అసలే జంక్షన్ అది….. ”

అమ్మ : ( బాధపడుతూ ) “అయ్యో దేవుడా , ఇంట్లో కూడా ఉదయాన్నే చెప్పాను, దిక్కుమాలిన ఫోన్ ని పక్కన పడెయ్యరా అని …. వింటే గా . ఏం పని ఉంటది డాక్టర్ వీళ్ళకి ఫోన్లో అసలు ….. ”

డాక్టర్ : “మీరు బాధపడకండి అమ్మ …… మేము మా వంతు కృషి చేస్తాం …. ఈరోజుల్లో పిల్లలు అలాగే ఉన్నారు.”

(టింగ్ …… టింగ్ ……. టింగ్ ……. వాట్సాప్ మెసేజ్ వచ్చింది )

అమ్మ : “ఉదయం కూడా ఇలాగే సౌండ్ వచ్చింది డాక్టర్ ….. ఏమిటో ఒకసారి చూడండి.”

డాక్టర్ : ( వాట్సాప్ మెసేజ్ లు చూడబోయి స్టేటస్ చుసిన డాక్టర్ కి …….. )”If you love your mom and want to show her that she means the world to you, put a picture of her as your profile photo. Then copy and paste this to your status.”

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , ,