Heard Pranav’s New Rap & Wondering What It Means? Here’s The Meaning Behind It

 

తెలుగు లో, తెలుగు పదాలలో ఉన్న అందాన్ని, అద్భుతాన్ని, తన rap తో చాటి చెప్తున్న మన తేట తెలుగు rapper ప్రణవ్ చాగంటి. తను పాడిన ప్రతి ఒక్క rap లో ఒక ప్రత్యేకత, తెలుగు భాష గొప్పతనాన్ని చెప్పే అంశం ఉంటుంది. ఈ మధ్య తను ఒక rap ని పాడారు. దాని పేరు “Modern Dvyakshari”. World’s first ever 2-letter Rap ఇది. ఇందులో కేవలం రెండు హల్లులు మాత్రమే ఉంటాయి. ఈ ప్రక్రియ ని ద్వ్యక్షరి అంటారు.

 

ద్వ్యక్షరి అంటే?:
కేవలం రెండు హల్లులతో ఒక పద్యాన్ని కానీ, కవిత్వాన్ని కానీ, శ్లోకాన్ని కానీ కూర్చితే దాన్ని ద్వ్యక్షరి అంటారు. ద్వ్యక్షరి చిత్రకవిత్వం లో ఒక భాగం. ఆ హల్లుల గుణింతాలతో పాటు అచ్చులు ఏవైనా ఎన్నైనా ఉండచ్చు. నంది తిమ్మన రాసిన “పారిజాతాపహరణము” అనే కావ్యం లో ఒక పద్యం ద్వ్యక్షరిలో ఉంటుంది.

 

మనమున ననుమానము నూ
నను నీనామ మనుమనుమననమునునేమ
మ్మున మాన నన్ను మన్నన
మను మను నానామునీనమానానూనా!

 

భావం:
ముని శ్రేష్ఠుల అందరి ప్రమాణాలకీ ఏమాత్రం వెలితిలేనివాడా! మనస్సులో అనుమానం పొందను . నీ నామపు మంత్రజపం చేసే నియమాన్ని మానను. మన్ననతో నన్ను జీవించుమని దీవించు. అని ఈ పద్యం అర్ధం.

 

పై పద్యం లో లానే ప్రణవ్ చాగంటి ‘న’ ‘మ’ హల్లులని తన rap లో వాడారు. కానీ ప్రేమించిన అమ్మాయి కి ప్రియుడు చేసే ప్రమాణంగా ఈ rap ని compose చేశారు.

 

సాహిత్యం:
నీ నామమ్మను మననమ్మును నేను మాననేమైనా
నీ నామ మననమ్మును నేను మాననేమైనా
నీ మనమున నా నామ మననమ్మనుమానమైనా,
నీ నామ మననమ్మును నేను మాననేమైనా!!

 

నా నామము నీ మనమున మననమ్ముని నేన్నమ్మను
నిన్ను నమ్మి నమ్మి నా నెమ్మనముని నేనమ్మను
మన్నే మిన్నైనా, మిన్నే మన్నైనా
నీ నామ మననమ్మును నేను మాననేమైనా!

 

మిన్నానే మన్ననమే, నన్నెన్నినా
మనమునాననీను, నీ మననమ్మాననేను
నీ నన్నే, మీ నాన్నెన్నెన్నన్నా , నా
మనమునాననీను, నీ మననమ్మాననేను

 

మానిన నా మనమే మన్ను మన్నౌనే మైనా,
మానిన నా మనమే మన్ను మన్నౌను.
నీ మననమున్న, నేనన్నమైనా మాను మైనా
నీ మననమున్న , నేనన్నమైనా మాను

 

మొన్న మీ నాన్న, నిన్న మా నాన్న
నిన్ను నన్నెన్నెన్నన్నా మాన నే నీ మననమ్మును
మీ నాన్న నిన్న నన్నమ్మమీనన్నా నేనిన్నా, నా మైనా, నే మాన నీ మననమ్మేమైనా

 

నిన్ను నన్ను మనమని, నేను నిన్న మొన్నన
మౌనాన్ని మానినా, మన్ను మన్ను మనమున.

నిన్నమ్మననమనన్న నా మనమానిన్నా,
నిన్నమ్మననమనన్న నా మనమానిన్నా,
మీ నాన్నన్న నేను మన్నౌనా మైనా!!??

 

మనముననుమానమున్నా నీ మననం మానను
మనమున నీ మననమ్మును నేమమ్మున మానను
మానను నీ మననమ్మును, మానను నీ మననమ్మును
మనము మన్ను మన్నైనా , మానను నీ మననమ్మును

 

అర్థం:
నీ గురించి ఆలోచించడం ఆపను నేను, ఏది ఏమైనా. 
ఏది ఎదురొచ్చిన, నా మనస్సులో నువ్వు ఉంటావు.
నా గురించి నీకు వేరే ఆలోచనలు ఉన్న,  నిన్ను తలుచుకోవడం నేను ఆపను.
నా గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అన్న అది నేను నమ్మను.అలా నమ్మి నన్ను నేను మోసం చేసుకోను. 

 

భూమి ఆకాశమైన, ఆకాశం భూమిగా మారినా, నేను నిన్ను స్మరిస్తూనే ఉంటాను.
ఇప్పటికప్పుడు నాకు పేరు ప్రఖ్యాతులు వచ్చిన, నేను నిన్ను స్మరిస్తూనే ఉంటాను. 
నా మనస్సాక్షి ని మార్చడం, నా మనస్సు నుండి నిన్ను దూరం చేయడం, ఎవరి వల్ల కాదు.
నీ గురించి ఆలోచించడం నేను ఆపను.

 

మీ తండ్రి ఎంత ప్రయత్నించినా  నా మనస్సు మార్చుకోను.
అలాంటి పరిస్థితి వస్తే, ఆ క్షణమే నేను మట్టి లో కలిసిపోతాను.
నీ ఆలోచనలో ఉన్న నాకు వేరే అన్నం అక్కర్లేదు, (ఆకలే దరిచేరలేదు).
మీ తండ్రి, మా తండ్రి ఎంత ప్రయత్నించిన , నీ మీదున్న నా ప్రేమ పోదు ఏమైనా..

 

ప్రియతమా! నన్ను నా అమ్మని , మీ నాన్న ఎన్నో మాటాలన్న, నా ప్రేమ బలంగానే నిలుస్తోంది.
నువ్వు నేను ఒకటే అని నేను నమ్మాను, అందుకే నా మౌనాన్ని వీడి నా నిజమైన ప్రేమని తెలుపుతున్నాను.
కానీ నా మనస్సు ముక్కలైంది.
నా మనస్సు నిన్ను నా అమ్మ తో సమానంగా భావిస్తోంది. నేను నిన్నెప్పుడు గౌరవిస్తూనే ఉంటాను.

 

కానీ మీ నాన్న చర్యలు నన్ను అవమానపరిచాయి. 
నా మనస్సులో ఎన్ని సందేహాలు వచ్చిన, నిన్ను ప్రేమించడం ఆపను.
నా గుండె లోతుల్లోంచి నీ పై ఉన్న ప్రేమ తరగదు.
నా గుండె చల్లబడిన, నీ ఆలోచనని నేను ఆపను. 

 

Lyrics in Tinglish:
Nee naamamu anu mananammunu nenu maananu emaina
Nee naama mananammunu nenu maananu emaina
Nee manamuna Naa naama mananamu anumaanamaina
Nee naama mananammunu nenu maananu emaina

 

Naa naamamu nee manamuna mananammunu nenu nammanu
Ninnu nammi nammi Naa nemmanamuni nenu ammanu
Manne minnainaa, minne mannaina
Nee naama mananammunu nenu maananu emaina

 

Minnaaney mannaname nannu enninaaa
Manamunu aananeeyanu, nee mananamu maana nenu
Nee nanne Mee naanna ennenni annaa, Naa
Manamunu aananeeyanu, nee mananamu maananu nenu

 

Maanina Naa maname mannu mannavunu maina (2)
Nee mananamunna nenu annamainaa maanu maina(2)

 

Monna Mee nanna, ninna maa nanna
Ninnu nannu ennenni annaaa maana nenu nee mananammunu
Mee nanna ninna nannu amma meena annaa neninnaa
Naa maina, ne maana nee mananammemaina

 

Ninnu nannu manam ani, nenu ninna monnana
Mounaanni maaninaa, mannu mannu manamuna

 

Ninnu Amma ani anamani Anna Naa manamu aana innaa (2)
Mee nanna Anna nenu mannavunaa mainaa????

 

Manamuna anumaanam unna nee mananamu maananu
Manamuna nee mananammunu nemammuna maananu
Maananu nee mananammunu(2)
Manamu mannu mannainaa
Maananu nee mananammunu

 

Meaning:
I will never stop thinking about you, no matter what
Come what may, you’ll always be on my mind.
I will not stop even if you have second thoughts about me in your heart.

 

I wouldn’t believe it even if I come to know about your yearning desire for me.
I would never betray myself by trusting you.(just like that)
Even if the Earth turns in to Heaven or vice versa, I’d never stop thinking about you.
Even if I’m showered with all the name, fame and wealth,
nobody can shake up my conscience nor take you out of my heart.

 

I wouldn’t stop thinking about you
nor take it to my heart even if your father stops me from doing so.
The moment I stop thinking about you, my whole life would turn to dust.
I could live with out food, simply because I can live my life thinking about you.

 

It was your father then and it is my father now who want me to stop doing all this but my love for you will never die down.
Oh my love! Your father had abused me and my mother, yet my love for you stands strong.
I believed, you and I are one, which was conveyed by breaking my silence and expressing my true love for you.

 

Yet my heart has been broken into pieces.
I listened to my heart’s calling and now you’re as important as mother is to me.
I’ve always respected you, but at your father’s behest I have been insulted.
Whatever doubts may arise in my heart, I’d never stop loving you.

 

With all due love from the depths of my heart, I will never stop loving you.
Even if my heart turns cold, I’ll never ever quit thinking about you, I’ll never stop loving you.

 


 

Oka Breakup song, andhulo telugu rap, andhulo “dvyakshari”. Pranav Chaganty nuvvu thop anthe. You must listen it. Vilaithe lyrics chadavandi majaa vasthadi..

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , ,